యాత్ర వరల్డ్ వైడ్ ఫుల్ రన్ కలెక్షన్స్

0

మహీ వీ. రాఘవ్ దర్శకత్వంలో స్వర్గీయ వైయస్సార్ జీవితంలోని చారిత్రాత్మక పాదయాత్రను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ పూర్తయింది.

కొన్ని ఏరియాలలో తప్ప మిగతా ఏరియాలలో ఈ సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎస్టిమేటెడ్ థియేట్రికల్స్ రైట్స్ వ్యాల్యూ తీసుకుంటే ఆ ఫిగర్ రూ. 12 కోట్లు. కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రం 7.28 కోట్ల షేర్.. అంటే అరవై శాతం మాత్రమే రికవర్ చేయగలిగింది. సీడెడ్.. గుంటూరు.. నెల్లూరు లాంటి ఏరియాల్లో కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నా నైజామ్.. ఉత్తరాంధ్ర ఏరియాల్లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయలేకపోయింది. ఓవర్సీస్ లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ప్రపంచవ్యాప్తంగా ‘యాత్ర’ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 1.00 cr

సీడెడ్: 1.64 cr

ఉత్తరాంధ్ర: 0.51 cr

కృష్ణ: 0.57 cr

గుంటూరు: 1.12 cr

ఈస్ట్ : 0.31 cr

వెస్ట్: 0.41 cr

నెల్లూరు: 0.40 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 5.96 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.52 cr

ఓవర్సీస్: 0.80 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 7.28 cr
Please Read Disclaimer