అమ్మాయిలు టాయిస్ అంటున్న అర్జున్ రెడ్డి

0అమ్మాయిలు బొమ్మల్లాంటివాళ్లు. వారితో గేమ్స్‌ ఆడుకోవచ్చు’ అంటున్నాడు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఏ మంత్రం వేసావె’. శ్రీధర్‌ మర్రి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శివాని సింగ్‌ హీరోయిన్. హోళీ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు.

ట్రైలర్‌లో..‘గేమింగ్‌ అతని ప్రపంచం. గ్యాడ్జెట్స్‌ అతని జీవితం. బాధ్యత లేదు’ అంటూ విజయ్‌ గురించి హీరోయిన్ వివరిస్తుంది. ఇందుకు విజయ్‌ ‘అమ్మాయిలు బొమ్మల్లాంటివాళ్లు. వారితో గేమ్స్‌ ఆడుకోవచ్చు’ అంటాడు. అప్పుడు శివానీ..‘అయితే గేమ్‌ ఆడాలని ఉందా?’ అని విజయ్‌ని అడుగుతుంది. ‘నీతో తప్పకుండా గేమ్‌ ఆడతా’ అంటాడు విజయ్‌. అక్కడి నుంచి అతనికి కష్టాలు మొదలవడం ట్రైలర్‌లో చూపించారు. అర్జున్ రెడ్డి కి ముందుకు ఒప్పుకున్న సినిమా ఇది. అమరి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.