దీపావళి ఏడు చేపల కథ పోస్టర్!

0

బోల్డ్ సినిమాలు మనకు ఇప్పుడు తెలుగులో కామన్ అయ్యాయి. వరసబెట్టి కొత్త తరం ఫిలిం మేకర్స్ బోల్డ్ కంటెంట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేకోవలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏడు చేపల కథ’. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూత్ ని.. బూతుని ఇష్టపడే ఆడియన్స్ ను బాగానే మెప్పించింది.

తాజాగా ‘ఏడు చేపల కథ’ టీమ్ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. యాజ్ యూజువల్ ఇది కూడా కాస్త అడల్ట్ టచ్ ఉన్నదే. ‘హ్యాపీ టెంప్టింగ్ దివాలి’ అంటూ విష్ చేశారు. టెంప్ట్ రవి ఒక చిన్న తువ్వాలు కట్టుకుని కూర్చున్నాడు. ఎన్నో రకాల క్రాకర్స్ ఉండగా చిచ్చు బుడ్డిని మాత్రమే చిలిపిగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో..? ఇక ఇవన్నీ సరేలే అనుకుంటే కింద క్యాప్షన్ “#మీటూ నుండి #వుయ్ టూ” అని ఇచ్చారు. అదండీ సంగతి.

పండగనాడు బూతేంటనుకుంటారో.. లేదా నవరసాల్లో శృంగారం ఒకటి. ఆ శృంగార రసాన్ని కాస్త మెలిపెడితే ఈ అడల్ట్ కామెడీ రసం వస్తుందని సరిపెట్టుకుంటారో మీ ఇష్టం.. ఏదేమైనా ఈ టెంప్ట్ రవి తెలుగుజనాలను ఫుల్లుగా నవ్వించేవరకూ ఊరుకునేలా లేడు!
Please Read Disclaimer