ఏడు చేపల కథ ట్రైలర్ : మంట మేడమ్ అంటున్న టెంప్ట్ రవి!

0

బూతు సినిమాలపై చాలా రోజులగా చర్చ సాగుతోంది. సంప్రదాయవాదులు.. కల్చర్ ను కాపాడుతున్నామని భ్రమలో ఉండేవాళ్ళు ఈ బూతుసినిమాలపై విరుచుకుపడుతున్నారు. ఇక ఈమధ్య చాలా రిలీజ్ అయిన అడల్ట్ సినిమాల తరహాలోనే ‘ఏడు చేపల కథ’ మొదటి ట్రైలర్ తోనే సంచలనం సృష్టించింది.. విమర్శలు కూడా మూటగట్టుకుంది. తాజా ‘ఏడు చేపల కథ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ టాక్ లోకి వెళ్లేముందు చిన్న మాట. హారర్ సినిమాలో దెయ్యం ఉండకూడదు.. స్పోర్ట్స్ సినిమాలో ఆట ఉండకూడదు.. క్రైమ్ థ్రిల్లర్లో హత్యలు ఉండకూడదు అన్నట్టుగా ‘బూతు సినిమాల్లో బూతు ఉండకూడదు’ అనే లాజిక్ చెప్తున్నారు. బూతు సినిమాలో బూతు ఉండక.. భక్తి..వేదాంతం.. ఉంటాయా? సో.. లాజిక్ ఈజ్ సింపుల్. బూతు సినిమాలో బూతు ఉంటుంది. దానికి A సర్టిఫికేట్ కూడా ఉంటుంది. మీరు 18 కంటే తక్కువ అయితే(మానసికంగా అయినా) ఈ ట్రైలర్ కు.. సినిమాకు దూరంగా ఉండమని సెన్సార్ చెప్తోంది. ట్రైలర్ టాక్ కు దూరంగా ఉండండి అని మేము చెప్తున్నాం. సెన్సారును శ్రద్ధగా ఫాలో అవ్వాలిగా!

ఇక ట్రైలర్ టాక్ లోకి వెళ్ళిపోదాం. మనకు ఆల్రెడీ ఫస్ట్ ట్రైలర్ లోనే టెంప్ట్ రవి ఇంట్రో ఇచ్చేశారు. హీరో పాత్ర రవికి ఒక జబ్బు ఉంటుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే “నువ్వు అసలు టెంప్ట్ కాకూడదు రవా” అంటాడు. అయితే మన హీరోను చూస్తే ఆడవాళ్ళు టెంప్ట్ అయిపోతారు. వాళ్ళు టెంప్ట్ అయితే రవికి నిగ్రహించుకునే శక్తి లేదు. అది ఫస్ట్ ట్రైలర్ కథ. సెకండ్ ట్రైలర్ లో కాస్త డోస్ పెంచారు. మళ్ళీ డాక్టర్ కు – రవికి మధ్యలో ఒక సంభాషణ ఉంది “ఈ జబ్బు వల్ల నువ్వు త్వరగా నీరసించి పోతావు కాబట్టి నీ పనులన్నీ వేరేవాళ్ళతో చేయించుకో” అని చిన్న పాజ్ ఇచ్చి “పనులంటే ఏటో అర్థం అయిందిగా” అంటూ డాక్టర్ ఫినిషింగ్ టచ్ ఇస్తాడు.

రవిని చూసి టెంప్ట్ అయిన ఒక లేడీ రవిని అమృతాంజన్ తీసుకురమ్మంటుంది. “ఎలా వాడాలో తెలుసా?” అని ప్రశ్నిస్తుంది. “ఫ్లమ్ బాగా ఉన్నపుడు చెస్ట్ కు పూసుకుంటే రిలీఫ్ ఇస్తది మేడమ్” అంటాడు. “అక్కడ ఏ రవి అయినా పూసుకుంటాడు. టెంప్ట్ రవి.. ఎక్కడ పూసుకోవాలో చెప్తా ప్యాంట్ విప్పు” అని అదో రకంగా అంటుంది. అవాక్కవ్వడం రవి వంతు.. అవాక్కు ఎమోషన్ ను కంటిన్యూ చేస్తూనే సడెన్ పైకి లేచి “మంట మేడమ్” అంటూ వినయంగా విధేయంగా సమాధానం ఇస్తాడు. ఫస్ట్ ట్రైలర్ అంత కళాత్మకంగా లేదు కానీ ఘాటుగా అయితే ఉంది. డైలాగులే కాదు కాసిన్ని బోల్డ్ సీన్లు కూడా ఉన్నాయి. ట్రైలర్ ఎండ్ లో ఈ బాధలు పడలేక “దొరికినోళ్ళు దొరికినట్టు వాయిస్తున్నారు.. ఏంటో నా జీవితం” అని స్వగతం మాట్లాడుకునే సమయంలో బ్యాక్ గ్రౌండ్ స్కోరు అదిరిపోయింది. ఆలస్యం ఎందుకు.. టెంప్ట్ రవి బాధలు చూసేయండి.
Please Read Disclaimer