ఏడు చేపల కథ టీజర్ టాక్: టెంప్ట్ రవి బాధలు

0

హెచ్చరిక: ఈ టీజర్ టాక్ 18+ వారికి మాత్రమే. అంతకంటే తక్కువ వయసున్న వాళ్ళు వెంటనే దీన్ని చదవకుండా ఆపేసి వేరే ఆర్టికల్ చదవండి. (మరి అడల్ట్ సినిమా కహాని అడల్ట్ కంటెంట్ తోనే ఉంటుంది కదా?) అయినా.. నేను చదువుతాను నన్నెవ్వడు ఆపేది అంటే మాత్రం చదువుకోండి. మీ ఇష్టం. ముందే చెప్తున్నా.. మీరు టెంప్ట్ అయ్యే అవకాశం ఉంది.

‘ఏడు చేపల కథ’.. ఎప్పటినుండి వినుంటాం ఈ టైటిల్ ని? కథలు వినడం మొదలు పెట్టినప్పటి నుంచి. ఇది ఆ ఏడు చేపల కథ కాదు. ఏడు అడల్ట్ చేపల కథ. టీజర్ స్టార్ట్ కాగానే హీరో తో డాక్టర్ ఇలా అంటాడు “నీకున్న జబ్బుకి అస్సలు టెంప్ట్ కాకూడదు రవా..!” దానికి సమాధానంగా హీరో “మీకు తెలిసిన నా పేరు రవి. నాకింకో పేరుంది సార్….. టెంప్ట్ రవి”. ఇక అవాక్కవ్వడం డాక్టర్ వంతు.

కంటిన్యూ చేస్తూ “నా ముందు ఆడవాళ్లెవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్” అంటూ నీళ్ళు నములుతూ “టెంప్ట్ అయిపోతాను” అంటాడు. “వాళ్ళెందుకు టెంప్ట్ అవుతున్నారో తెలియడం లేదు సార్” అంటూ వాక్యం పూర్తి చేస్తాడు.

“ఇలాటి జబ్బులన్నీ కొత్తగా ఇంటున్నాను అని డాక్టర్” అంటే మరో కట్ షాట్ లో హీరో తో మాంచి మూడ్ లో ఉన్న ఒక లేడీ “అప్లోడ్ అవుతూ ఉంది.. ఐదు నిముషాల్లో అయిపోతుంది” అంటుంది.

“నీకుంటదమ్మో.. మాయమ్మకు చెబుతా!” అంటూ రొప్పుతూ చెబుతాడు హీరో. దీనికి ఇంతో ఓ హెన్రీ కథల్లో ఉండే ఫైనల్ క్లైమాక్స్ ట్విస్ట్ హీరోయిన్ “#MeToo” అంటుంది.

టీజర్లకు ఆస్కార్ అవార్డులు ఉంటే.. అందులో అడల్ట్ కామెడీ సెక్షన్ ఉంటే..వెంటనే దీనికి బెస్ట్ టీజర్ అవార్డు ఇచ్చేయొచ్చు. థీమ్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. విజువల్స్.. అన్నీ పర్ఫెక్ట్. వాట్ ఎ టెంప్టింగ్ టీజర్.. మీరు రెండో సారి చూడకపోతే డోనాల్డు ట్రంపు లేదా హుస్సేన్ సాగర్ కంపు మీద ఒట్టు…!

హీరో అభిషేక్ ఇంప్రెసివ్.. డైరెక్టర్ ఎస్జె చైతన్య తను ఎంచుకున్న థీమ్ కు ఫుల్ జస్టిస్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ టీ శంకర్ కూడా సబ్జెక్ట్ విని ఫుల్ గా టెంప్ట్ అయి మ్యూజిక్ ఇచ్చినట్టున్నాడు.. ఇక టెంప్ట్ కావడానికి మీదే ఆలస్యం.. ఆ ఊ ఈ హా..!
Please Read Disclaimer