చరణ్ నాగచైతన్య ల మధ్య పోటీ

0ramcharan-newమెగా స్టార్ తనయుడు చరణ్ కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్య ల మధ్య పోటీ ఏంటి అని అనుకుంటున్నారా ! విషయానికొస్తే…చరణ్ నటించిన ‘ఎవడు’ డిసెంబర్ 19 న విడుదల అవుతుంటే నాగచైతన్య కూడా ‘ఆటో నగర్ సూర్య’ గా అదేరోజు రానున్నాడు. ఆర్.ఆర్ మూవీస్ పతాకంపై నిర్మించబడిన ‘ఆటో నగర్ సూర్య’ సినిమా అనివార్య కారణాల వలన విడుదలలో ఆటంకం ఏర్పడింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా నిర్మాతకు ఆ సమస్యలు తీరాయని ఈ సినిమాని డిసెంబర్ 19 న విడుదల చేయాలనీ అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.

వీలైనంత త్వరగా అన్ని పనులు పూర్తి చేసి ఈ సినిమాని ‘ఎవడు’ పోటీగా దించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.