ఓవర్సీస్ లో యాత్రకు మంచి బేరం

0ఉమ్మడి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుప్రజలపై చెరగని ముద్ర వేసిన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇతర ప్రమోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై డీసెంట్ అంచనాలే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను ఒక ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ రూ. 4 కోట్లకు తీసుకుందట. ప్రముఖ తెలుగు హీరో లు ఎవరూ సినిమాలో లేకున్నా ఈ రేటు పలికిందంటే దానికి సినిమా పై ఉన్న మంచి బజ్ కారణం గా చెప్పాలి. ఈ సినిమాలో వైఎస్ పాదయాత్ర చేయడం మొదలు పెట్టిన నాటి నుండి సీఎమ్ గా ప్రమాణ స్వీకారం చెసే రోజు వరకూ జరిగిన సంఘటనలను ప్రముఖంగా చూపిస్తారట.

ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ చిల్లా – శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 21 న రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.