బన్నీ స్టెప్పులకు ఆమె కూడా ఫిదా

0

టాలీవుడ్ హీరోల్లో మంచి డాన్సర్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో అల్లు అర్జున్ పేరు ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్ కు డాన్స్ తోనే మంచి స్టార్ డం దక్కింది. హీరోగా పరిచయం కాకుండానే డాడీ సినిమాలో డాన్సర్ గా అల్లు అర్జున్ కనిపించాడు. తన ప్రతి సినిమాలో కూడా డాన్స్ లతో మెప్పించేందుకు చాలా కష్టపడుతూ ఉంటాడు. బన్నీ డాన్స్ కు సాదారణ జనాలు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు కూడా ఫ్యాన్స్ అవుతారు.

కేవలం తెలుగు సెలబ్రెటీలు మాత్రమే కాకుండా పలువురు బాలీవుడ్ వారు కూడా అల్లు అర్జున్ డాన్స్ అంటే తమకు ఇష్టం అంటూ గతంలో చెప్పుకొచ్చారు. తాజాగా మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ జరీన్ ఖాన్ కూడా తనకు బన్నీ డాన్స్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో మీకు ఎవరి డాన్స్ ఇష్టం అంటూ ఆమెను ప్రశ్నించగా మరో ఆలోచన లేకుండా తనకు బన్నీ డాన్స్ అంటే చాలా ఇష్టం. అతడి డాన్స్ మూమెంట్స్ అద్బుతం అంటూ చెప్పుకొచ్చింది.

గోపీచంద్ హీరోగా నటిస్తున్న ‘చాణక్య’ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం కాబోతున్న జరీన్ ఖాన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సౌత్ లో షూటింగ్స్ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. షూటింగ్ లోని ప్రతి ఒక్కరు కూడా చాలా సీరియస్ గా వర్క్ పై డెడికేషన్ తో చేయడం జరుగుతుందని.. ప్రతి టెక్నీషయన్ కూడా పూర్తి ఎఫర్ట్ పెట్టి చేస్తున్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. సౌత్ స్టార్స్ చాలా కష్టపడతారని ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న తర్వాత తనకు అర్థం అయ్యిందని జరీనా చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer