జింగాట్ అంటూ.. కుమ్మేశారుగా

0బాలీవుడ్ లో ఓ సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు ప్రమోషన్స్ పర్వం మొదలవుతూనే ఉంటుంది. చిన్నా సినిమా కూడా ఎంతో కొంత జనాల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాయి. సినిమా రిలీజ్ తరువాత రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తరువాత సంగతి కానీ ముందు సినిమాకు క్రేజ్ ఏ స్థాయిలో ఉంది అనేది చాలా ముఖ్యం. ఆ విషయం ధడక్ టీమ్ కు బాగా తెలిసినట్టు ఉంది.

అందుకే ప్రతి ప్రమోషన్ లో ఎదో ఒక కొత్తధనం ఉండేలా చూసుకుంటోంది. ప్రమోషన్స్ అంటే ఎదో ప్రెస్ మీట్ తో ఆకర్షించడం కాదు. సినిమాకు సంబంధించిన స్టఫ్ ఎంతవరకు క్లిక్ అయ్యేలా రిలీజ్ చేస్తున్నారు అనేదే ప్రమోషన్స్. ఆ విషయంలో ధడక్ గ్యాంగ్ చాలా క్లిక్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన జింగాట్ అనే మరో సాంగ్ కూడా వైరల్ అవుతోంది. సైరత్ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

అయితే ఆ సినిమాలో ఈ సాంగ్ ఎంతగా క్లిక్ అయ్యిందో రీమేక్ లో కూడా అంతే బాగా రిజల్ట్ చూపించారు. హీరోయిన్ జాన్వీ చాలా అందంగా కనిపిస్తోంది. హీరో ఈషన్ ఖాతార్ కూడా స్టైలిష్ లుక్ లో అమ్మాయిలను ఆకర్షించేలా ఉన్నాడు. ఇద్దరి మధ్య సాగే రొమాంటిక్ మూమెంట్స్ పాటలో హైలెట్ గా కనిపిస్తున్నాయి. అజయ్ – అతుల్ కంపోజ్ చేసిన ఆ సాంగ్ ని వారే సొంతంగా పాడారు. వింటుంటే పక్కా స్టెప్పులు వేయాలనిపిస్తోందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.