ధనం ఆకర్షించాలంటే.. పర్సులో పెట్టుకోకూడని వస్తువులు..!

0vallet-for-menపర్సులు, వాలెట్స్ ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తారు. ఇవి లేకుండా బయటకు వెళ్లడం కష్టం. డబ్బులు, క్రెడిట్, డెబిట్ కార్డ్స్, మరేదైనా ముఖ్యమైన బిల్ పేపర్స్ ని పర్స్ లో పెట్టుకుంటారు. అయితే.. ఈ పర్స్ లో పెట్టుకోవాల్సిన వస్తువుల విషయంలో కూడా.. వాస్తుని ఫాలో అవ్వాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అప్పుడు ఆర్థికంగా బావుంటందని సూచిస్తున్నాయి.

చాలా సందర్భాల్లో పర్స్ లో ఏం పెట్టుకుంటున్నారో కూడా.. మరిచిపోయి.. ఏవి పడితే అవి పెట్టేస్తుంటారు. కొన్నిసార్లు పర్సు నిండా పేపర్లు పేరుకుపోయి ఉంటాయి. కానీ ఇలా అవసరమైన, అనవసరమైన వస్తువులను పర్స్ లో పెట్టుకోవడం వల్ల.. మీరు డబ్బు కోల్పోవడానికి కారణమవుతుందట.

ధనం, అదృష్టం పొందాలంటే.. పర్స్ లో కొన్ని వస్తువులను పెట్టుకోకూడదు. అలాగే కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల.. ధనాన్ని ఆకర్షిస్తాయి. ఎలాంటి వస్తువులు నెగటివ్ ఎనర్జీని ఆకర్షించి, ధనం కోల్పోవడానికి, దురదృష్టానికి కారణమవుతాయి, ఎలాంటి వస్తువులను పర్సులో పెట్టుకోకూడదో చూద్దాం..

పర్స్ అనేది ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించినది. కాబట్టి దీన్ని ఎమోషనల్ ఎనర్జీతో మిక్స్ చేయరాదు. కాబట్టి మీ కుటుంబ సభ్యులు లేదా పిల్లల ఫోటోలను పర్స్ లో పెట్టుకోకూడదు. అలాగే చనిపోయిన వాళ్ల ఫోటోలు కూడా పర్స్ లో పెట్టుకోకూడదు. కావాలంటే.. ఫోన్లో కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టుకోవచ్చు.

పర్స్ ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఏటీఎమ్ స్లిప్స్, ఫుడ్ బిల్స్, చూయింగ్ గమ్ పేపర్స్, చాక్లెట్ పేపర్స్ తో నిండిపోకూడదు. ఇలా డేట్ అయిపోయిన పేపర్స్ ని పర్స్ లో పెట్టుకోవడం వల్ల పర్స్ అస్తవ్యస్తంగా మారుతుంది. దీనివల్ల డబ్బు కూడా మీతో అస్తవ్యస్తంగానే ఉంటుంది. కాబట్టి.. పర్స్ ఎప్పుడూ శుభ్రంగా, సరైన విధంగా ఉంటే.. ధనం ఆకర్షిస్తుంది.

ఎట్టిపరిస్థితుల్లోనూ పర్స్ ని నేలపై పెట్టకూడదు. రెస్ట్ రూం, రెస్టారెంట్స్, ఆఫీస్ ఎక్కడా కూడా.. పర్స్ ని కింద పెట్టకూడదు.

చాలామంది కాయిన్స్ ని పర్స్ లో పడేస్తుంటారు. దీనివల్ల కొన్నిసార్లు ఆ కాయిన్స్ కోసం చాలా సేపు వెతకాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాయిన్స్ కిందపడిపోతుంటాయి. కాబట్టి.. చిల్లర పెట్టుకోవడానికి సపరేట్ గా చిన్న పర్స్ పెట్టుకోవాలి లేదా పాకెట్ పెట్టుకోవాలి.

కొన్ని రకాల ఫోటోలు నెగటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఎవిల్ సంకేతాలు, హింస, యుద్ధం, పోర్న్ కి సంబంధించిన ఫోటోలను పర్స్ లో పెట్టుకోకూడదు.

పర్స్ లో తాళాలను పడేసే అలవాటు ఉందా.. అయితే.. మీరు మీ పర్స్ లో చెత్తను క్రియేట్ చేస్తారు. పాజిటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేయడానికి మెటల్ తో తయారు చేసిన వస్తువులైన తాళాలు, కాయిన్స్ ని పెట్టుకోవడానికి ఒక పాకెట్ ని కేటాయించండి.

మీ ఏటీఎమ్, క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించిన పిన్ నెంబర్స్ ని పర్స్ లో పెట్టుకోకండి. ఒకవేళ పర్స్ ని ఎవరైనా దొంగలించినప్పుడు.. మీ డబ్బును వాళ్లు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఆర్థికంగా ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాబట్టి.. ఎలాంటి పాస్ వర్డ్స్ ని పర్స్ లో పెట్టుకోకూడదు.

ఒకవేళ మీరు ఉపయోగిస్తున్న పర్స్ చిరిగిపోయి, డ్యామేజ్ అయి ఉంటే.. అది నెగటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేసి.. డబ్బు కోల్పోవడానికి కారణమవుతుంది.

పర్స్ లో నోట్లను ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. అలాగే మడతపెట్టి పెట్టుకోకూడదు. చిందరవందరగా పెట్టుకోకూడదు. అన్ని నోట్లను ఒక పద్ధతిలో క్రియేట్ చేసి.. సపరేట్ గా పెట్టుకోవాలి.

చాలామంది మెడిసిన్స్ వేసుకోవడం మరిచిపోతామని.. పర్స్ లో పెట్టుకుంటారు. కానీ.. అలా కాకుండా.. సపరేట్ పాకెట్ లో వాటిని పెట్టుకోవాలి. డబ్బుతో పాటు పెట్టుకోకూడదు.

ఒకవేళ పూజారి, పండింతులు సూచించిన దారం అయితే ఓకే.. అలా కాకుండా.. మీరే సొంతంగా ఏవైనా దారాలను పర్స్ లో పెట్టుకుంటే.. నెగటివ్ వాస్తుని ఆకర్షిస్తుంది. కాబట్టి అలాంటివాటిని పెట్టుకోకూడదు.

లక్ష్మీదేవి కూర్చుని, 2ఏనుగులు ఉండే ఫోటోని పర్స్ లో పెట్టుకుంటే.. ఆరోగ్యం, సంపద మీ సొంతమవుతుంది.

రావి చెట్టు ఆకుని పాకెట్ లో పెట్టుకోవడం వల్ల.. పాజిటివ్ ఎనర్జీ అందండంతో పాటు.. సంపద, ధనం మీ సొంతమవుతుంది.

సిల్వర్ కాయిన్ ని మీ పాకెట్ లో పెట్టుకోవడం వల్ల.. ఆరోగ్యంతో పాటు, కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ధనం పొందుతారు.

చిన్న శ్రీయంత్రాన్ని పాకెట్ లో లేదా పర్స్ లో పెట్టుకుంటే.. చాలామంచిది. ఇది ఆరోగ్యం, సంతోషం, సంపదను మీరు, మీ కుటుంబం పొందేలా చేస్తుంది.