నెట్ లేకపోయినా కూడా యూట్యూబ్ వీడియోలు చూడటం ఎలానో తెలుసుకోండి..

0youtube-logo2యు ట్యూబ్ …ఇప్పుడు ఏ వీడియో కావాలన్నా ఇలా సెర్చ్ చేస్తే అలా కళ్ళ ముందుంటుంది…సైన్స్ నుంచి శృంగారం వరకూ అన్ని రంగాల్లో యు ట్యూబ్ లో దొరకని వీడియో అంటూ లేదు…అంతే కాకుండా ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ వీడియోలు చూడటం ఎలా..? ఇంటర్నెట్ లేకపోయినా యూట్యూబ్ వీడియోలు చూడటం ఎలా..? యూట్యూబ్ కోసం offline viewing సదుపాయాన్ని గూగుల్ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది. అదెలాగో చూద్దాం…

ముందుగా యూట్యూబ్ అప్లికేషన్‌ను మీ ఫోన్‌లో లాంచ్ చేయండి. ఇప్పుడు తప్సనిసరిగా ఇంటర్నెట్ కనెక్షన్ అన్ అయి ఉండాలి.

ఇప్పుడు మీరు డౌన్‌లోడ్ చేసుకుని తరువాత చూడలనుకుంటున్న వీడియోను ఓపెన్ చేయండి.

ఆ వీడియో క్రింద మీకు డౌన్‌లోడ్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్ పై క్లిక్ చేసిన వెంటనే ఓ పాప్-అప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్సులో కావల్సిన వీడియో రిసల్యూషన్‌ను సెలక్ట్ చేసుకుని OK బటన్ పై క్లిక్ చేయండి.

వీడియో డౌన్‌లోడ్ అయిన వెంటనే యూట్యూబ్ యాప్ హోమ్ పేజీలోకి వెళ్లి, యాప్‌కు సంబంధించిన మెనూను ఓపెన్ చేయంది. అక్కడ మీకు ‘offline’ ఆప్షన్ కనిపిస్తుంది.

‘offline’ ఆప్షన్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న వీడియోల జాబితా కనిపిస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ తో సంబంధం లేకుండా వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకుని వీక్షించవచ్చు.