వైరల్ వీడియో: షార్ట్ వేసుకున్న పెళ్లికూతురు

0పెళ్లి రోజు వేసుకునే డ్రెస్ కోసం అమ్మాయిలు ఎంతగానో ఆలోచిస్తారు. ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంటారు. ఆ రోజున సాంప్రదాయం సిద్ధమై… అందరి మది దోచేయాలనుకుంటారు. ఈ అమ్మాయి ఏమనుకుందో ఏమో… బహుశా టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వాలనుకుందేమో… లేక ఇంటర్నెట్ సంచలనంగా మారాలని అనుకుందో కానీ… ఇప్పటి వరకు ఎవ్వరూ ట్రై చేయని స్టైల్ లో కనిపించింది. డిజైనర్ బ్లౌజు, తలపై అందమైన ఎరుపు దుపట్టా, నుదుటన బొట్టు, పాపిట్లో సింధూర, ముక్కుకు ముక్కెర, చెవులకు పెద్ద జుంకాలు, మెడలో ఖరీదైన నగ… ఇంతవరకు బాగానే ఉంది. కానీ లెహెంగా స్థానంలో నైక్ షార్ట్ వేసుకుని వచ్చింది. దీంతో ఆమె వీడియోలు, ఫోటోలు ఇంటర్నెల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. వేలకు వేలు షేర్ అవుతున్నాయి.

ఆమెపై ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మాధ్యమాలలో జోకులు మామూలుగా పేలడం లేదు. టైలర్ టైముకి లెహెంగా కుట్టి ఇవ్వలేదు అందుకే ఇలా అని క్యాప్షన్ పెట్టి ఓ నెటిజన్ ఈమె ఫోటోను పోస్టు చేశారు. మరికొందరు ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుందేమో… పరిగెట్టడానికి వీలుగా ఉంటుందని ఇలా షార్ట్ వేసుకుని ఉంటుంది అని కామెంట్లు పెట్టారు. కానీ ఆ అమ్మాయి ఎవరు? ఆ పెళ్లి ఎక్కడ జరిగింది వంటి వివరాలు మాత్రం తెలియరాలేదు.