పాముతో పోరాడిన బల్లులు.. వీడియో

0స్నేహమంటే ఇదేరా! చావుబతుకుల్లో ఉన్న స్నేహితుడిని ప్రాణాలతో కాపాడటమే నిజమైన స్నేహం!! అలాంటి నిజమైన స్నేహం బల్లులలో కనిపించింది. పాము నోట్లో ఉన్న బల్లిని కాపాడేందుకు.. మరో రెండు బల్లులు పాముతో పోరాడాయి. చివరకు స్నేహితుడిని ప్రాణాన్ని కాపాడాయి ఆ రెండు బల్లులు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది. పాము నోట్లో ఉన్న బల్లి ఎర్రగా అయిపోయింది. మొత్తానికి బల్లుల పోరాటం ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఇప్పుడు ఈ వీడయో వైరల్ అయింది. బల్లుల స్నేహంపై ప్రశంసల జల్లు కురుస్తుంది.