ట్రైలర్ టాక్: ఇది పుల్ రొమాన్స్ చిత్రం

0ఈ మధ్య కాలంలో దర్శకులు తాము ఏం కావాలనుకుంటున్నారో ఎలా తీయానుకుంటున్నారో అలా తీసేస్తున్నారు. లాభనష్టాల సంగతి పక్కన పెట్టి యూత్‌ను ఆకర్షించడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి ప్రయత్నమే దర్శకుడు వెంకటేష్‌.కె తన చిత్రం ద్వారా చేయబోతున్నాడు. ఆయన ఇటీవల మీడియా సమావేశంలో చెప్పినట్టుగా తాను విడుదల చేయబోయే వీడియో ఖచ్చితంగా అశ్లీలంగా, ఆకర్షణీయంగా, స్పైసీగా, యూత్‌ను రెచ్చగొట్టేవిధంగా ఉంటుందని చెప్పారు. తీరా ఆ సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత చూస్తే అన్నంత పని చేశారు దర్శకుడు అనిపించింది.

శృంగారానికి పరాకాష్టగా సెక్స్‌ అప్పీల్‌తో యూత్‌ మతి పోగొట్టేలా ఉంది ఆ వీడియో. ఇంతకీ ఆ చిత్రం పేరు చెప్పలేదు కదా! ‘ఇప్పట్లో.. రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ..!’. ఈ చిత్ర దర్శకుడు వెంకటేష్‌.కె యువకుడు కావడంతో పాటు తన అభిప్రాయాలను, అభిరుచులను దించేసిందిగా కనిపిస్తుంది.

మొదట రొమాంటిక్‌ పిక్చర్స్‌తో కూడిన స్టిల్స్‌ రిలీజ్‌ చేశారు. తరువాత స్పైసీతో కూడిన పోస్ట్‌ర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇవన్నీ వెబ్‌సైట్స్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. యూత్‌ను ఆకర్షిస్తూ దృష్టి మరల్చుకోకుండా చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన వీడియో నే ఇలా ఉంటే రేపు సినిమా ఎంత సెక్సీగా, స్పైసీగా, రొమాంటిక్‌గా ఉంటుందో అర్థమైపోతోంది.

విచిత్రం ఏంటంటే.. తమ సినిమాను పూర్తి సెక్స్ కంటెంట్ నింపేశామ్.. వచ్చి చూడండి బాబూ.. అని డప్పుకొట్టిమరీ సినిమా పోస్టర్స్‌ని రిలీజ్ చూస్తోంది చిత్ర యూనిట్. అంతేకాదు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికేట్ ఇచ్చిందని గర్వంగా ఫీల్ అవుతున్నారు దర్శకుడు.