Templates by BIGtheme NET
Home >> GADGETS >> Samsung A51: దీనికి సవాల్ విసిరే ఫోన్లు ఇవే.. ఇంతకీ అవి ఏ ఫోన్లు? వాటిలో ఏది బెస్ట్!

Samsung A51: దీనికి సవాల్ విసిరే ఫోన్లు ఇవే.. ఇంతకీ అవి ఏ ఫోన్లు? వాటిలో ఏది బెస్ట్!


శాంసంగ్ తన గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే మార్కెట్లో ఒక ఫోన్ లాంచ్ అయితే అదే ధరల శ్రేణిలో ఉన్న అత్యుత్తమ ఫోన్లతో దాన్ని పోల్చడం సహజం. కొత్త ఫోన్ కొనాలనుకునే ఎవరైనా సరే అదే చేస్తారు. శాంసంగ్ గెలాక్సీ ఏ51 ధర రూ.23,999గా ఉంది. దీనికి కాస్త అటూఇటుగా ఉన్న అత్యుత్తమ ఫోన్లు షియోమీ రెడ్ మీ కే20 ప్రో, వివో వీ17, ఒప్పో రెనో 2ఎఫ్ స్మార్ట్ ఫోన్లే. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారు ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. కొంతమంది కెమెరాను ఇష్టపడతారు. కొందరికి ఫోన్ పెర్ఫార్మెన్స్ కావాలి. కొంతమందికి బ్యాటరీ లైఫ్ ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కో విభాగంలో ఈ ఫోన్లు ఎన్ని మార్కులు కొట్టేశాయో తెలుసుకోవడానికి కథనాన్ని పూర్తిగా చదవండి!

​1. వేటి ధర ఎంతంటే?

❂ శాంసంగ్ గెలాక్సీ ఏ51: రూ.23,999 (6 జీబీ + 128 జీబీ)

❂ షియోమీ రెడ్ మీ కే20 ప్రో: రూ.24,999(6 జీబీ + 128 జీబీ), రూ.27,999(8 జీబీ + 256 జీబీ)

❂ వివో వీ17: రూ.22,990 (8 జీబీ + 128 జీబీ)

❂ ఒప్పో రెనో 2ఎఫ్: రూ.23,990(8 జీబీ + 128 జీబీ)

ఇక్కడ ఉన్న స్మార్ట్ ఫోన్లలో ధర విషయానికి వస్తే.. అన్ని స్మార్ట్ ఫోన్ల ధర దాదాపు సమానంగానే ఉంది. కాబట్టి ఇతర ఫీచర్ల ఆధారంగానే ఏ ఫోన్ బెస్ట్ అని నిర్ణయించగలం.

​2. మరి ప్రాసెసర్ విషయంలో ఏ ఫోన్ ముందుంది?

❂ శాంసంగ్ గెలాక్సీ ఏ51: శాంసంగ్ ఎక్సినోస్ 9611

❂ షియోమీ రెడ్ మీ కే20 ప్రో: క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్

❂ వివో వీ17: క్వాల్ కాం స్నాప్‌డ్రాగన్ 675 ప్లస్

❂ ఒప్పో రెనో 2ఎఫ్: మీడియాటెక్ హీలియో పీ70

రెడ్ మీ కే20 ప్రోలో క్వాల్ కాం లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. కాబట్టి ఈ విషయంలో ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత స్పష్టంగా పైచేయి సాధించింది.

​3. ర్యామ్ కూడా ముఖ్యమే కాబట్టి..

❂ శాంసంగ్ గెలాక్సీ ఏ51: కేవలం 8 జీబీ ర్యామ్ మాత్రమే

❂ షియోమీ రెడ్ మీ కే20 ప్రో: 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్

❂ వివో వీ17: కేవలం 8 జీబీ ర్యామ్ మాత్రమే

❂ ఒప్పో రెనో 2ఎఫ్: కేవలం 8 జీబీ ర్యామ్ మాత్రమే

ఫోన్ వేగంగా పని చేసేందుకు ఉపయోగపడే ర్యామ్ విషయానికి వస్తే.. అన్ని స్మార్ట్ ఫోన్లలో ర్యామ్ 8 జీబీ వరకు ఉంది. ఎంత ర్యామ్ ఉన్నప్పటికీ దానికి తగ్గ ప్రాసెసర్ ఉంటేనే ఆ ఫోన్ వేగంగా పనిచేస్తుంది. కాబట్టి పనితీరు విషయంలో మళ్లీ రెడ్ మీకే మార్కులు వేయవచ్చు.

​4. ఇంటర్నల్ స్టోరేజ్ ఎందులో ఎక్కువంటే?

❂ శాంసంగ్ గెలాక్సీ ఏ51: 128 జీబీ వేరియంట్ మాత్రమే

❂ షియోమీ రెడ్ మీ కే20 ప్రో: 128 జీబీ, 256 జీబీ వేరియంట్లు ఉన్నాయి.

❂ వివో వీ17: 128 జీబీ వేరియంట్ మాత్రమే

❂ ఒప్పో రెనో 2ఎఫ్: 128 జీబీ వేరియంట్ మాత్రమే

అన్ని ఫోన్లలో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉన్నప్పటికీ రెడ్ మీ కే20 ప్రోలో 256 జీబీ వేరియంట్ కూడా ఉంది. అయితే స్టోరేజ్ విషయంలో అందరి అవసరాలు ఒకే విధంగా ఉండవు. దాంతో పాటు 256 జీబీ వేరియంట్ ధర కూడా కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఏది విజేత అని స్పష్టంగా చెప్పలేం.

​5. ఏ ఫోన్ డిస్ ప్లే బాగుంది?

❂ శాంసంగ్ గెలాక్సీ ఏ51: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (2400×1080 పిక్సెల్స్) డిస్ ప్లేను ఇందులో అందించారు.

❂ షియోమీ రెడ్ మీ కే20 ప్రో: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే(2340×1080 పిక్సెల్స్) ఇందులో ఉంది.

❂ వివో వీ17: 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ (2400×1080 పిక్సెల్స్) డిస్ ప్లేను ఇందులో అందించారు.

❂ ఒప్పో రెనో 2ఎఫ్: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (2160×1080 పిక్సెల్)డిస్ ప్లే ఇందులో ఉంది.

అన్ని స్మార్ట్ ఫోన్లలో ఫుల్ హెచ్ డీ+ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ51, ఒప్పో రెనో 2ఎఫ్ ల్లో కాస్త పెద్ద స్క్రీన్లను అందించారు.

​6. బ్యాటరీలు ఎలా ఉన్నాయంటే?

❂ శాంసంగ్ గెలాక్సీ ఏ51: 4000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. 15W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

❂ షియోమీ రెడ్ మీ కే20 ప్రో: ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ గా ఉంది. 27W ఫాస్ట్ చార్జింగ్‌ ఫీచర్ ను ఇందులో అందించారు.

❂ వివో వీ17: దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ గా ఉంది. ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

❂ ఒప్పో రెనో 2ఎఫ్: 4,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని ఇందులో అందించారు. VOOC ఫాస్ట్ చార్జ్ 3.0ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ విషయానికి వస్తే.. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లతో వివో వీ17 స్మార్ట్ ఫోన్ మిగతా ఫోన్ల కంటే ముందుంది.

​7. ఆపరేటింగ్ సిస్టంలో శాంసంగ్ కు మార్కులు!

❂ శాంసంగ్ గెలాక్సీ ఏ51: ఆండ్రాయిడ్ 10 ఆధారిత శాంసంగ్ వన్‌యూఐ 2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

❂ షియోమీ రెడ్ మీ కే20 ప్రో: ఆండ్రాయిడ్ 9.0 Pie ఆధారిత ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ పని చేస్తుంది.

❂ వివో వీ17: ఆండ్రాయిడ్ 9 ఆధారిత రోగ్ ఫన్ టచ్ ఓఎస్ 9.2 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.

❂ ఒప్పో రెనో 2ఎఫ్: ఆండ్రాయిడ్ 9 ఆధారిత కలర్ఓఎస్ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.

ఆపరేటింగ్ సిస్టం విషయంలో శాంసంగ్ గెలాక్సీ ఏ51 లాంచ్ అవ్వడమే లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 10తో లాంచ్ అయింది. అయితే మిగతా స్మార్ట్ ఫోన్లకు త్వరలో ఈ అప్ డేట్ రానుంది.

​8. సెల్ఫీ కెమెరాలు ఎలా ఉన్నాయి?

❂ శాంసంగ్ గెలాక్సీ ఏ51: 32 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను ముందువైపు అందించారు. దీని అపెర్చర్ f/2.2గా ఉంది.

❂ షియోమీ రెడ్ మీ కే20 ప్రో: 20 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను ముందువైపు అందించారు. దీని అపెర్చర్ f/2.2.

❂ వివో వీ17: 32 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సెల్ఫీ కెమెరా ఇందులో ఉంది.

❂ ఒప్పో రెనో 2ఎఫ్: 16 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను ఇందులో సెల్ఫీ కెమెరాగా అందించారు. దీని అపెర్చర్ f/2.0గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ51, వివో వీ17ల్లో 32 మెగా పిక్సెల్ కెమెరాలను అందించారు. అయితే కెమెరా నాణ్యత మెగా పిక్సెల్ పై కాకుండా వాడే సెన్సార్ పై ఆధారపడి ఉంటుంది. శాంసంగ్, వివో బ్రాండ్లలో కెమెరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి ఫొటోలు బాగానే వస్తాయి.

​9. ప్రధాన కెమెరా ఏ ఫోన్ లో బాగుంది?

❂ శాంసంగ్ గెలాక్సీ ఏ51: 48 మెగా పిక్సెల్ (f/2.0 అపెర్చర్) + 5 మెగా పిక్సెల్ (f/2.4 అపెర్చర్) + 5 మెగా పిక్సెల్ (f/2.2 అపెర్చర్)

❂ షియోమీ రెడ్ మీ కే20 ప్రో: 48 మెగా పిక్సెల్ (f/1.75 అపెర్చర్) + 13 మెగా పిక్సెల్ (f/2.4 అపెర్చర్) + 8 మెగా పిక్సెల్ (f/2.4 అపెర్చర్)

❂ వివో వీ17: 48 మెగా పిక్సెల్ (f/1.8 అపెర్చర్) + 8 మెగా పిక్సెల్ (f/2.2 అపెర్చర్) + 2 మెగా పిక్సెల్ (f/2.4 అపెర్చర్) + 2 మెగా పిక్సెల్ (f/2.4 అపెర్చర్)

❂ ఒప్పో రెనో 2ఎఫ్: 48 మెగా పిక్సెల్ (f/1.79 అపెర్చర్) + 8 మెగా పిక్సెల్ (f/2.2 అపెర్చర్) + 2 మెగా పిక్సెల్ (f/2.4 అపెర్చర్) + 2 మెగా పిక్సెల్ (f/2.4 అపెర్చర్)

ఇందులో అన్ని స్మార్ట్ ఫోన్లలో వెనకవైపు 48 మెగా పిక్సెల్ కెమెరానే ప్రధాన కెమెరాగా ఉంది. అయితే వివో వీ17, ఒప్పో రెనో 2ఎఫ్ ల్లో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు.

​10. రెడ్ మీ కే20 ప్రోలో ఎక్కువ రంగులు!

❂ శాంసంగ్ గెలాక్సీ ఏ51: ప్రిజం బ్లూ, ప్రిజం వైట్, బ్లాక్ క్రష్

❂ షియోమీ రెడ్ మీ కే20 ప్రో: కార్బన్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్, గ్లేసియర్ బ్లూ, పెరల్ వైట్

❂ వివో వీ17: గ్లేసియర్ ఐస్ వైట్, మిడ్ నైట్ బ్లాక్

❂ ఒప్పో రెనో 2ఎఫ్: లేక్ గ్రీన్, స్కై వైట్

సాధారణంగా ఇంత ధర పెట్టి స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారు ఫోన్ ఎలా ఉందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఈ విషయంలో తీసుకుంటే రెడ్ మీ కే20 ప్రోలో ఎక్కువ రంగులు అందుబాటులో ఉన్నాయి.