Templates by BIGtheme NET
Home >> Cinema News >> RRR బ్యూటీ తండ్రిపై వేధింపుల కేసు ఇంతకీ ఏమైనట్టు?

RRR బ్యూటీ తండ్రిపై వేధింపుల కేసు ఇంతకీ ఏమైనట్టు?


బాలీవుడ్ ని గడగడలాడించే బలవంతుడు మహేష్ భట్ .. అగ్ర నిర్మాతగా ఆయన ఆటలు అన్నీ ఇన్నీ కావు! అంటూ ఓ కథానాయిక నివేదించడం.. తనని కూడా ఆయన వేధించారని ఆరోపించడం సంచలనమైన సంగతి తెలిసిందే. సదరు నటీమణి పేరు లువీనా లోధ్. కొద్ది రోజుల క్రితం ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన 48 సెకన్ల వీడియో హాట్ టాపిక్ అయ్యింది. ఇదంతా అసత్య ప్రచరం అంటూ భట్ సోదరులు ఖండించారు. అనంతరం లువీనాపై మహేష్ భట్ సోదరుడు పరువు నష్టం దావా వేశారు.

తాజా సమాచారం ప్రకారం.. భట్ సోదరులు నటిపై బాంబే హైకోర్టులో దావా విచారణకు రాగా.. మహేష్ భట్ – ముఖేష్ భట్ సోదరులకు మధ్యంతర ఉపశమనాన్ని కోర్టు మంజూరు చేసింది. సదరు నటి తప్పుడు ప్రకటనలు చేయకుండా కోర్టు నిరోధించింది. సదరు నటీమణి భర్త రాజ్ కౌషల్ ఇటీవల తారా అనే నాలుగేళ్ల అమ్మాయిని దత్తత తీసుకున్నారు. వారు 28 జూలై 2020 న ఆమెను ఇంటికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ దంపతులకు ఇప్పటికే వీర్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ మధ్యనే మందిరా బేడి దత్త పుత్రికను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసినదే.

తన క్లయింట్ మహేష్ భట్ పై లూవినా లోధ్ చేసిన ఆరోపణలన్నింటినీ న్యాయవాది సుమిత్ సభర్వాల్ తోసిపుచ్చారు. లూవినా భర్త మహేష్ – ముఖేష్ భట్ యాజమాన్యంలోని విశేష్ ఫిల్మ్స్ ఉద్యోగి అని కూడా ప్రస్థావించారు. భట్ కుటుంబంతో అతడికి ఎలాంటి సంబంధం లేదని కూడా న్యాయవాది పేర్కొన్నారు.