డాషింగ్ డైరెక్టర్ ధూమపానం.. సమ్మోహనం!

0

చాలాకాలం ఫ్లాపులతో సతమతమైన పూరి జగన్నాధ్ ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం యువ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జోరుగా సాగుతోంది. ఈ సినిమా ప్రారంభించిన సమయం నుండి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులతో నిత్యం టచ్ లో ఉంటున్న పూరి కనెక్ట్స్ టీమ్ తాజాగా మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు.

షూటింగ్ లొకేషన్ లో దర్శకుడు పూరి జగన్ దీర్ఘాలోచనలో ఉండగా తీసిన ఫోటోలను పూరి కనెక్ట్స్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ “నెక్స్ట్ షాట్ ఎలా చెయ్యలా అనే డీప్ థాట్స్ లో పూరి జగన్ #VD10 #PJ37” అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటోలలో పూరి సీరియస్ గా ఆలోచిస్తూ స్మోక్ చేస్తున్నారు. మిగతా ధూమపాన ప్రియుల మాదిరిగానే ముకేష్ యాడ్.. రాహుల్ ద్రవిడ్ రన్నౌట్ కథను ఏమాత్రం పట్టించుకోకుండా స్టైల్ గా సిగరెట్ కాలుస్తున్నారు.

ఈ ఫోటోలలో పూరి స్టైల్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. అయితే కొందరు అభిమానులు మాత్రం స్మోకింగ్ కంట్రోల్ చేసుకోవాలని.. ఆరోగ్యం సంగతి చూసుకోవాలని సూచించారు. పూరి తన స్టైల్ నే హీరోల ద్వారా వెండితెరపై చూపిస్తూ ఉంటారని కొందరు వ్యాఖ్యానించారు. ఏదైతేనేం పూరి స్మోకింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-