హాటెస్ట్ బెంగాలి స్టార్

0

బాలీవుడ్ లో హాటు భామలకు కొదవేముంది చెప్పండి? ఇరవైల భామల నుండి నలభైల భామల వరకూ సోషల్ మీడియా వేడి పెంచి ఏడిపించడంలో స్పెషలిస్టులు. వారి నిఘంటువుల్లో జాలి.. కరుణ.. దయ అనే పదాలు అసలు ఉండవు. ఇప్పటికే వేసవి ఉష్ణోగ్రతలు ప్రారంభం ఆయినా ఇంకా డబల్ చేసేందుకు తమ టాలెంట్ అంతా వాడుతున్నారు. ఇలాంటి భామల లిస్టులోనే ఉన్న భామ పాయల్ ఘోష్.

ఈమె ఎవరు అని అడిగితే.. ఓ బెంగాలి రసగుల్లా అని చెప్పాల్సి ఉంటుంది. తెలుగులో ‘ప్రయాణం’.. ‘ఊసరవెల్లి’.. ‘Mr. రాస్కెల్’ అనే సినిమాల్లో నటించింది. ఈ భామ హిందీలో కూడా ఒక సినిమాలో నటించింది ‘పటేల్ కి పంజాబీ షాదీ’. ఇట్టాంటి హిందీ సినిమా పేర్లు మేమెప్పుడూ వినలేదు అన్నారంటే మరి దానికి సమాధానం ‘పాపకు అట్టాంటి ఆఫరే వచ్చింది మరి’. ఇక ఈభామ ఇన్స్టా లో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి కొంతమంది నెటిజన్లకు పరిచయం ఉంటుంది. పాయల్ తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “@FHM ఇండియా మ్యాగజైన్ వారికి ఫోటోషూట్ చెయ్యడం సరదాగా గడించింది.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ ఫోటోలో బ్లాక్ మోనోకిని ధరించింది. పైన బటన్లు లేకుండా ఓ పారదర్శకమైన నలుపు రంగు చొక్కా ధరించింది. ఓ పొడవాటి అద్దం పక్కగా స్టైలుగా యమా హాటుగా నిలుచుంది. ఒక చేతిని తల పై పెట్టుకుని నాకు సాటి లేదు.. పోటీ లేనే లేదు అన్నట్టుగా ఓ పోజిచ్చింది. ఇక ఫోటోలో అద్దం పక్కన నిలబడడం తో అందాల విందు కాస్తా డబల్ డోస్ గా మారిపోయింది. ఈ ఇలాంటి ఫోటోలకు కిరాకు కామెంట్లు సహజమే. “ఉఫ్ ఉఫ్.. సెక్సీ”.. “FHM కవర్ పై బెస్ట్ బ్యూటీ”.. “హాటెస్ట్ బెంగాలి స్టార్” అంటూ కొందరు స్పందించారు.
Please Read Disclaimer