మహేష్ చాలా నాటీ.. సీనియర్ నటి చెప్పారు!

0

మహేష్ తెర ముందు కంటే తెర వెనుక టూ నాటీ అని చెబుతారు. సినిమాలో వేసే పంచ్ ల కన్నా ఆయన సెట్ లో వేసే పంచ్ లే చాలా ఎక్కువ. మనకున్న హీరోల్లో సెన్సాఫ్ హ్యూమర్ తో ఎక్కువగా ఆకట్టుకునే హీరో మహేష్ అని సెట్ లో ఆయనని గమనించిన ప్రతీ ఒక్కరు చెబుతుంటారు. బయట ఎంత డీసెంట్ గా కనిపిస్తారో మహేష్ సెట్ లో అంత నాటీగా వుంటారనే టాక్ కూడా వుంది. ఆ విషయాన్నే తాజాగా సహజ నటి జయసుధ ఓ ఇంటర్వ్యూలో మరోసారి కన్ఫామ్ చేశారు. మహేష్ తో కలిసి జయసుధ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు- బ్రహ్యోత్సవం- మహర్షి వంటి చిత్రాల్లో నటించారు.

ఆ సినిమాల షూటింగ్ సమయంలో మహేష్ ని అత్యంత దగ్గరగా గమనించిన జయసుధ మహేష్ లో వున్న మరో కోణాన్ని బయటపెట్టారు. `చైల్డ్ ఆర్టిస్ట్గా మహేష్ నేను నటించిన `పోరాటం` చిత్రంలో కనిపించాడు. ఆ తరువాత అతనితో మూడు చిత్రాల్లో కలిసి నటించాను. అతను చాలా నాటీ. సినిమాల్లో కంటే సెట్లో మహేష్ చేసే అల్లరి మామూలుగా వుండదు. తను చాలా నాటీ“ అని తెలిపారు.

మహేష్ పూర్తి స్థాయి కామెడీ సినిమా చేస్తే చూడాలని వుందని జయసుధ అన్నారు. తన మార్కు కామెడీని దూకుడు- ఆగడు చిత్రాల్లో చూపించాడు కానీ తనలో వున్న పూర్తి స్థాయి హాస్య చతురతను ఇప్పటివరకూ ప్రదర్శించనేలేదట. అలాంటి సినిమా మహేష్ నుంచి రావాలని కోరుకుంటున్నాను అని తన మనసులో వున్న మాటను బయటపెట్టేశారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి తో కలిసి చేస్తున్న `సరిలేరు నీకెవ్వరు` ఆ తరహానే అన్న టాక్ వినిపిస్తోంది. సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Please Read Disclaimer