Templates by BIGtheme NET
Home >> Telugu News >> మూత్రంతో ఇటుకలు తయారుచేస్తున్న ఇస్రో ..దేనికోసమంటే!

మూత్రంతో ఇటుకలు తయారుచేస్తున్న ఇస్రో ..దేనికోసమంటే!


ఇస్రో ..ప్రపంచంలో రోజురోజుకి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ భారత దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల చాటిచెప్తుంది. ప్రపంచంలో ఇస్రో కి మంచి గుర్తింపు ఉంది. అత్యధిక సక్సెస్ రేట్ ఇస్రో సొంతం. అయితే తాజాగా చంద్రుడి పై నిర్మాణం కోసం కీలక ముందడుగు వేసింది. రాబోయే కాలంలో చంద్రుడిపై కూడా నిర్మాణాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా కీలక ముందడుగులు వేస్తుంది. చంద్రునిపై నిర్మాణాలను చేపట్టడానికి వీలుగా ఉండే ఇటుకలను ఇస్రో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు సంయుక్తంగా తయారు చేశాయి. ఈ ఇటుకల తయారీలో చంద్రుని మీద నుంచి తెచ్చిన మట్టి కొన్ని రకాల బ్యాక్టీరియాలు చిక్కుడు కాయల గుజ్జు ఉపయోగిస్తున్నారు.

ఇందులో ఉన్న బ్యాక్టీరియా జీవక్రియలో భాగంగా ఇటుకకు ఎక్కువ మన్నిక లభించేలా చేసే కొన్ని పదార్ధాలను విడుదల చేస్తాయి. ఇవి యూరియాతో చర్యలు జరిపి కాల్షియం కార్భైడ్ లాంటి పదార్ధాల తయారిలో ఉపయోగపడతాయి. అందుకే ఈ ఇటుకల తయారీలో మూత్రం ద్వారా తయారయ్యే యూరియాను కూడా ఉపయోగిస్తారు. అంతరిక్ష పరిశోధనలు గత శతాబ్ధ కాలంలో చాలా ఎక్కువగా పెరిగాయి. అక్కడ నిర్మాణాలు చేపట్టాలని ఇప్పటికే చాలా ప్రయోగాలు చేశారు. ఇందులో ఒక పౌండ్ ఇటుకలను స్పేస్ కు చేర్చడానికి రూ. 7.5 లక్షల ఖర్చు అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో ఆ ఖర్చు తగ్గిపోతుంది అని భావిస్తున్నారు.

సాధారణంగా ఇటుకలను ఒకదానికి ఒకటి జత చేయడానికి సిమెంట్ను ఉపయోగిస్తారు. కానీ ఈ ఇటుకలను కలపడానికి చిక్కుడు కాయల గుజ్జును ఉపయోగిస్తున్నారు. ఇది ఇటుకలను మరింత గట్టిగా పట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటి నిర్మాణంలో కెమికల్ మెకానికల్ ఇంజనీరింగ్ రెండు కలగలిపి ఉన్నాయని ఐఐఎస్సీ బెంగుళూరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అలోక్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే అతి త్వరలో చంద్రుని పై జరిగే నిర్మాణాల్లో ఇండియా కీలక పాత్ర వహించే అవకాశం ఉందని అర్థమౌతుంది.