జాగ్రత్త.. ఇది శుభ్రాకర్షణ శక్తి!

0

శుభ్ర అయ్యప్ప పేరు తెలుసా? మోడల్ గా పలు అడ్వర్టైజ్మెంట్లలో తళుక్కున మెరిసిన ఈ బ్యూటీ నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన ‘ప్రతినిధి’ సినిమాతో హీరోయిన్ గా ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ‘యవ్వనం ఒక ఫ్యాంటసీ’ అనే మరో చిత్రంలో కూడా నటించింది. ఆ తర్వాత ఎందుకో టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. తమిళంలో ఒక చిత్రం.. కన్నడలో మరో చిత్రంలో నటించింది. ఆఫర్లు.. హిట్లు పక్కన పెడితే ఈ భామ సోషల్ మీడియాలో ఉన్న హాటు భామల్లో ఒకరు. తన ఫోటోలతో నెటిజన్ల హార్టు బీటును పెంచడం ఒక హాబీ.

శుభ్ర తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “గురుత్వాకర్షణ శక్తి కాస్త భిన్నంగా ఉండే ఒక గ్రహానికి వచ్చాను #హెవెన్ ఆన్ ఎర్త్” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. నిజంగానే ఫోటోలో ఉన్న లొకేషన్ అదిరిపోయింది. చుట్టూ నీళ్ళు… నేపథ్యంలో పచ్చటి చెట్లు.. వాటి మధ్యలో అక్కడక్కడా ఇళ్ళు.. ఫోన్ సిగ్నల్స్ ఉండే అవకాశం కనిపించడం లేదు కానీ ఇంతకంటే బెస్ట్ లొకేషన్ ఏముంటుంది చెప్పండి? అయితే మనకు లొకేషన్ ముఖ్యం కాదు కదా.. ఆ లొకేషన్ లోఉన్న బికినీ లావణ్యం. ప్రింటెడ్ బికినీ ధరించి ఒక బోటుపై కూర్చొని అందమైన ప్రకృతిని తనివితీరా అస్వాదిస్తున్నట్టుగా ఒక అందమైన నవ్వు నవ్వింది. పోనీ టెయిల్.. నయనాలకు చలువ కళ్ళజోడు ధరించి నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. బికినీ కాబట్టి అందాల విందు పీక్స్ లో ఉంది.

నెటిజన్లు ఈ ఫోటో దెబ్బకు పిచ్చెక్కిపోయి మరీ కామెంట్లు పెట్టారు. ఒక నెటిజన్ ఏకంగా శుభ్రను ‘బికినీ స్టార్’ అంటూ కితాబిచ్చాడు. “మాటల్లేవ్.. స్టన్నింగ్ ప్రిన్సెస్”.. “అవును అక్కడ గురుత్వాకర్షణ లేదు.. శుభ్రాకర్షణ ఉంది” అంటూ మరి కొందరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. శుభ్ర ఇలానే బికినీ షూట్స్ చేస్తూ ఉంటే ఎవరో ఒక తెలుగు ఫిలిం మేకర్ ఆ ఒక ఆఫర్ ఇవ్వడం ఖాయమే.
Please Read Disclaimer