Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఒకరి భార్యగానో లేక కూతురి గానో ఉండటం గుర్తింపు కాదు : రేణు దేశాయ్

ఒకరి భార్యగానో లేక కూతురి గానో ఉండటం గుర్తింపు కాదు : రేణు దేశాయ్


సినీ అభిమానులకు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్.. ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్ తో కొన్నాళ్ళు సహజీవనం చేసి వివాహం చేసుకుంది. నటనకు దూరం అయినప్పటికీ కాస్ట్యూమ్ డిజైనర్ గా రచయితగా దర్శకురాలిగా ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తరువాత ఆమె తన పిల్లలను చూసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రేణు దేశాయ్ సోషల్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు తన పిల్లలు అధ్యా అకిరా నందన్ కి సంబంధించిన విషయాలను ఫాలోవర్స్ తో పంచుకుంటారు. అలాగే సామాజిక అంశాలపై మహిళల సమస్యలపైనా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇటీవల ఇంస్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన రేణు దేశాయ్.. ఓ వ్యక్తి మీదే నేను ఆధారపడి ఉన్నట్లు మాట్లాడి నా అస్తిత్వాన్ని పోగొట్టకండి.. ఆడవాళ్లకు కూడా స్వతంత్రంగా బ్రతికే శక్తి ఉంది.. ఇంకెప్పుడు అలా మాట్లాడి ఇబ్బంది పెట్టకండి’ అంటూ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించిన ఓ నెటిజన్ కామెంట్ కి సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే తాజాగా ఆలోచనలు రేకెత్తించే విధంగా రేణూ దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు.

”ఎంతోమంది దృష్టిలో నేను ఒంటరి మహిళను సింగిల్ పేరెంట్ ని. అందరిలాంటి స్త్రీని కాదు. పురుషుల ప్రపంచంలో తాను అనుకున్నట్లుగా తన నిబంధనలపై జీవించే స్త్రీని. నేను ఏదైనా సరే ఒంటరిగానే పోరాడాలని అనుకుంటాను. భర్త సపోర్ట్ లేకుండా తన పిల్లలను సంపూర్ణంగా పెంచుకునే తల్లిని. తన కాళ్లపై తాను నిలబడి వ్యాపారం చేసుకుని ఆర్థికంగా బలపడగలిగే సామర్థ్యం ఉన్న మహిళని. అలాగే అన్యాయాలను గట్టిగా ఎదిరించే ఆడదాన్ని. సమాజంలోని పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉండటానికి ఇష్టపడని ఓ స్త్రీని. నన్ను ఫాలో అయి స్వతంత్రంగా బ్రతకలని అనుకునే యువతులకు నేను ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నా. ఆడవాళ్ళు దుర్గా దేవి లక్ష్మీ సరస్వతిలా ఉండాలి. మీకున్న బలాన్ని సామర్థ్యం గురించి పూర్తిగా తెలుసుకోండి. వేరొకరి భార్యగానో లేక కూతురి గానో ఉండటం మీ గుర్తింపు కాదు. మీకంటూ ఒక ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే ఈ క్రమంలో మన సాంప్రదాయాలను పూర్తిగా మర్చిపోకూడదు. ఆ ముసుగులో జరిగే అన్యాయాలపై పోరాడాల్సిన అవసరం ఉంది” అని రేణు దేశాయ్ పోస్ట్ చేసింది.