Templates by BIGtheme NET
Home >> GADGETS >> వాట్సాప్ లో కొత్తగా వచ్చిన అద్భుతమైన ఫీచర్స్ ఇవే!

వాట్సాప్ లో కొత్తగా వచ్చిన అద్భుతమైన ఫీచర్స్ ఇవే!


వాట్సాప్.. ఏ యాప్ లేని స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉండరేమో. వాట్సాప్ అనే మొబైల్ యాప్ మన జీవితంలో ఓ భాగమైపోయింది. మెసెంజర్ యాప్గా అతి తక్కువ సమయంలోనే ఈ అప్లికేషన్ జనాల్లోకి వెళ్లిపోయింది. ఆఫీస్ కార్యకలాపాలకు కూడా చాలా మంది వ్యాట్సాప్ గ్రూప్ను వాడుతున్నారు. మరికొందరు తమ బిజినెస్లను ప్రమోట్ చేసుకొనేందుకు ఈ యాప్ను వాడతున్నారు. తాజాగా ఆన్లైన్ క్లాసుల సందర్భంగా కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ యాప్తోనే అనుసంధానం అయ్యారు. సమాచారాన్ని క్షణాల్లో వేల లక్షల మందికి ఈ యాప్ చేరవేయగలదు.

దీంతో చాలా తప్పుడువార్తలు తప్పుడు సమాచారం కూడా వాట్సాప్ యాప్ ద్వారా వైరల్ అయిపోయింది. కరోనా టైంలోనూ హెల్త్టిప్స్ ఇంటి చికిత్స అంటూ కొంత తప్పుడు సమాచారం వాట్సాప్ లో వైరల్ అయ్యింది. అయితే వాట్సాప్ను కొన్నేండ్ల క్రితమే ఫేస్బుక్ మెసెంజర్ యాప్ కైవసం చేసుకున్నది. ఇప్పుడు ప్రముఖమైన ఈ రెండు యాప్లు ఓ యాజమాన్యం కింద ఉన్నాయి. అయితే వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూ.. యాప్ అప్డేట్ చేస్తూ వినియోగదారుల మన్ననలు పొందుతోంది. తాజాగా మరికొన్ని ఫీచర్లు తీసుకొచ్చింది. అవి ఏమిటంటే..

ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు స్టోరేజ్ రీ డిజైన్డ్ స్టోరేజ్ మెంట్ ఫీచర్ ద్వారా ఫోన్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఈ ఫీచర్ తో వాట్సాప్లో అవసరం లేని డేటాను మెస్సేజ్లను ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు. కుప్పలు కుప్పలుగా మెసేజ్నోటిఫికేషన్లు వస్తుంటే వాటితో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే వాట్సాప్ ‘మ్యూట్ ఆల్వేస్’ అనే ఫీచర్ ని వాట్సాప్ తీసుకొచ్చింది. ఇంతకూ ముందు వారం నెల సంవత్సరం వరకు మాత్రమే మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఈ కొత్త ఆప్షన్ ద్వారా మన మెసేజ్ లు వెంటనే డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.కస్టమైజబుల్ వాల్పేపర్స్ ఫీచర్ ద్వారా మనం మనకు నచ్చిన కాంటాక్ట్స్ గ్రూప్ లకు ప్రత్యేకంగా వాల్ పేపర్లను కూడా పెట్టుకోవచ్చు. వాట్సాప్ అడ్వాన్స్డ్ సెర్చ్ తో పత్రాలు లింక్లతో పాటు ఫోటోలు ఆడియో జిఫ్ లు వీడియోలను వెంటనే సెర్చ్ చేసుకోవచ్చు.

కొత్త కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ లిస్ట్ లో సులభంగా ఆడ్ చేసుకోవడం కోసం క్యూఆర్ కోడ్ ఫీచర్ తీసుకొచ్చారు. దీని కోసం మీరు అవతలి వారి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు. ఇప్పుడు గ్రూప్ వీడియో కాల్స్ వాడకం పెరిగింది. కష్టమైనా తరు ని తీసుకొచ్చింది. గ్రూప్ వీడియో కాల్ ఫీచర్ లో ఒకే సారి 8 మందితో మాట్లాడవచ్చు.

వారం రోజుల్లో మెసెజీలు మీడియా ఫైల్స్ను ఆటోమాటిక్గా డీలిట్ అయ్యేలా వాట్సాప్ డిసప్పీయరింగ్ ఫీచర్ ని తెచ్చారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఐవోఎస్ డెస్క్టాప్ కేఏఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ లలో పనిచేస్తుంది. ఇక డార్క్ మోడ్ ఆఫ్షన్ ద్వారా ఛార్జింగ్ ఆదాతో పాటు కంటికి కూడా ఒత్తిడి తగ్గించుకోవచ్చు.