Templates by BIGtheme NET
Home >> GADGETS >> బంపరాఫర్.. రూ.16,000 ఫోన్ రూ.8,999కే!

బంపరాఫర్.. రూ.16,000 ఫోన్ రూ.8,999కే!


కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు తీపికబురు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరీప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్లపై బంపర్ డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. 

అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై గ్రేట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్ లభిస్తోంది. ఫోన్ అసలు ధర రూ.15,999. ఇప్పుడు ఈ ఫోన్‌ను సేల్‌లో భాగంగా రూ.8,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే రూ.7,000 డిస్కౌంట్ లభిస్తోంది. 

ఇకపోతే హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 13 ఎంపీ+2 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5.84 అంగుళాల డిస్‌ప్లే, కిరిన్ 659 ఆక్టాకోర్ ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. 

అలాగే ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ.8,900 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు కూడా పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంది. ఇంకా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇకపోతే అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 15 నుంచి 16 వరకు అందుబాటులో ఉంటుంది.