ఆండ్రాయిడ్ 10 ప్రత్యేకతలు ఇవే..!

0

ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్ సంస్థ తన ఆపరేటింగ్ సిస్టమ్ లకు తినుబండారాల పేర్లు పెడుతూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆనవాయితీకి స్వస్తీ పలుకుతూ.. లేటెస్ట్ వెర్షన్ ఓఎస్ కు ‘ఆండ్రాయిడ్ 10’ పేరును ప్రకటించింది. అదే సమయంలో గూగుల్ ఈ ‘ఆండ్రాయిడ్ 10’ కు చెందిన బీటా 6 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ని విడుదల చేసింది. అయితే త్వరలోనే దీనికి సంబంధించి ఫైనల్ వెర్షన్ విడుదల చేయనుంది.

ఆండ్రాయిడ్ 10 ఫీచర్లు…

1. ఆండ్రాయిడ్ 10లో కొత్తగా బబుల్స్ సదుపాయం రానుంది. అంటే మనం స్మార్ట్ ఫోన్ లో ఏ అప్లికేషన్ అయిన ఓపెన్ చేసి తర్వాత హోమ్ స్క్రీన్ కి వచ్చిన – వేరే అప్లికేషన్ ఓపెన్ చేసిన – సంబంధిత అప్లికేషన్ బబుల్ రూపంలో స్క్రీన్ మీద కనిపిస్తోంది.

2. అలాగే దీని వల్ల స్నేహితులకు వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకునే ఇబ్బందులు కూడా తప్పనున్నాయి. మామూలుగా హాట్ స్పాట్ ఆన్ చేసి వాళ్ళకి పాస్ వర్డ్ చెప్పాలి. కానీ అలాంటి పరిస్తితి లేకుండా వైఫైకి సంబంధించిన క్యూఆర్ కోడ్ తయారుచేసుకుని దాని ద్వారా నేరుగా వైఫైకి కనెక్ట్ అవ్వొచ్చు.

3. ఇక మన స్మార్ట్ ఫోన్ లో యాప్స్ షార్ట్ కట్స్ పొరపాటున డిలీట్ అయిన ‘అన్ డూ’ అనే ఆప్షన్ ద్వారా వాటిని తిరిగి అదే ప్లేసులోకి తీరుకురావచ్చు.

4. ఈ ఓఎస్ వల్ల సెట్టింగ్స్ లో ప్రైవసీ అనే కొత్త ఆప్షన్ రానుంది. దీనిలో అన్నీ అప్లికేషన్లు లిస్ట్ చేసి ఉంటాయి. అందువల్ల మనకు అవసరమైన అప్లికేషన్ పర్మిషన్ ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసుకోవచ్చు.

5. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంలో పూర్తిస్థాయిలో సిస్టం వైడ్ డార్క్మోడ్ అందించారు. దీన్ని వల్ల బ్యాటరీ ఆదా అవుతుంది. కళ్ల మీద ఒత్తిడి పడదు. రాత్రి సమయంలో పక్కనవారికి ఇబ్బందిగా కూడా ఉండదు. అన్నీ అప్లికేషన్లు ఆటోమేటిక్ డార్క్ మోడ్ ని కలిగి ఉన్నాయి.

6. స్మార్ట్ ఫోన్లలో ఉండే థీమింగ్ ఆప్షన్ ఇక నుంచి ఆండ్రాయిడ్ 10 కూడా అందించనుంది.

7. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంలో లైవ్ క్యాప్షన్ అనే సదుపాయం ఉంది. ఇది ఇంటర్నెట్ తో పని లేకుండా ఏదైనా వీడియో – ఆడియో ఫైల్స్ ప్లే అవుతుంటే వాటి మాటలకు తగ్గట్టుగా లైవ్ క్యాప్షన్లు టెక్స్ట్ రూపంలో చూపిస్తోంది.

8. ఇక ఇందులో లోకేషన్ కంట్రోల్ ఫీచర్ ఉంది. దీని వల్ల మన పర్మిషన్ లేకుండా ఏ అప్లికేషన్ లొకేషన్ యాక్సెస్ చేసుకోలేదు.




Please Read Disclaimer