Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ఆవు కౌగిలింతలో ఎంతటి మహత్తు ఉంటుందో తెలుసా?

ఆవు కౌగిలింతలో ఎంతటి మహత్తు ఉంటుందో తెలుసా?

హిందువులు ఆవును గోమాత అంటూ పూజిస్తూ ఉంటారు. పూజ అయితే చేస్తారు కాని ఆవు యొక్క ప్రాముఖ్యత చాలా మంది హిందువులకు తెలియదనే చెప్పాలి. హిందులు పరమపవిత్రంగా పూజించే ఆవులో ఎన్నో అద్బుతమైన గుణాలు ఉన్నాయి. ఇప్పటికే గో మూత్రం అద్బుతమైన ఔషదంగా పలు రోగాలకు పని చేస్తుందని అంటూ ఉంటారు.

ప్రతి రోజు చిటికెడు గో మూత్రంను సేవిస్తే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు. తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని గుర్తించారు. ప్రతి రోజు ఆవును ఒక అయిదు నుండి పది నిమిషాల పాటు కౌగిలించుకుని దాని శ్వాసను పరిశీలిస్తూ గాఢంగా శ్వాసించినట్లయితే ఒత్తిడి అనేది దూరం అవుతుందని ప్రయోగం ద్వారా నిరూపితం అయ్యింది. హాలెండ్‌ వాసులు దీనిని ఇప్పటికే వాడుకలోకి తీసుకు వచ్చారు.

కౌ హగ్గింగ్‌ ప్రస్తుతం హాలెండ్‌ లో ట్రెండ్. కొన్ని గో షాలల్లో టికెట్లు పెట్టి మరీ జనాలను రప్పిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ థెరపీకి మంచి పేరు వస్తున్న కారణంగా అంతా కూడా దీనికి మొగ్గు చూపుతున్నారు. ఇండియాలో కూడా ఇలాంటిది మొదలు అవుతుంది. కాస్త ఆలస్యంగా అయినా మనోళ్లు దీనిని గుర్తించారు సంతోషం.

Share via
Copy link