Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ఈ ఐదు తింటే ఇమ్యూనిటీ పెరిగి.. ఎలాంటి వైరస్ మనకి రాదట..

ఈ ఐదు తింటే ఇమ్యూనిటీ పెరిగి.. ఎలాంటి వైరస్ మనకి రాదట..


మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మొదటి లెవెల్ రక్షణ కవచం. ఇది వ్యాధిని కలిగించే క్రిములను దూరంగా ఉంచుతుంది. మనల్ని హెల్తీగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. ఇమ్యూన్ హెల్త్ ను వివిధ పద్దతుల ద్వారా బూస్ట్ చేసుకోవచ్చు. అందులో ఆయుర్వేదం అనేది ప్రముఖమైనది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అందుకే, ఇంఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఇంఫెక్షన్స్ కు గురయ్యే రిస్క్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. ఇమ్మ్యూన్ సిస్టమ్ ను హెల్తీగా ఉంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ పై పోరాడే శక్తిని బాడీకి అందించవచ్చు. మన ఇమ్మ్యూన్ సిస్టమ్ అనేది మొదటి లెవెల్ రక్షణ కవచం. ఇది వ్యాధిని కలిగించే క్రిములను దూరంగా ఉంచుతుంది. మనల్ని హెల్తీగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. ఇమ్యూన్ హెల్త్ ను వివిధ పద్దతుల ద్వారా బూస్ట్ చేసుకోవచ్చు. అందులో ఆయుర్వేదం అనేది ప్రముఖమైనది. ఆయుర్వేద చికిత్సలో మెడిసిన్స్ ను తయారుచేసేందుకు అనేక హెర్బ్స్ ను వాడతారు. ఇవి ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసేందుకు హెల్ప్ చేస్తాయి.

వైరస్ గొంతును అలాగే ఛాతిని అటాక్ చేసినప్పుడు బ్రాంకియల్ హెల్త్ ను ఫోకస్ చేసి తగిన ప్రికాషన్స్ తీసుకుంటే కఫ దోషం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. దాంతో, ఇన్ఫెక్షన్ తన విశ్వరూపం చూపకుండా అడ్డుకోవచ్చు. ఇవన్నీ ఇమ్యునిటీతో సాధ్యం. ఇమ్యూనిటీను నేచురల్ గా బూస్ట్ చేసేందుకు హెల్ప్ చేసే కొన్ని హెర్బ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇమ్యూనిటీ బూస్టర్ 1

కావలసిన పదార్థాలు: 5 గ్రాముల వేపాకులు

ఎలా తినాలి :

ఐదు గ్రాముల వేపాకులను గ్రైండ్ చేసి వాటిని మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ ప్రాసెస్ కు మిక్సీలను వాడకుండా రుబ్బురోలును వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అవకాశం లేకపోతే మిక్సీను వాడినా పరవాలేదు. ఈ పేస్ట్ ను గొంతు వెనుకభాగంలో పెట్టుకుని మింగేయాలి. ఖాళీ కడుపుతో దీన్ని తినాలి. ఆ తరువాత గంట పాటు ఏదీ తినవద్దు, తాగవద్దు.

లాభాలు :

వేపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. అందుకే, రోగకారక క్రిములను అరికట్టేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. ఈ ప్రాసెస్ ను 15 రోజులకు మించి ఫాలో అవ్వకూడదు. అలాగే, ఈ రెమెడీను గర్భిణీలు, పిల్లలు అలాగే సీనియర్ సిటిజన్స్ ప్రయత్నించకూడదు.

వేప నుంచి ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. శరీరాన్ని లోపల నుంచి కూల్ చేసి ఇమ్యూనిటీను బూస్ట్ చేసునేందుకు వేపాకు హెల్ప్ చేస్తుంది. వేపాకులో బ్లడ్ ను ప్యూరిఫై చేసే ప్రాపర్టీస్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. శరీరంలోని ముఖ్యమైన ఆర్గాన్సయిన లివర్ అలాగే కిడ్నీల పనితీరుకు ఆటంకం కలిగించే టాక్సిన్న్ ను రక్తంలోంచి రిమూవ్ చేస్తుంది. అందుకే, అనేక ట్రెడిషనల్ రెమెడీస్లో వేపాకుకు స్పెషల్ ప్లేస్ ఉంది. వేపాకులో అద్భుతమైన థెరపేటిక్ వాల్యూస్ ఉన్నాయి. వేపాకును క్యాప్సూల్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

ఇమ్యూనిటీ బూస్టర్ 2

కావలసిన పదార్థాలు : ఐదు గ్రాముల ఫైలాంథస్ నిరురిని తీసుకోవాలి. దీన్ని స్టోన్ బ్రేకర్ అని కూడా అంటారు.

ఎలా తినాలి: 

ఫైలాంథస్ నిరురి ఆకులు కిడ్నీ అలాగే గాల్ బ్లాడర్ స్టోన్స్ ను కరిగించేందుకు బాగా హెల్ప్ చేస్తాయి. ఇది లివర్ పనితీరును ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీను పెంచుతుంది. అలాగే హెపటైటిస్ బిపై పోరాటం చేస్తుంది. ఫైలాంథస్ నిరురిను క్యాప్సూల్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

ఇమ్యూనిటీ బూస్టర్ 3

కావలసిన పదార్థాలు: అర ఇంచు తాజాగా పీల్ చేసిన అల్లం

ఎలా తినాలి:

అర ఇంచు తాజాగా పీల్ చేసిన అల్లాన్ని మీల్స్ కు ముందు తినాలి.

లాభాలు:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ హెర్బ్ మెటాబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇమ్యూనిటీను బూస్ట్ చేస్తుంది. అల్లాన్ని గత కొన్ని సెంచరీస్ గా ట్రెడిషనల్ హోమ్ రెమెడీస్ లో భాగముగా వాడుతున్నారన్న సంగతి తెలిసిందే. అల్లంలోని ప్రాపర్టీస్ ను మనం కూడా గమనించి దీన్ని సరైన పద్దతిలో తీసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ కి బూస్ట్ అందించినట్టవుతుంది.

ఇమ్యూనిటీ బూస్టర్ 4

కావలసిన పదార్థాలు: ఒక ఉసిరికాయ

ఎలా తినాలి:

ప్రతి రోజూ ఖాళీకడుపుతో ఉదయాన్నే ఒక ఉసిరికాయను తినాలి.

లాభాలు:

ఉసిరికాయలో విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఇమ్యూనిటీను బూస్ట్ చేస్తాయి. ఒక ఉసిరికాయ 20 సిట్రిక్ ఫ్రూట్స్ తో సమానం. ఉసిరిలో ఉండే విటమిన్ సి ను శరీరం ఈజీగా గ్రహిస్తుంది. అందువలన, దగ్గు, జలుబు వంటి సమస్యలు త్వరగా అటాక్ చేయవు. ఆక్సిడేటివ్ డ్యామేజ్ వల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఈ సమస్యను తగ్గిస్తాయి. ఇవే కాదు, ఉసిరి వల్ల ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. అవేంటంటే, హెయిర్ హెల్త్, స్కిన్ హెల్త్ ను ప్రొటెక్ట్ చేసే ప్రాపర్టీస్ ఉసిరిలో పుష్కలంగా ఉన్నాయి. క్రానిక్ కండిషన్స్ ను మేనేజ్ చేసేందుకు కూడా ఉసిరి హెల్ప్ చేస్తుంది. ఇది నేచురల్ పెయిన్ రిలీవర్ గా కూడా పనిచేస్తుంది. జాయింట్ పెయిన్స్ కు అలాగే మౌత్ అల్సర్స్ కి సంబంధించిన సమస్యలను తగ్గించేందుకు ఉసిరి బాగా హెల్ప్ చేస్తుంది.

ఇమ్యూనిటీ బూస్టర్ 5

కావలసిన పదార్థాలు: గిలోయ్ మరియు బ్రహ్మి జ్యూస్.

ఎలా తినాలి:

గిలోయ్ అలాగే బ్రాహ్మి జ్యూస్ లు మార్కెట్ లో రెడీ గా లభ్యమవుతాయి. వీటిని క్యాప్సూల్ రూపంలో కూడా తినవచ్చు.

లాభాలు:

ఈ హెర్బ్స్ ను మీ రోజువారీ డైట్లో భాగంగా చేసుకుంటే ఇమ్యూనిటీ డెవలపవుతుంది. అలాగే, మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగే ఎనర్జీ బూస్టవుతుంది. తెలివితేటలూ పెరుగుతాయి.

ఐతే, మీరు గుర్తుంచుకోవలసింది ఏంటంటే, ఈ హెర్బ్స్ అనేవి శరీరంలో హీట్ పెంచుతాయి. కాబట్టి, భోజనం తరువాత మీరు మజ్జిగ తాగాలి. మజ్జిగ తాగడం ద్వారా వేడిని తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదిక్ హెర్బ్స్ బెనిఫిట్స్ ను వందశాతం పొందవచ్చు. పొట్టను సూత్ చేసేందుకు మజ్జిగ హెల్ప్ చేస్తుంది. ఇంకా డైజెషన్ ను ఇంప్రూవ్ చేసేందుకు సపోర్ట్ చేస్తుంది. డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు అసిడిటీపై పోరాడేందుకు మంచి టూల్ గా పనిచేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ను మనం మజ్జిగను తాగడం ద్వారా పొందవచ్చు. ముఖ్యంగా ఆయుర్వేదిక్ రెమెడీస్ ను పాటించేవారు మజ్జిగను తరచూ తీసుకోవాలి. లేదంటే, శరీరంలో హీట్ జెనెరేటవడం వల్ల ఇంకొన్ని సమస్యలు వస్తాయి.