మాది అరేంజ్డ్ మ్యారేజ్.. ఆయన్ను చూస్తే ఫీలింగ్స్ రావట్లేదు!

0

ప్రశ్న: నమస్తే.. నా పేరు శివరంజని (పేరు మార్చాం). నాకు 22 ఏళ్లు. మూడు నెలల క్రితం నాకు పెళ్లయ్యింది. అమ్మానాన్న చూసిన వ్యక్తినే పెళ్లాడాను. కానీ ఆయన పట్ల నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదు. ఇద్దరం కలిసి ఉన్నప్పుడు అన్యోన్యంగానే ఉంటాం. తనతో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మాత్రం మా మధ్య అంత ఎఫెక్షన్ కనిపించడం లేదు. పెళ్లికి ముందే ఈ విషయం ఆలోచించాల్సిందా? తనను ప్రేమించడం ఎలా మొదలుపెట్టాలి? సలహా ఇవ్వగలరు.

సమాధానం: ప్రేమించి పెళ్లాడితేనే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుందని, పెద్దలు కుదిర్చిన వివాహంలో దంపతుల మధ్య ఎఫెక్షన్ ఉండదని చాలా మంది భావిస్తుంటారు. అరేంజ్డ్ మ్యారేజ్‌ చేసుకున్న వారిలో ఒకరి గురించి మరొకరి ముందుగా తెలిసే అవకాశాలు తక్కువ. దీంతో తనను ఎలా చూసుకోవాలి? ఎదుటి వ్యక్తికి ఏమంటే ఇష్టం, తను ఎలాంటి వ్యక్తి అనేది తేలడానికి కాస్త సమయం పడుతుంది.

మీకు వివాహమై మూడు నెలలైందంటున్నారు. తను మంచోడని చెబుతున్నారు. తనను ప్రేమించడం ఎలా అనే విషయాన్ని పక్కనబెట్టి.. మీ ఆయనతో ఎక్కువ సమయం గడపండి. తనను మరింతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తరచుగా కలిసి బయటకు వెళ్తుండండి. కలిసి స్నానం చేయడం, వంట చేయడంలో తన సాయం తీసుకోవడం, ఒకరికొకరు బాడీ మసాజ్ చేయడం లాంటివి చేస్తే మీలో ఫీలింగ్స్ పెరుగుతాయి. ఒకరిపై మరొకరికి ఇష్టం మరింత పెరుగుతుంది.