Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> తమ సెక్స్ సామర్థ్యంపై పురుషులకెందుకు సందేహాలు?

తమ సెక్స్ సామర్థ్యంపై పురుషులకెందుకు సందేహాలు?


చాలా మంది పురుషులకు తమ సెక్స్ సామర్థ్యంపై అనేక సందేహాలు, అపోహలు ఉంటాయి. పెళ్లికి ముందు నుంచే తాను భాగస్వామిని సుఖపెట్టగలనా? అని తెగ సందేహపడిపోతుంటారు. పెళ్లయ్యాక బాగా సంతృప్తి పరిచానా? లేదా? అంటూ భార్యను కూడా వేధిస్తుంటారు. అసలు పురుషుల్లో ఇలాంటి సందేహాలెందుకుకొస్తాయంటే..

సెక్స్‌లో ఎప్పుడూ ఒకేలా ఎవరూ పాల్గొనలేరు. ఒక్కోసారి బాగా ఎంజాయ్ చేస్తే.. మరోసారి నిరాశగా ముగిస్తారు. సెక్స్‌ను ఎంత ఉద్రేకంగా చేసినా భాగస్వాములిద్దరూ సమానంగా తృప్తి, ఆనందాన్ని పొందలేరు. ఒకరిపై ఒకరు విపరీతమైన కోరికతో సెక్స్‌లో పాల్గొన్నా వారికి కలిగే సంతృప్తి 50 నుంచి 60 శాతం మేరకే ఉంటుందట. ఈ విషయం తెలీక కొందరు పురుషులు తాను భాగస్వామిని సరిగా సుఖపెడుతున్నానా? లేదా? అని ఎప్పుడూ ఆందోళన పడుతూనే ఉంటారు. భార్య ఎప్పుడైన తన ఫీలింగ్స్ గురించి చెప్పినా తనలో ఏదో లోపం ఉందని అనుమానం పెంచుకుటారు.

అయితే ఒక్కసారి సెక్స్‌లో విఫలమైతే మగవారు చాలా ఆందోళన పడుతుంటారు. తానింక సెక్స్‌కు పనికిరానేమో అని విచారిస్తారు. సామాన్యంగా మగవారికంటే మగువలకే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. కానీ వారు బయటపడరు. మగవారే మనసెరిగి దగ్గరికి తీసుకుని లాలించాలని ఆరాటపడుతుంటారు. కానీ చాలామంది మగవాళ్లు ఆఫీసు పని, బయట ఒత్తిళ్లతో దానిపై పెద్దగా మనసు పెట్టారు. ఇలాంటి సందర్భంగా సెక్స్‌ను ఏదో ఓ పనిగా భావించి ముగించేస్తారు. కానీ ఆ సమయంలో భాగస్వామి ఏం కోరుకుంటోదన్న దానిపై ఫోకస్ పెడితే ప్రయోజనం ఉంటుందని సెక్సాలజిస్టులు చెబుతున్నారు. బయట ఒత్తిడులను బెడ్‌రూమ్‌లోకి తీసుకురాకపోతే సెక్స్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.