స్ట్రెచ్ మార్క్స్‌ని కచ్చితంగా పోగొట్టే చిట్కాలు ఇవే..

0

ప్రతి మహిళా ఎదురుకునే అతి పెద్ద సమస్య స్ట్రెచ్ మర్క్స్. ప్రసవం తరువాత పొట్ట భాగంలో, భుజాల దగ్గరా, తొడల మీద ఇలా చాలా సున్నితమైన ప్రదేశాలలో వచ్చి అందాన్ని తగ్గిస్తాయి. ఇవి ఏర్పడటానికి ప్రసవం ముఖ్య కారణం కాగా, బరువు తగ్గడం వంటివి కూడా కారణాలు కావచ్చు. అయితే ప్రసవం తరువాత వచ్చే స్ట్రెచ్ మర్క్స్ వల్ల మహిళలు చాల ఇబ్బంది పడతారు. ఇవి రాకూండా ఉండేందుకు ముందే తగిన అజాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఇవి వచ్చాక వీటినీ తగ్గించడం సాధ్యం కానీ పని. కొన్ని సార్లు హార్మోనల్ల లోపం వల్ల అవి వస్తాయి. స్ట్రెచ్ మార్క్ గుర్తులు మసకబారుతాయి. తేలికపాటి రంగుతో కనబడతాయి. ఈ స్ట్రెచ్ మర్క్స్ తగ్గించుకోవడానికి మహిళలు రసాయనాలతో కూడిన క్రీములను వాడుతూ ఉంటారు. అయినా వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు సరికదా డబ్బులు దండగా. ఈ రసాయన క్రీములు వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరియు కొందరు ఖరీదైన ఉత్పత్తులు వదలేక వీటి కోసం ఏవేవో చిట్కాలను వాడుతూ ఉంటారు. సరైన చిట్కాలు తెలియక ఏవేవో ప్రయత్నించి విసుగు చెందుతారు. అలంటి వారికోసం గొప్ప చిట్కాలు. స్ట్రెచ్ మర్క్స్ పూర్తగా తగ్గటం అంట సులువు కాదు. ఈ రసాయన ఉత్పత్తులు వాడటం కన్నా సులువుగా ఇంట్లో వాడే పదార్థాలతోనే పూర్తిగా తగ్గించుకోవచ్చు. అందుకే మీకోసం తప్పకుండ ఉపయోగపడే 5 అద్భుతమైన చిట్కాలు.

​విటమిన్ ఎ..

విటమిన్ ఎ ని రెటినోయిడ్ అంటారు. విటమిన్ ఎ చర్మానికి మరియు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ఎ ను అనేక సౌందర్య ఉత్పతుల్లో ఉపయోగిస్తారు. ఇవి చర్మాన్ని సున్నితంగా మరియు యవ్వనంగా మారుస్తాయి. విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ సారాన్ని నేరుగా స్ట్రెచ్ మర్క్స్ గుర్తులపై వేసి బాగా మర్దన చేయాలి. ఇలా రోజు చేయటం వల్ల స్ట్రెచ్ మర్క్స్ తగ్గే అవకాశం ఉంది . రోజు రాత్రి పడుకునే ముందే చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. 1996 లో నిర్వహించిన పరిశోధనలో రెటినోయిడ్స్ స్ట్రెచ్ మర్క్స్ తగ్గటానికి సహాయపడతాయని గుర్తించాయి.

​షుగర్‌తో..

సహజంగా స్ట్రెచ్ మర్క్స్ తగ్గించే పదార్థాలలో చక్కర కూడా ఒకటి. చక్కరని ఆల్మండ్ ఆయిల్తో కలిపి వాడితే ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. ఇప్పుడు ఎలా వాడలో తెలుసుకుందాము. ముందుగా చక్కరని తీసుకొని, అందులో కాసింత ఆల్మండ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె, రెండు చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలపాలి.చక్కర పూర్తిగా కరిగాక స్ట్రెచ్ మార్క్స్ మీద పూసి సున్నితంగా ఆ భాగాన్ని కాసేపు మర్దనా చేయాలి. కాసేపటి తరువాత ఆ ప్రదేశాన్ని కడగడం కాని స్నానం చేయడం కాని చేయాలి. ఇలా రోజు చేస్తే స్ట్రెచ్ మర్క్స్ తగ్గుముఖం పడతాయి.

​కొబ్బరి నూనె..

చర్మం మరియు ఆరోగ్య సమస్యలకు కొబ్బరి నూనె చెక్కటి పరిష్కారం. కొబ్బరినూనె ఖరీదైనది కాదు, కానీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందుకే ఈ కొబ్బరినూనెను అనేక సమస్యలను నివారించే చికిత్సల కోసం ఉత్తమ హోం రెమెడీగా ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె దాదాపు ప్రతిదానికీ నివారణగా ఉపాయోగిస్తారు. కొబ్బరి నూనె చర్మ గాయాలను నయం చేయడానికి మరియు స్ట్రెచ్ మర్క్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెను స్ట్రెచ్ మర్క్స్ పై వేసి మర్దన చేయాలి. ఇలా రోజు చేస్తే స్ట్రెచ్ మర్క్స్ తగ్గుతాయి. కొబ్బరి నూనె కు చర్మ సమస్యలను నయం చేసే శక్తీ ఉందని అనేక అధ్యయనాలు నిరూపించాయి.

​అలోవేరా

చర్మ సమస్యలు లేదా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో అలో వీర కంటే గొప్పది లేదు అనడంలో అతిశయోక్తి కాదు. అలో వీర ని చాల వరకు సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. ఆలో వీరా చర్మం మరియు ఆరోగ్యానికి ఏంటో మంచిది. వీటి లోని సహజ గుణాలు స్ట్రెచ్ మార్క్స్ ని కూడా పూర్తిగా నిర్మూలించగలవు.

సహజంగా దొరికే అలో వీర గుజ్జును చారల మీద పూసి మృదువుగా మర్దన చేయండి. కాసేపటి తరువాత స్నానం చేయాలి. ఇలా రోజు స్నానం చేయడానికి 30 నిమిషాల ముందు స్వచ్ఛమైన కలబందను స్ట్రెచ్ మర్క్స్ పై వేసి మర్దన చేస్తే తగ్గుముఖం పడతాయి .

హ్యాలురోనిక్ ఆసిడ్

కొల్లాజెన్ చర్మంలోని ప్రోటీన్, ఇది చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. వయస్సు తో పాటు కొల్లాజెన్ ముఖం మరియు శరీరం లో తగ్గుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని హ్యాలురోనిక్ ఆసిడ్ ఉత్తేజపరచవచ్చు, దీనిని క్యాప్సూల్ ద్వారా తీసుకోవచ్చు. హ్యాలురోనిక్ ఆసిడ్ వల్ల స్ట్రెచ్ మర్క్స్ తగ్గే అవకాశం ఉంది. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా ఉపయోగించినట్లు అయితే స్ట్రెచ్ మర్క్స్ తగ్గే అవకాశం ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఇక ఈ చిట్కాలను ప్రయత్నించండి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-