Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> ప్రెగ్నెన్సీ టైమ్‌లో బలపాలు, చాక్‌పీస్‌లు తింటే ఏమవుతుందంటే..

ప్రెగ్నెన్సీ టైమ్‌లో బలపాలు, చాక్‌పీస్‌లు తింటే ఏమవుతుందంటే..


కొంతమందికి రెగ్యులర్ గా చాక్ పీసెస్, బలపాలు తినాలనిపిస్తుంటుంది. దీనికి కారణం పీకా అనే ఓ సమస్య ఉన్నట్లు. దీనికి గనుక సరిగ్గా ట్రీట్‌మెంట్ తీసుకోకపోతే భవిష్యత్‌లో అది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌కి దారి తీయొచ్చు. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..

​ఎందుకు కొంతమంది చాక్ తింటారు?
పీకా అనే సమస్య ఉన్నవారు బలపాలు, చాక్‌పీస్‌లు తింటారు. వీరికి మట్టీ, చాక్ పీసులు, ఐస్ వంటి వాటిని చూడగానే నోరూరిపోతుంటుంది. ఇది ఒక ఈటింగ్ డిసార్డర్ గా చెప్పొచ్చు. ఓసీడీ ఉన్నవారూ, పోషకాహార లేమి తో బాధపడుతున్నవారూ, ప్రెగ్నెంట్ గా ఉన్న వారూ కూడా ఇలా తింటారు. ఒక్కోసారి బాడీ లో అవసరమైనంత జింక్ లేకపోయినా కూడా ఈ పీకా వస్తుంది.

​చాక్ తింటే ఏమవుతుంటుందంటే..
రెండేళ్ళ లోపు పిల్లలు చాక్ కానీ మట్టి కానీ తింటుంటే దాన్ని ఎబ్నార్మల్ గా కన్సిడర్ చేయరు. ఆ వయసు లో వాళ్ళకి అది సహజమే. ఏది అయినా తినచ్చు, ఏది తినకూడదు వాళ్ళకి తెలీదు కాబట్టి అది పీకా అవ్వదు. పీకాని డయాగ్నోజ్ చేయడానికి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎంత కాలంగా చాక్ తింటున్నారు, ఎప్పుడెప్పుడు తింటున్నారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా వంటి ప్రశ్నలు అడుగుతారు. ఒకవేళ రెగ్యులర్ గా చాక్ తింటున్నట్టు తేలితే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయిస్తారు. దీని వల్ల బాడీ లో పేర్కొన్న లెడ్, ఎనీమియా, వంటివి తెలుస్తాయి. ఒకవేళ ఎవరికైనా మట్టి తినే అలవాటు ఉంటే మోషన్ శాంపిల్ టెస్ట్ చేస్తారు. దీని వల్ల కడుపులో పురుగులు ఉన్నాయా లేదా తెలుస్తుంది.

​తినడం వల్ల వచ్చే నష్టాలేంటి?
చాక్‌పీస్‌లు, బలపాల పెద్ద విష పదార్ధం కాదు. కానీ దాన్ని తినటం మంచిది కాదు. దాని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి:

1. దంతాలు పాడవ్వడం

2. జీర్ణ సమస్యలు

3. మలబద్ధకం

4. లెడ్ పాయిజనింగ్

5. కడుపులో నులిపురుగు పెరగడం

6. ఆకలి లేకపోడం

​ప్రెగ్నెంట్స్ బలపాలు తింటే..
ప్రెగ్నెంట్స్ గానీ, ఫీడింగ్ మదర్స్ కానీ వీటిని తింటే దాని వల్ల వచ్చే నష్టాలు వేరేలా ఉంటాయి. వారికి సరిగా ఆకలి కాక, అన్ని రకాలా ఆహార పదార్ధాలూ తీసుకోక, పోషకాహార లేమి వస్తుంది. ఇది వారికి మాత్రమే కాదు.. పుట్టిన, పుట్టబోయే పిల్లలకి కూడా మంచిది కాదని చెబుతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అదే పిల్లలు తింటే.. పిల్లలకి ఈ తిండి మహా సరదాగా ఉంటుంది. అందరూ తినకపోవచ్చు కానీ, పిల్లల్లో చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కాబట్టి పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు పిల్లలు ఈ అలవాటుకి బానిస కాకుండా చూసుకోవాలి. వారికి భయం పెట్టాలి.

​చికిత్స ఏంటి?
చేయించిన టెస్ట్ రిజల్ట్స్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. రిజల్ట్స్ లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్లు తీసుకోవచ్చు. ఒక్కోసారి దీని వల్ల ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోవచ్చు. ఓసీడీ లాంటి వాటి వల్ల చాక్ తింటుంటే, మందులతో పాటూ థెరపీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది జాగ్రత్త గమనించాలి.చాక్ వల్ల ఎలాంటి ప్రాబ్లం పెద్దగా రాకపోయినా, చాక్ లాంటి తినకూడని పదార్ధాలు తినాలి అనిపించటమే పెద్ద ప్రాబ్లం. దీని ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది.