శృంగారంలో ప్రాణాలకే ముప్పు తెచ్చే బ్యాక్టీరియాలివే..!

0

శృంగారం దివ్యౌషధం అంటారు. అయితే శృంగారంతో కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తూనే ఉంటాయి. తనివి తీరా అనుభవించే సెక్స్ విషయంలో అందరూ ఒళ్లు మిన్ను కానకుండా రెచ్చిపోతుంటారు. అయితే సెక్స్ వల్ల సంక్రమించే వ్యాధులు గురించి మాత్రం పట్టించుకోరు. జనజీవనానికి ప్రాణాంతకంగా మారిన 4 బ్యాక్టీరియాలు గురించి తెలుసుకుందాం.

*నైస్సీరియా మెనింజిటిడిస్

నైస్సీరియా మెనింజిటిడిస్ అనే బ్యాక్టీరియా మనిషి మెదడు వెన్నెముక చుట్టూ ఉన్న రక్షణ పొరలపై దాడి చేసి ప్రాణాంతకంగా మారుతుంది. మూత్రనాళం జననాంగాలకు సోకే ఇన్ఫెక్షన్ ల ద్వారా నైస్సిరియా బ్యాకిరియా మనకు సోకుతుంది.

*మైకోప్లాస్మా జెనిటేలియమ్

మైకోప్లాస్మా జెనిటేలియమ్ బ్యాక్టీరియా అనేది శృంగారం వల్ల సంక్రమించే ఇన్ఫెక్షన్. దీనివల్ల గనేరియా మూత్రవాహిక కంఠంపై దురద లక్షణాలు కనిపిస్తాయి. మహిళలకు ఈ ఇన్ఫెక్షన్ వల్ల పెల్విక్ ప్రాంతంలో తీవ్రమైన మంట కలుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తీవ్రమైన వ్యంధత్వం గర్భస్రావం మృతశిశువు జననం లాంటి సమస్యలు కలుగుతాయి.

*షిగెల్ల ప్లెక్సినరీ

షిగెల్ల ప్లెక్సినరీ అనే బ్యాక్టీరియా ప్రత్యక్షంగా పరోక్షంగా అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు.. ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. దీంతో కడుపునొప్పితోపాటు చీము రక్తంతో విరేచనాలు కలిగి బ్యాక్టీరియా మరింత ప్రబలంగా వ్యాప్తి చెందుతుంది.

*లింపోగ్రాన్యులోమా వెనెరియమ్

శృంగారం వల్ల సంక్రమించే వ్యాధుల్లో ఇదీ ఒకటి. క్లామిడియా ట్రకోమ్యాటిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి జననేంద్రియాల్లో తాత్కాలిక పులిపిర్లను కలుగజేసి పొక్కులు కట్టి.. అది పుండుగా మారి.. శరీరంలోని వ్యవస్థపై దాడిచేస్తుందని తేలింది. మలద్వార ఇన్ఫెక్షన్ దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించే అవకాశాలున్నాయి. ఫిస్టులా ఏర్పడడం.. మలద్వారా కుచించుకుపోవడం జరుగుతుంటాయి.