Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> తడి జుట్టుకు టవల్ వాడటం వలన కలిగే నష్టాలు

తడి జుట్టుకు టవల్ వాడటం వలన కలిగే నష్టాలు


మనలో చాలా మంది, స్నానం తరువాత ముఖ్యంగా స్త్రీలలో జుట్టు ఆరుటకు టవల్ ను చుట్టూ కుంటారు. దీని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఈ అలవాటును ఇలానే కొనసాగించటం వలన భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే, ప్రతిసారి కఠినమైన నిర్మాణాన్ని కలిగి ఉండే ఫైబ్రిక్ లేదా టెర్రీ టవల్ ను వాడటం వలన జుట్టు ఆరోగ్యం ప్రమదానికి గురై వెంట్రుకల కొనలు తెగటం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

జుట్టు ఎలా ప్రమాదానికి గురవుతుంది?
పొడిగా ఉండే జుట్టు కన్నా, తడి జుట్టు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే నీటిలో నానిన జుట్టు, స్థితిస్తాపకతను కలిగి ఉండి మరియు తెగిపోవటానికి సులువుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కఠినంగా, పొడిగా ఉండే టవల్ లేదా టెర్రీ టవల్ తో జుట్టు లాగటం వలన మృదువుగా ఉండే టవల్ (వెంట్రుకల బయటిపొర) ప్రమదానికి గురై జుట్టు రాలిపోతుంది.

దీనికి బదులుగా
కఠిన నిర్మాణం గల టవల్ లకు బదులుగా నీటిని గ్రహించే టవల్ లేదా మైక్రోఫైబర్ టవల్ లను వాడండి. ఈ మైక్రోఫైబర్ టవల్ లు కృత్రిమ ఫైబర్ ల నుండి తయారు చేస్తారు మరియు ఇవి నీటిని త్వరగా జుట్టు నుండి లాగివేస్తాయి. ఇలా తడి జుట్టు నుండి నీరు వేరు చేయటం వలన కొద్ది సమయంలోనే గాలికి జుట్టు ఆరుతుంది. లేదా మీ జుట్టును గాలి సహాయంతో ఆరబెట్టాటినికి ముందు మృదువైన T-షర్ట్ తో తుడవండి.

జుట్టును ఆరబెట్టే ఉత్తమ పద్దతి
జుట్టును ఆరబెట్టే ఉత్తమ పద్దతి ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది- అదే సహజంగా గాలి ద్వారా ఆరబెట్టడం. కొంత మంది జుట్టును ఆరబెట్టడానికి కృత్రిమ హెయిర్ డ్రయర్ లను వాడతారు. వీటి వలన జుట్టు ఆరోగ్యం ప్రమాదనికే గురవుతుంది తప్ప వేరే ప్రయోజనం ఉండదు. స్నానం చేసిన తరువాత, మృదువుగా ఉండే టవల్ లేదా T-షర్ట్ ను జుట్టుపై కప్పండి, ఇలానే కొద్ది సమయం పాటూ ఉంచటం వలన సహజంగానే జుట్టు ఆరిపోతుంది. కానీ, ఈ పద్దతికి అనుసరించుటకు ఎక్కువ సమయం పట్టినప్పటికీ, తడి జుట్టుతో బయటకు వెళ్ళటం వలన వేసుకున్న బట్టలు లేదా ఇతర ముఖ్యమైన శరీర ప్రదేశాలు తడిసి ఇబ్బందులు ఎదుర్కోవటం కన్నా ఇలా సహజంగా ఆరబెట్టడటం ఉత్తమం అని చెప్పవచ్చు.

ప్రమాదానికి గురైన జుట్టును మరమ్మత్తు చేయటం
ప్రారంభం నుండి టవల్ ను వాడి ఇపుడు ప్రమాదానికి గురైన జుట్టును మరమ్మత్తు చేయాలి అనుకుంటున్నారా? కొన్ని పద్దతులను అనుసరించటం ద్వారా జుట్టు యొక్క బలమైన నిర్మాణాన్ని తిరిగి పొందవచ్చు మరియు ప్రమాదాలను మరమ్మత్తులు చేయవచ్చు.
మీ జుట్టుకు సరిపోయే షాంపూ మరియు కండిషనర్ ను వాడటం ముఖ్యం. ఒకవేళ మీ ఉంగరాల జుట్టును కలిగి ఉంటే- ఉంగరాల జుట్టు కోసం తయారు చేసిన ప్రత్యేక ఉత్పత్తులు మార్కట్లో లభిస్తాయి వాటిని మాత్రమే వాడండి. ఒకవేళ మీరు రంగు గల జుట్టును కలిగి ఉంటే- రంగు ఉన్న జుట్టు కోసం తయారు చేసిన ప్రత్యేక ఉత్పత్తులను మాత్రమే వాడండి.