Srikaram Subhakaram 12 Jan 2014

0

Srikaram Subhakaram 12-Jan-2014

రాశి ఫలాలు

Dec 12th Jan  to  18th Jan`2014– by Vakkantam Chandra Mouli, janmakundali.com

మేషం
ఆర్ధిక ఇబ్బందులు ఎదురవడం తో కొత్త గా రుణాలు చేయవలసి వస్తుంది
వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు
దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది
ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు
ఆలోచనలు నిలకడగా ఉండవు
వ్యాపారాలు సామాన్యం గా ఉంటాయి
ఉద్యోగావర్గాలకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది
పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి
కళాకారులకు ఒత్తిడులు అధికమవుతాయి
విద్యార్దులు కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొంటారు
మహిళలకు మనోవేదన పెరుగుతుంది
మంగళ, బుధవారాలలో అనుకూలంగా ఉంటుంది. కార్యజయం. శుభవర్తమానాలు అందుతాయి. ఆకస్మిక ధనలబ్ది ఉంటుంది. పురపుమిత్రుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది. భార్యభర్తల మధ్య చికాకులు తొలగుతాయి
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది

వృషభం
వ్యూహాత్మక వైఖరి తో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు
విలువైన వస్తువులు సమకూర్చుకొంటారు
ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు
స్థిరాస్థి వివాదాలు తీరుతాయి
రాబడి పెరుగుతుంది. రుణ భాధలు తొలగుతాయి
ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకొంటారు
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి
వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతం గా ఉంటాయి. అనుకొన్న పెట్టుబడులు అందుతాయి
ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు
రాజకీయ, సాంకేతిక వర్గాలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి
విద్యార్దులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి
కళాకారులకు అవార్డులు ఊరిస్తాయి
మహిళలు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు
మంగళ, బుధవారాలలో ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అశాంతి ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. చికాకులు పెరుగుతాయి
తూర్పు దిశ ప్రయాణాలు సానుకూలం
ఆదిత్య హృదయం పఠించడం మంచిది

మిథునం
వ్యవహారాలు ముందుకు సాగవు
ఆలోచనలు ష్టిరం గా ఉండవు
బంధువర్గం తో అకారణం గా తగాదాలు ఏర్పడతాయి
తీర్థయాత్రలు చేస్తారు
ఎంతకష్టించినా ఫలితం కనిపించదు
వివాదాలకు దూరం గా ఉండాలి
స్నేహితుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకొంటారు
కాంట్రాక్టులు చేజారుతాయి
వాహనాల విషయం లో జాగ్రత్త పాటించడం మంచిది
వ్యాపారులు పెట్టుబడులలో మరింత జాగ్రత్త గా వ్యవహరించాలి
ఉద్యోగులకు స్థానచలన సూచనలు
పారిశ్రామిక వర్గాలకు కొంత గందరగోళం గా ఉంటుంది
నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి
కళాకారులకు అవకాశాలు కొద్ది లో తప్పిపోతాయి
మహిళలకు మానసిక ఆందోళన ఉంటుంది
మంగళ, బుధవారాలలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తు వస్తు లాభాలు ఉంటాయి. ప్రయత్నా కార్య సిద్ది. కుటుంబం లో అనుకూల వాతావరణం నెలకొంటుంది
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
ఆంజనేయ స్వామి ని పూజించడం మంచిది. ముఖ్యం గా ఆకుపూజ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి

కర్కాటకం
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు
ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి
ఇళ్ళు, వాహనాలు కొనుగోలు చేస్తారు
ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
సన్నిహితులతో ఉత్సాహం గా గడుపుతారు
గుర్తింపు రాగలదు
చిరకాల ప్రత్యర్డులు మీకు సన్నిహితం గా మారుతారు
దూర ప్రదేశాల నుండి ఆహ్వానాలు అందుతాయి
వ్యాపారాలలో లాభాలు అందుకొంటారు
ఉద్యోగులు అనుకొన్న పదోన్నతులు దక్కుతాయి
పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతం గా ఉంటుంది
కళాకారులకు సన్మానాలు అందుతాయి
మంగళ, బుధవారాలలో దూరప్రయాణాలు, మిత్రులతో విబేధాలు, అనారోగ్య సూచన, భార్యాభర్తల మధ్య విబేదాలు ఉంటాయి
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
రావిచెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది

సింహం
ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది
సన్నిహితులు మీకు అన్నింటా సహకరిస్తారు
కొన్ని వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు
విలువైన వస్తువులు సేకరిస్తారు
ఆలయాలు సందర్శిస్తారు
పరపతి పెరుగుతుంది
జీవితభాగస్వామి ద్వారా ఆస్తి లాభం
ఆహ్వానాలు అందుతాయి
ఉద్యోగులకు రావలసిన బకాయిలు అందుతాయి. కొందరికి ప్రోమోషన్లు లభించే అవకాశాలు లభిస్తాయి
వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకొంటారు
సాంకేతిక వర్గాల వారు అనుకున్న లక్ష్యాలు సాదిస్తారు
కళాకారులకు గౌరవ పురస్కారాలు అందుతాయి
శుక్ర, శనివారాలలో ప్రయాణాలు ఉంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. భార్యభార్తమధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. మానసిక ఆందోళన ఎక్కువవుతుంది
తూర్పు దిశ ప్రయాణాలు సానుకూలం
శివాలయం లో ఆవునేతి తో దీపం వెలిగిస్తే మంచిది

కన్య
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది
ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు
నలుగురి లో మీ పరపతి పెరుగుతుంది
వ్యవహారాలలో విజయం సాదిస్తారు, జీవితాశయం నెరవేర్చుకొనేందుకు ప్రయత్నిస్తారు
వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు
ఆశయాలు సిద్దిస్తాయి
వ్యూహాల అమలు లో ముందడుగు వేస్తారు
వ్యాపారులకు లాభాలు తథ్యం
ఉద్యోగావర్గాలకు ఉత్సాహవంతం గా గడుస్తుంది
రాజకీయవర్గాల వారు చాకచక్యం గా ప్రత్యర్దుల పై పట్టు సాదిస్తారు
నిరుద్యోగులకు ఉద్యోగ లాభం
ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగడం మంచిది
ఆది, సోమవారాలలో వ్యయ ప్రయాసలు ఉంటాయి. పనుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు ఎదురవుతాయి. బంధ్వులతో అకారణం గా తగువులు ఏర్పడతాయి
ఉత్తర దిశ ప్రయాణాలు లాభిస్తాయి
ఆంజనేయ స్వామి ని పూజించడం మంచిది

తుల
రాబడి అంతగా ఉండదు. రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి
ఆలోచనలు నిలకడగా ఉండవు
భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి
కోర్టు కేసులు ఎదురుకొంటారు
పనుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి
దేవాలయాలు సందర్శిస్తారు
స్థిరాస్థి వివాదాలు నెలకొంటాయి
ఇంటి నిర్మాణప్రయత్నాలు ఫలిస్తాయి
వ్యాపారులకు లాభాలు కనిపించవు. బ్యాంకులు నుంచి ఒత్తిడులు అధికమవుతాయి
ఉద్యోగులు సమర్ధతను నిరుపించుకోవలసిన సమయం. పై అధికారుల నుంచి పిలుపు రావచ్చు
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి
కళాకారులకు నిరుత్సాహం ఎదురవుతుంది
విద్యార్దులు అందిన అవకాశాలు సైతం జారవిడుచుకొంటారు
మహిళలకు మానసిక అశాంతి. కుటుంబం లో వివాదాలు పెరుగుతాయి
శుక్ర, శనివారాలలో శుభవార్తలు వింటారు. కొంత ఆందోళన తగ్గుతుంది. ధన లాభం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
నరసింహ స్వామి ని పూజించడం మంచిది

వృశ్చికం
మొదట్లో ఉన్న ఉత్సాహం తరువాత సడలుతుంది
అనుకున్న కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి
ఆరోగ్యపరం గా చికాకులు తప్పవు
ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి
ఆలోచనలు నిలకడగా ఉండవు
కుటుంబసభ్యులతో విబేధాలు నెలకొంటాయి
కాంట్రాక్టర్లు కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది
ఆదాయం నిరాశ కలిగిస్తుంది
వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు
ఉద్యోగావర్గాలకు స్థాన మార్పులు ఉంటాయి
రాజకీయవర్గాలకు ప్రజాదారణ తగ్గుతుంది
కళాకారులు అందిన అవకాశాల పై పెదవి విరుస్తారు
మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి
ఆది, సోమవారాలు కొంత అనుకూల సమయం. రావలసిన సొమ్ము అందే సూచనలు కలవు. గౌరవమర్యాదలు పొందుతారు
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది

ధనుస్సు
కొత్త విషయాలు తెలుసుకొంటారు
అందరిలోనూ మీ కంటూ గౌరవం లభిస్తుంది
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు
అనుకున్నది సాధించేవరకూ విశ్రమించారు
వాహనాలు, భూములు కొనుగోలు చేయాలనుకొనే వారికి మంచి సమయం
ఎంతటి వారినైనా ఆకట్టుకుని మీ వైపునకు తిప్పుకుంటారు
ఆదాయం సమృద్దిగా ఉంటుంది. రుణ భాధలు తొలగుతాయి
భాగస్వామ్య వ్యాపారాలు మరింత ఉత్సాహవంతం గా సాగుతాయి.లాభాలు అనుకున్న విధం గా ఉంటాయి
ఉద్యోగులకు పదోన్నతులు లభించే సమయం
పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి
కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి
మహిళలకు కార్యజయం. శుభవార్తలు వింటారు
శుక్ర, శనివారాలు అనుకోని ఖర్చులు వస్తాయి. మానసిక ఆందోళన. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి
తూర్పు దిశ ప్రయాణాలు సానుకూలం
దత్తాత్రేయ స్వామి ని పూజించడం మంచిది

మకరం
కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలం లో పూర్తి చేస్తారు
అందరిలోనూ ప్రత్యేకత చాటుకొంటారు
పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు
సత్ర్వులు సైతం మిత్రులు గా మారి మీకు సహయాపడతారు
శత్రువులు సైతం మ్తిహృలు గా మారి మీకు సహాయపడతారు
ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు
ఆహ్వానాలు, గ్రీటింగ్లు అందుతాయి
కాంట్రాక్టర్లకు అనుకూల సమయం
పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు
వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి
ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి
రాజకీయవర్గాలకు పదవులు,హోదాలు లభిస్తాయి
కళాకారులకు మిత్రుల నుంచి చేయుత లభిస్తుంది
మహిళల కు తల్లి తరఫు నుండి ధన, ఆస్తి లాభాలు పొందేవీలుంది
ఆది, సోమావారాలలో ఇంటాబయటా చికాకులు అధికమవుతాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు పెరుగుతాయి . అనారోగ్య సూచన
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
ఆదిత్య హృదయం పఠించడం మంచిది

కుంభం
ఈ వారం చేపట్టిన పనులు ముందుకు సాగవు
కొత్త గా రుణాలు చేస్తారు
ఆత్మీయులు సైతం అలిగి దూరమవుతారు
మీ గుర్తింపు నిరాశ చెందుతారు
విలువైన వస్తువులు జాగ్రత్త గా చూసుకోవాలి
ఆలోచనలు స్థిరం గా ఉండవు
భాద్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి
వ్యాపారులకు ఆశించిన లాభాలు అందాకా నిరుత్సాహం మిగులుతుంది
ఉద్యోగులు పని సతమతమవుతారు
ఆలయ దర్శనాలు
సాంకేతిక వర్గాల వారు ఆలోచించి ముందుకు సాగాలి
తొందరపడకుండా కాస్త ఆలోచించాలి
మహిళలకు మనోవేదన అధికమవుతుంది
శుక్ర, శనివారాలలో విందువినోదాలలో పాల్గొంటారు. భార్యాభర్తలు, సోదరీసోదరుల మధ్య వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాన యోగం లభిస్తుంది
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
గణపతిని పూజించడం మంచిది

మీనం
ఈ వారం పనులు మందకొడిగా సాగుతాయి
బంధువర్గం తో తగాదాలు ఏర్పడే అవకాశం కలదు
ఓర్పు తో ఇంటాబయటా ఒడిదుడుకులను ఎదురుకోవలసి వస్తుంది
సోదరుల నుంచి ఆస్తి విషయాలలో ఒత్తిడులు ఎదురుకొంటారు
ఇంటి నిర్మాణాల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి
విద్యార్దుల అంచనాల్లో పొరపాట్లు జరుగుతాయి
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు
ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి
మీ కష్టం ఫలించదు
వ్యాపారులకు లాభ నష్టాలు సమానం గా ఉంటాయి
ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహించారాదు
పారిశ్రామిక వర్గాలకు విదేశీ అవుతాయి
కళాకారులకు నిరుత్సాహం ఎదురవుతుంది
మహిళలలు కుటుంబ సమస్యలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు
ఆది సోమవారాలలో శుభ వర్తమానాలు అందుతాయి. ధనలాభం చేకూరుతుంది.
ప్రయత్నించిన కార్యాలు ఫలిస్తాయి. జీవితభాగస్వామి తో మంచి సఖ్యత ఏర్పడుతుంది
ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి
హనుమంతుణ్ణి పూజించండి మంచిది.