Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 25th May 2014

Srikaram Subhakaram 25th May 2014


రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Srikaram Subhakaram 25th May 2014

Weekly Horoscope (2014-05-25  –  2014-05-31)

మేషం..
—–
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
హాస్యోక్తులతో బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు.
నిరుద్యోగులు సత్తా చాటుకుని విజయాలు సాధిస్తారు.
సేవాభావంతో ముందుకు సాగుతారు.
ఆర్థికంగా కొంత బలపడతారు. రుణాలు తీరతాయి.
పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ఆత్మీయులు మరింత దగ్గరవుతారు.
వాహనాలు, స్థలాలు కొంటారు.
జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు.
వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. లాభాలు అందుతాయి.
ఉద్యోగులకు కొత్త హోదాలు తథ్యం.
పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం, విదేశీ పర్యటనలు.
కళాకారులకు అవకాశాలు దగ్గరకు వచ్చి ఆశ్చర్యపరుస్తాయి.
మహిళలకు మనోధైర్యం పెరుగుతుంది.
బుధ,గురువారాలలో ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కలహాలు.
దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం..
——-
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది.
కొన్ని సమస్యలు తీరి ఊరట కలిగిస్తాయి.
పెద్దలు, కుటుంబసభ్యుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు.
భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు.
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
విద్యార్థులకు ఊహించని ర్యాంకులు దక్కుతాయి.
ఒక చిరకాల స్వప్నం నెరవేరేసమయం.
ఆలోచనలు అమలు చేస్తారు.
వ్యాపారాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు.
ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రతిబంధకాలు తొలగుతాయి.
పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. కార్యజయం.
రాజకీయవర్గాలు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. సన్మానాలు.
కళాకారులు గతంలో పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు.
మహిళలకు మానసిక ప్రశంతతచేకూరుతుంది.
ఆది, సోమవారాలలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గామాతకు కుంకుమార్చన చేయించుకుంటే మంచిది.

మిథునం…
——–
ఈవారం వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.
బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
కుటుంబంలో శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు.
పరిచయాలు పెరుగుతాయి.
వాహనాలు, స్థలాలు కొంటారు.
ఆశయాలు సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు.
శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం.
ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. పదోన్నతులు దక్కవచ్చు.
పారిశ్రామికవర్గాలు విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుకుంటాయి.
రాజకీయవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. పదవీయోగం.
కళాకారులు అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు.
మహిళలకు అరుదైన పురస్కారాలు.
బుధ, గురువారాలలో కుటుంబసభ్యులతో కలహాలు. మానసిక ఆందోళన.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
శివాలయంలో 11సార్లు ప్రదక్షణలు మూడు రోజులు చేయండి.

కర్కాటకం…
——
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.
ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
పరపతి పెరుగుతుంది.
సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.
ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు.
ఇంటర్వ్యూలు అందుతాయి.
వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి.
పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం.
కళాకారులకు అవార్డులు దక్కవచ్చు.
మహిళలకు కుటుంబంలో విశేషమైన గౌరవం పొందుతారు.
శుక్ర, శనివారాలలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
ఆదిత్య హృదయం పఠించండి.

సింహం…
——-
ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనా క్రమేపీ సర్దుబాటు కాగలవు.
శత్రువులు కూడా అనుకూలురుగా మారతారు.
చాకచక్యం, ఓర్పుతో ముందుకు సాగి వ్యవహారాలు పూర్తి చేస్తారు.
ఆలోచనలు అమలు చేస్తారు.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
సంఘంలో గౌరవం పెరుగుతుంది.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
కోర్టు వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.
మీ శ్రమ కొలిక్కి వస్తుంది.
భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.
పారిశ్రామిక, వైద్యరంగాల వారికి యోగవంతంగా ఉంటుంది.
కళాకారులు అవకాశాలపై సంతృప్తి చెందుతారు.
నిరుద్యోగులకు ఉద్యోగయోగం.
మహిళలకు శుభవార్తలు వింటారు.
సోమ, మంగళవారాలలో కుటుంబంలో చికాకులు. బాధ్యతలు పెరుగుతాయి.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
దుర్గామాతకు అర్చన చేయించుకుంటే మంచిది.

కన్య…
—–
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు.
వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు.
ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.
ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.
ఆహ్వానాలు అందుతాయి.
విచిత్రమైన సంఘటనలు.
వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.
పాతమిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.
కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది.
పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.
రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు.
కళాకారులు అనుకున్న అవకాశాలు పొందుతారు.
మహిళలకు మానసిక ప్రశాంతత.
బుధ, గురువారాలలో ధననష్టం. కుటుంబసభ్యులతో కలహాలు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ పూజలు మంచిది.

తుల…
—–
ఇంటిలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.
సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది.
సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి.
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
స్థిరాస్తివృద్ధి, కోర్టుల్లోని కేసులు పరిష్కారం.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ఇంతకాలం మీ శ్రమ ఫలిస్తుంది.
వ్యాపారాలు పుంజుకుంటాయి.
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు.
పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
రాజకీయవర్గాలకు సన్మానాలు.
కళాకారులు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుంటారు.
మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది.
శుక్ర,శనివారాలలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ధననష్టం.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చికం…
——-
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.
ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
విద్యార్థులకు మంచి ర్యాంకులు దక్కవచ్చు.
ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.
పరపతి పెరుగుతుంది.
ఆశయాలు నెరవేరతాయి.
ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగులకు సంతోషకరంగా ఉంటుంది. పదోన్నతి అవకాశాలు.
పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు.
రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి.
కళాకారులు ఉత్సాహంగా గడుపుతారు.
మహిళలకు కుటుంబంలో గౌరవం.
ఆదివారం ధనవ్యయం. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
గణపతిని పూజించండి.

ధనుస్సు..
——
పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు.
బంధువులు మీ అభివృద్ధిలో సహకరిస్తారు.
అందరిలోను ప్రత్యేక గౌరవం పొందుతారు.
చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
వాహనయోగం.
విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం.
ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు.
వ్యాపారాలు విస్తరిస్తారు.
ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు.
కళాకారులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.
మహిళలకు సన్మానయోగం.
సోమ, మంగళవారాలలో వ్యయప్రయాసలు. కుటుంబంలో ఒత్తిడులు.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
శివస్తోత్రాలు పఠించండి.

మకరం…
——-
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కొంత సర్దుబాటు కాగలవు.
కొత్తగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ఆత్మీయులు, బంధువుల ఆదరణ పొందుతారు.
వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.
కొన్ని బాకీలు వారం చివరిలో అందుతాయి.
స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.
జీవిత భాగస్వామి సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు.
పరపతి పెరుగుతుంది.
గృహం, వాహనాలు కొంటారు.
వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగులకు కొత్త హోదాలు తథ్యం.
పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు.
కళారంగం వారు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.
మహిళలకు మానసిక ప్రశాంతత.
సోమ, మంగళవారాలలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం…
——-
రావలసిన సొమ్ము అందక ఇబ్బంది పడతారు.
కొత్తగా రుణాలు సైతం చేస్తారు.
ఆలోచనలు నిలకడగాఉండవు.
వివాదాలకు దూరంగా ఉండండి.
బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
సోదరులు, మిత్రులతో కలహాలు.
చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు వేధిస్తాయి.
వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.
ఉద్యోగులకు స్థానచలన సూచనలు.
పారిశ్రామిక,రాజకీయవర్గాలకు నిరుత్సాహం.
కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి.
మంగళ, బుధవారాలలో ధన,వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి.
తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.
శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి.

మీనం…
——
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.
మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు.
ఎంతటి వారినైనా ఆకట్టుకుని మీ సత్తా చాటుకుంటారు.
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
ఇంటి నిర్మాణాలు చేపడతారు.
వేడుకల్లో పాల్గొంటారు.
ఆలయాలు సందర్శిస్తారు.
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.
వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. లాభాలు తథ్యం.
ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.
పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.
కళారంగం వారికి అవార్డులు దక్కే ఛాన్స్.
మహిళలకు శుభవర్తమానాలు.
శుక్ర, శనివారాలలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.
వేంకటేశ్వరస్వామిని పూజించండి.

Tags; Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 18th May 2014,