No Happy Married Life In AP

0

‘హనీమూన్’.. కొత్తగా పెళ్లైన జంట ఏకాంతంగా విహారప్రదేశాల్లో తిరుగుతూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒకరినొకరు శారీరకంగా మానసికంగా దగ్గర కావడానికి ఎందుకున్న మార్గం. కానీ ఈ హనీమూన్ అనేది పెద్దింటి కుటుంబాలకే పరిమితమైంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన హనీమూన్ వెళ్లే జంటలు చాలా తక్కువ. మన సంప్రదాయాలు కట్టుబాట్లు కూడా హనీమూన్ ను దూరం చేస్తున్నాయి.

ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మన ఆర్థిక పరిస్థితులు.. దక్షిణాది రాష్ట్రాల్లో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారే ఎక్కువ. అప్పులు చేసి పెళ్లి చేసుకోవడం.. పెళ్లి అయ్యాక ఆ అప్పులు మీద పడడంతో కిందా మీద పడిపోతుంటారు. ఇక హనీమూన్ అనే మాటే వినిపించదు. ఇక ఎక్కువగా ఉమ్మడి కుటుంబాల్లోనే కొత్త జంటలు కాపురాలు పెడుతుంటారు. భాగస్వామితో కనీసం మనుసు విప్పి మాట్లాడుకునే ప్రైవసీ కూడా ఆ కుటుంబాల్లో కొత్త జంటలకు ఉండదు.

ఆర్థికంగా వెనుకబడి ఉండడం.. ఉమ్మడి కుటుంబాల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో పెళ్లి తర్వాత కొత్త జంటలు సుఖపడడం లేదని జాతీయ నమూనా సర్వే-2018 షాకింగ్ రిపోర్టు బయటపెట్టింది.

దేశవ్యాప్తంగా చేసిన జాతీయ నమూనా సర్వే ఏపీలో పెళ్లి తర్వాత జంటలకు ‘హ్యాపీ మారీడ్ లైఫ్ ’ లేదని తేల్చింది. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 41శాతం కుటుంబాలు కొత్తగా పెళ్లైన తర్వాత దాంపత్య జీవితాన్ని సరిగ్గా అనుభవించలేకపోతున్నారని సర్వే తేల్చింది. ఇక అర్భన్ ప్రాంతాల్లో 29శాతం మందికి ఇదే పరిస్థితి అని కుండబద్దలు కొట్టింది.దీనికి ప్రధాన కారణం ఆర్థిక పరిస్తితులేనని తెలిసింది. అందుకే గుట్టుగానే కాపురాన్ని వెళ్లదీస్తున్నారట..

ఇక దేశంలోనే పెళ్లి తర్వాత ప్రైవసీని మెయింటేన్ చేస్తూ అత్యధికంగా ఎంజాయ్ చేసే వాళ్లు కేరళ వాసులే.. కేరళ గ్రామాల్లో 89శాతం అర్భన్ ప్రాంతాల్లో ఏకంగా 93శాతం మంది పెళ్లి తర్వాత దాంపత్య జీవితాన్ని మనసారా అస్వాదిస్తున్నారని సర్వే తేల్చింది.

ఇలా దేశంలో ఏపీలో పెళ్లి తర్వాత దాంపత్య జీవితం దుర్భరమని సర్వే తేల్చింది. కేరళలో హ్యాపీ మారీడ్ లైఫ్ అని తెలిపింది.




Please Read Disclaimer