గీత గోవిందం రివ్యూ

0విడుదల తేదీ : ఆగష్టు 15, 2018
నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక, నాగబాబు, వెన్నల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు.

దర్శకత్వం : పరుశురాం

నిర్మాతలు : బన్ని వాసు

సంగీతం : గోపి సుందర్

సినిమాటోగ్రఫర్ : మణి కందన్

స్క్రీన్ ప్లే : పరుశురాం

ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ:

విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటాడు. ఆ కాలేజీలోని నీలు అనే స్టూడెంట్ విజయ్ ని ప్రేమిస్తుంటుంది. కానీ విజయ్ ఆమెను దూరం పెడుతూ.. తన పెళ్లి గురించి రకరకాల కలలు కంటూ ఉండగా కలలో ఓ అమ్మాయి (గీత) కనబడుతుంది చివరకి ఆ అమ్మాయే గుడిలో ఎదురుపడగా విజయ్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఈ క్రమంలో గీత (రష్మిక)తో విజయ్ బస్ ప్రయాణం చేస్తుండగా అనుకోకుండా జరిగే ఓ మిస్ అండర్ స్టాండింగ్ సంఘటన కారణంగా గీత విజయ్ ను ఓ రోగ్ గా అర్ధం చేసుకుంటుంది. ఆ తరువాత జరిగే కొన్ని ఊహించని పరిణామాలతో ఇద్దరు కలిసి ట్రావెల్ చేయాల్సి రావటం. ఆ ప్రయాణంలో విజయ్ మీద గీతకి ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ కలగడం. వీటన్నిటి మధ్య విజయ్ గీతని ఎలా కన్విన్స్ చేసాడు ?తన ప్రేమలోని సిన్సియారిటీ ని ఎలా నిరూపించుకున్నాడు ? చివరకి గీత గోవిందం కలుస్తారా ? అసలు వారి ప్రేమకు వచ్చే సమస్య ఏంటి ? లాంటి విషయాలు తెలయాలంటే గీత గోవిందం చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో అసిస్టెంట్ ప్రొఫిసర్ గా నటించిన విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక కథానాయకిగా నటించిన రష్మిక, గీత పాత్రలో చాలా చక్కగా నటించింది తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో ప్రేమలో పడేయటానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన సన్నివేశాల్లో ఆమె నటన, ఆ సందర్భంలో కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి.

విజయ్ కు తండ్రి పాత్రలో నటించిన నాగబాబు తన గంభీరమైన నటనతో ఆకట్టుకోగా వెన్నెల కిషోర్, రాహుల్ రామ్ క్రిష్ణ, అభయ్ తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో ఉన్నంతలో బాగానే నవ్వించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేసారు.

మైనస్ పాయింట్స్:

మొదటి భాగం సరదాగా సాగిన, రెండువ భాగం మొదట్లో మాత్రం కథనం కొంత నెమ్మదిగా సాగుతుంది. దానికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించినట్లు అనిపిస్తోంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సింపుల్ కథను తీసుకున్నప్పటికీ మంచి కామెడీ సన్నివేశాలతో బాగా ఎంటర్ టైన్ చేశాడు.

మణి కందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన పాటలు బాగున్నాయి. హీరోయిన్ హీరో ల మధ్య వచ్చే సన్నివేశాల్లో నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.

మార్తాండ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది సినిమాలోని బన్ని వాసు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

తీర్పు:

దర్శకుడు పరుశు రామ్ సింపుల్ కథను తీసుకున్నా చక్కని ట్రీట్మెంట్ తో మంచి కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్ టైన్ చేశారు. విజయ్ దేవరకొండ తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. రష్మిక నటన కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాకి వెన్నెల కిషోర్ రాహుల్ రామకృష్ణ కామెడీ హైలెట్ గా నిలుస్తోంది. మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా గీత గోవిందం అలరిస్తుంది.

‘గీత గోవిందం’ : లైవ్ అప్డేట్స్ :

 

 • అన్ని సమస్యలు ఫైనల్ గా సాల్వ్ చేయబడ్డాయి. సినిమా ఫన్నీ నోట్ తో ఎండ్ అయ్యింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.

 • ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది. ఇప్పుడు నిత్య, విజయ్ ల మధ్య సంభాషణ కొనసాగుతోంది.

 • సినిమా ఇప్పుడు క్లైమాక్స్ దిశగా సాగుతోంది. గీత మరియు విజయ్ మధ్య పరశురాం స్టైల్ ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.

 • కథలో ఒక ట్విస్ట్.. గీతని ప్రేమించిన విజయ్ మ్యారేజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తాడు. ఇప్పుడు ట్రాజెడి సాంగ్ కనురెప్పల కాలంలోనే వస్తోంది.

 • అత్యవసర కుటుంబ పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యులు విజయ్-రష్మికల వివాహాన్ని ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.

 • ప్రధాన జంట మధ్య నెమ్మదిగా అన్ని అపార్థాలు పరిష్కారమవుతున్నాయి. చివరికి, రష్మీకా కూడా విజయ్ ప్రేమలో పడుతుంది. ఇప్పుడు సినిమాలోని మరోపాట ఏంటి ఏంటి వస్తోంది.

 • విజయ్ గోవింద్ (విజయ్) మరియు గీతా (రష్మికా)ల మధ్య మరికొన్ని అపార్థ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఇంటర్వెల్ అనంతరం ఒక బార్ సన్నీవేశంతో సెకండ్ హాఫ్ మొదలయ్యింది. ఇప్పుడు కాంట్రవర్షియల్ గా నిలిచిన వాట్ ద.. సాంగ్ వస్తోంది. విజయ్ ఈ సాంగ్ ని పాడాడు.

 • ఫస్ట్ హాఫ్ అప్డేట్: హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలతో ఇప్పటివరకు ఈ సినిమా ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ మెయిన్ హైలెట్ గా నిలిచింది.

 • ఈ చిత్రం పూర్తిగా ప్రధాన జంట చుట్టూ తిరుగుతుంది. వారి మధ్య కొన్ని అపార్ధ సన్నివేశాలు ఇంటర్వెల్ బ్లాక్ కి దారితీశాయి. ఇప్పుడు బ్రేక్

 • హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా వారి ఫ్యామిలీ వెడ్డింగ్ బాధ్యతలను చేపట్టారు. మరియు ఇప్పుడు అందరిని ఎంతగానో ఆకట్టుకున్న ఇంకేం ఇంకెం కావాలే సాంగ్ వస్తోంది.

 • ఇప్పుడు సినిమా కథ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. ప్రధాన జంట మధ్య కొన్ని క్యూట్ సీన్స్ వస్తున్నాయి.

 • కథలో ఒక చిన్న ట్విస్ట్. విజయ్ ప్రమాదంలో పడతాడు. అతను నిస్సహాయ పరిస్థితిలో ఉన్న సన్నివేశాలు ఫన్నీగా ప్రదర్శించబడుతున్నాయి.

 • మెగా బ్రదర్ నాగబాబు విజయ్ తండ్రిగా పరిచయం చేయబడ్డారు. కొన్ని కారణాల వల్ల, నాగ బాబు యొక్క వాయిస్ వేరొకరిచే అనువదించబడింది. ఇప్పుడు కొన్ని కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.

 • టీజర్ లో చూపించిన ఒక సీన్ తాలూకు సన్నివేశాలు వస్తున్నాయి. యాక్టర్ సుబ్బరాజు కూడా ఈ సీన్ ద్వారా హీరోయిన్ బ్రదర్ గా ఎంట్రీ ఇచ్చారు.

 • రాష్మికాను ఆకట్టుకోవటానికి విజయ్ ప్రయత్నిస్తున్నాడు. కొన్ని విలక్షణమైన సన్నివేశాలను వినోదాత్మకంగా వివరించారు.

 • విజయ్ దేవరకొండ ఒక అమ్మాయిల కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అను ఇమ్మన్యుయెల్ ఒక కామియో పాత్రలో ఎంట్రి ఇచ్చారు. ఇక ఇప్పుడు వచ్చిందమ్మ అనే సూపర్ హిట్ పాట వస్తోంది. పాట మధ్యలో హీరోయిన్ రష్మిక ఆలయంలో ఎంట్రీ ఇచ్చారు.

 • విజయ్ తన కథను నిత్యకు వివరిస్తున్నాడు. ఈ చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి తిరిగి వెళ్ళింది. అర్జున్ రెడ్డి ఫేమ్ రాహుల్ రామకృష్ణ మరియు మరికొంత మంది విజయ్ స్నేహితులగా పరిచయం చేయబడ్డారు. కొన్ని సరదా సన్నివేశాలు వస్తున్నాయి.

 • అన్నవరంలో మొదలైన సినిమా కథ.. స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ స్పెషల్ అతిధి పాత్రలో ఒక సింపుల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక సీన్ లోకి కథానాయకుడు విజయ్ కూడా సింపుల్ ఎంట్రీ ఇచ్చారు.

 • హాయ్..148 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది

విడుదల తేదీ : ఆగష్టు 15, 2018 నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక, నాగబాబు, వెన్నల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు. దర్శకత్వం : పరుశురాం నిర్మాతలు : బన్ని వాసు సంగీతం : గోపి సుందర్ సినిమాటోగ్రఫర్ : మణి కందన్ స్క్రీన్ ప్లే : పరుశురాం ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్ విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్-2 పతాకం ఫై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం! కథ: విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటాడు. ఆ కాలేజీలోని నీలు అనే స్టూడెంట్ విజయ్ ని ప్రేమిస్తుంటుంది. కానీ విజయ్ ఆమెను దూరం పెడుతూ.. తన పెళ్లి గురించి రకరకాల కలలు కంటూ ఉండగా కలలో ఓ అమ్మాయి (గీత) కనబడుతుంది చివరకి ఆ అమ్మాయే గుడిలో ఎదురుపడగా విజయ్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఈ క్రమంలో గీత (రష్మిక)తో విజయ్ బస్ ప్రయాణం చేస్తుండగా అనుకోకుండా జరిగే ఓ మిస్ అండర్ స్టాండింగ్ సంఘటన కారణంగా గీత విజయ్ ను ఓ రోగ్ గా అర్ధం చేసుకుంటుంది. ఆ తరువాత జరిగే కొన్ని ఊహించని పరిణామాలతో ఇద్దరు కలిసి ట్రావెల్ చేయాల్సి రావటం. ఆ ప్రయాణంలో విజయ్ మీద గీతకి ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ కలగడం. వీటన్నిటి మధ్య విజయ్ గీతని ఎలా కన్విన్స్ చేసాడు ?తన ప్రేమలోని సిన్సియారిటీ ని ఎలా నిరూపించుకున్నాడు ? చివరకి గీత గోవిందం కలుస్తారా ? అసలు వారి ప్రేమకు వచ్చే సమస్య ఏంటి ? లాంటి విషయాలు తెలయాలంటే గీత గోవిందం చిత్రం చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాలో అసిస్టెంట్ ప్రొఫిసర్ గా నటించిన విజయ్ దేవరకొండ చక్కని నటనను కనబరిచాడు. గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన నటనతో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇక కథానాయకిగా నటించిన రష్మిక, గీత పాత్రలో చాలా చక్కగా నటించింది తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో ప్రేమలో పడేయటానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన సన్నివేశాల్లో ఆమె నటన, ఆ సందర్భంలో కళ్లల్లో ఆమె పలికించిన హావభావాలు మెచ్చుకోదగినవి. విజయ్ కు తండ్రి పాత్రలో నటించిన నాగబాబు తన గంభీరమైన నటనతో ఆకట్టుకోగా వెన్నెల కిషోర్, రాహుల్ రామ్ క్రిష్ణ, అభయ్ తమ కామెడీ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో ఉన్నంతలో బాగానే నవ్వించారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేసారు. మైనస్ పాయింట్స్: మొదటి భాగం సరదాగా సాగిన, రెండువ భాగం మొదట్లో మాత్రం కథనం కొంత నెమ్మదిగా సాగుతుంది. దానికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించినట్లు అనిపిస్తోంది. సాంకేతిక విభాగం : దర్శకుడు సింపుల్ కథను తీసుకున్నప్పటికీ మంచి కామెడీ సన్నివేశాలతో బాగా ఎంటర్ టైన్ చేశాడు. మణి కందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన పాటలు బాగున్నాయి. హీరోయిన్ హీరో ల మధ్య వచ్చే సన్నివేశాల్లో నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. మార్తాండ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది సినిమాలోని బన్ని వాసు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. తీర్పు: దర్శకుడు పరుశు రామ్ సింపుల్ కథను తీసుకున్నా చక్కని ట్రీట్మెంట్ తో మంచి కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్ టైన్ చేశారు. విజయ్ దేవరకొండ తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. రష్మిక నటన కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాకి వెన్నెల కిషోర్ రాహుల్ రామకృష్ణ కామెడీ హైలెట్ గా నిలుస్తోంది. మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా గీత గోవిందం అలరిస్తుంది. 'గీత గోవిందం' : లైవ్ అప్డేట్స్ :   అన్ని సమస్యలు ఫైనల్ గా సాల్వ్ చేయబడ్డాయి. సినిమా ఫన్నీ నోట్ తో ఎండ్ అయ్యింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి. Date & Time : 05:48 AM August 15, 2018 ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది. ఇప్పుడు నిత్య, విజయ్ ల మధ్య సంభాషణ కొనసాగుతోంది. Date & Time : 05:40 AM August…

గీత గోవిందం రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 2.75
నటీ నటుల ప్రతిభ - 3.5
సాంకేతికవిభాగం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.25

3.2

గీత గోవిందం రివ్యూ

గీత గోవిందం రివ్యూ

User Rating: Be the first one !
3