Templates by BIGtheme NET
Home >> REVIEWS >> జాను రివ్యూ

జాను రివ్యూ


నటీనటులు :  శర్వానంద్, అక్కినేని సమంత, వెన్నెల కిషోర్, వర్ష బొల్లమ్మ, రఘుబాబు

దర్శకత్వం : సి. ప్రేమ్ కుమార్

నిర్మాత‌లు : దిల్ రాజు

సంగీతం :  గోవింద్ వసంత

సినిమాటోగ్రఫర్ : మహేందిరన్ జయరాజు

ఎడిటర్ : కేఎల్ ప్రవీణ్

తమిళ్‌లో మంచి హిట్ టాక్ సంపాదించుకున్న 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దిల్‌రాజుకు చాలా పొరపాట్లు ఎదురయ్యాయి. అయితే జాను పేరుతో నేడు తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం.

కథ:

రామ్ (శర్వానంద్) తన హైస్కూల్ ప్రియురాలు జాను (సమంత). అయితే జానును చిన్న తనంలోనే ప్రేమించినా ఎప్పుడూ కూడా రామ్ జానుకి ప్రపోజ్ చేయడు. అయితే దాదాపు 15 సంవత్సరాల తరువాత వీరి చిన్ననాటి స్నేహితులంతా కలిసి గెట్ టూ గెదర్ ఏర్పాటు చేస్తారు. ఆ గెట్ టూ గెదర్‌లో రామ్ మరియు జాను ఇద్దరు మళ్ళీ కలుస్తారు. 15 సంవత్సరాల తరువాత కలిసిన వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది ? వీరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఎటువంటిది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను తెరపైన చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

‘జాను’ వంటి క్లాసిక్ సినిమాను తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రేమ్ కుమార్‌కే దక్కుతుంది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య అద్భుతమైన ఎమోషన్ తో అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సాగింది ఈ సినిమా.

ఇక తాను మంచి నటుడని అని శర్వానంద్ మరోసారి నిరూపించుకున్నాడు. అతను తన కెరీర్‌లో రామ్ పాత్ర ద్వార ఉత్తమ నటనను కనబరిచాడు. అమాయకత్వం లేదా భావోద్వేగాల పరిపక్వతలను శర్వానంద్ తన నటనతో శర్వానంద్ దానిని మరో స్థాయికి తీసుకువెళ్లడు. అతను ఈ సినిమాకి మెయిన్ పిల్లర్‌గా నిలిచాడు.

సమంతకి ఇది చాలా కష్టతరమైన పాత్ర అయినప్పటికి ఆమె మరోసారి తానేంటో నిరూపించుకుంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కన్నీరు పెట్టిస్తుంది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే సినిమా మరింత అద్భుతంగా ఉంది.

ఈ సినిమాలో సమంత, శర్వానంద్‌ల జోడీ ఆకట్టుకుంటుంది. వీరిద్దరు కాకుండా వేరేవారిని ఊహించుకోలేమన్నట్టుగా వీరు ఆకట్టుకున్నారు, ఈ చిత్రానికి బీజీఎం కూడా అద్భుతంగా ఉంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా రీమేక్ కావడంతో ప్రేక్షకులు మిక్సెడ్ రియాక్షన్‌ ని కోరుకుంటారనుకున్నా అసలు సినిమాతో ఈ సినిమాను పోల్చి చూసుకుంటే మాత్రం కాస్త నిరాశపరచవచ్చు. ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అని మాత్రం చెప్పలేము.

ఈ సినిమా నెమ్మదిగా సాగుతుంది, సినిమాను చూడడానికి ప్రేక్షకుడికి తప్పనిసరిగా సహనం అవసరమవుతుంది. ఈ సినిమా కథనం సాదాసీదాగా ఉండడంతో ప్రేమకథలో నాటకీయత కానీ, ఎలాంటి మలుపులు కానీ కనిపించలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు ప్రేమ్ కుమార్ ప్యూర్ లవ్ స్టోరీకి సంబంధించి మంచి పాయింట్ తీసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని సీక్వెన్స్ స్లోగా నడిపారు. మహేందిరన్ జయరాజు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో స్కూల్ దృశ్యాలతో పాటు కథకు అనుగుణంగా ఆయన విజువల్స్ ను చాలా అందంగా చూపించారు.

ఇక సంగీత దర్శకుడు గోవింద్ వసంతన్ అందించిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సమంత , శర్వాల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాలోని నిర్మాత దిల్ రాజు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

తీర్పు:

మొత్తంగా చెప్పాలంటే జాను మూవీ ఒరిజినల్ 96 మూవీలోని అన్ని ఎమోషన్స్ కలగలిపి తెరకెక్కిన పర్ఫెక్ట్ రీమేక్ అని చెప్పాలి. ఒరిజినల్ చూడని ప్రేక్షకులు జాను చిత్రాన్ని చాలా బాగా ఆస్వాదిస్తారు. ఐతే 96 మూవీ చూసిన వారికి కొంచెం స్లో గా సాగింది అనే భావన కలిగే అవకాశం కలదు. సమంత, శర్వా ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్క్ ఇచ్చారు అనడంలో సందేహం లేదు. జాను మరియు రామ్ పాత్రలో వారు లీనమై నటించారు. జాను ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది. మల్టీప్లెక్ ప్రేక్షకులను ఈచిత్రం మరింత ఆకట్టుకుంటుంది.

  • కొన్ని కఠినమైన భావోద్వేగపూరిత సన్నివేశాల అనంతరం సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం TeluguNow.com చూస్తూ ఉండండి.

  • ఇపుడు సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది,నా కలే కలై పాట మొదలయ్యింది.

  • ఇప్పుడు ప్రధాన పాత్రధారుల మధ్య కొన్ని లోతైన ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.

  • రామ్ మరియు జానుల మధ్య కొన్ని అందమైన సన్నివేశాలను ప్రతిబింబిస్తూ ప్రాణం పాట మొదలయ్యింది.

  • ఇప్పుడు చిత్రం ప్రస్తుత రోజుల్లోకి వచ్చేసింది.రామ్ మరియు జానుల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇప్పుడు సినిమా మరోసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్ళింది.కొన్ని కాలేజీ సన్నివేశాలు వస్తున్నాయి.

  • రామ్ మరియు జాన్ లు ఇద్దరూ తమ జ్ఞ్యాపకాలను పంచుకుంటున్నారు.ఈ సన్నివేశాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పై అద్భుతంగా ఉంది.

  • రామ్ మరియు జానులు వారి గత జ్ఞ్యాపకాలను నెమరు వేసుకుంటున్నారు.కొన్ని లవ్ సీన్స్ వస్తున్నాయి.

  • బ్యాక్గ్రౌండ్ లో ఇంతేనా సాంగ్ తో రామ్ మరియు జానుల మధ్య పలు సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఇంటర్వెల్ అనంతరం రామ్ మరియు జానుల మధ్య కొన్ని చక్కని సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే నెమ్మదిగా సాగే కథనంతో సినిమా బాగానే ఉందని చెప్పాలి.ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోని చిన్ననాటి స్కూల్ సన్నివేశాలు మరియు రీయూనియన్ సన్నివేశాలు బాగా చిత్రీకరించారు.మరి సెకండాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.

  • రీయూనియన్ పూర్తయ్యింది,రామ్ ఇంకా సింగిల్ గానే ఉన్నాడని జానుకు తెలిసింది.ఇప్పుడు విరామం.

  • సమంత మరియు శర్వాల మధ్య కొన్ని డ్రమాటిక్ సన్నివేశాలు వస్తున్నాయి.

  • ఆ రీయూనిన్ మీటింగులో రామ్ మరియు జానుల మధ్య మొట్టమొదటిగా మరోసారి కలిసే సన్నివేశం వస్తుంది.

  • ఒక విషాధ పరిస్థితి నెలకొన్న సన్నివేశంతో ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది.

  • ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మళ్ళీ మొదలయ్యింది.మరోసారి స్కూల్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది. ఇప్పుడు అదే రీయూనియన్ మీటింగ్ కు హాజరయ్యేందుకు సమంతా ఎంట్రీ ఇస్తుంది.

  • ఇప్పుడు స్కూల్ కు సంబంధించిన కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.

  • బాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ తో పలు సన్నివేశాలు వస్తున్నాయి.

  • స్కూల్ సన్నివేశాలు వస్తున్నాయి.రామ్ మరియు జాను ల మధ్య కొన్ని చూడచక్కని లవ్ సీన్స్ వస్తున్నాయి.

  • ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది.సమంత మరియు శర్వాల చిన్నప్పటి స్కూల్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • ఇప్పుడు వారి గెట్ టు గేదర్ మీటింగ్ మొదలయ్యింది.వారి చిన్ననాటి స్నేహితుల అందరి మధ్య సన్నివేశాలు చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.

  • ఇప్పుడు శర్వా,కిషోర్ మరియు రమేష్ లు ఒక రీయూనియన్ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఆ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.

  • శర్వా చిన్నప్పటి స్నేహితులుగా వెన్నెల కిషోర్ మరియు తాగుబోతు రమేష్ లు ఎంట్రీ ఇచ్చారు.

  • రామ్ తన స్కూల్ దగ్గరకు వెళ్ళాడు.ఆ పరిసరాల్లో తిరుగుతూ తన చిన్ననాటి జ్ఞ్యాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నాడు.రఘుబాబు స్కూల్ సెక్యూరిటీ పాత్రలో కనిపిస్తున్నారు.

  • శర్వానంద్(రామ్) కొంతమంది స్టూడెంట్స్ కు ఫోటోగ్రఫీ కోసం వివరిస్తున్నాడు.ఇప్పుడు విజిల్ మరియు చూసి చూడంగానే ఫేమ్ వర్ష బొల్లమ్మ శర్వా స్టూడెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

  • ఈ పాట చాలా అందంగా తెరకెక్కించారు.ఆఫ్రికాలోని ప్రకృతి సన్నివేశాలు అద్భుతంగా చూపిస్తున్నారు.

  • సినిమా లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ తో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.ఒక ట్రావెల్ ఫోటో గ్రాఫర్ గా శర్వానంద్ పరిచయం అయ్యాడు.

  • హాయ్..150 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

నటీనటులు :  శర్వానంద్, అక్కినేని సమంత, వెన్నెల కిషోర్, వర్ష బొల్లమ్మ, రఘుబాబు దర్శకత్వం : సి. ప్రేమ్ కుమార్ నిర్మాత‌లు : దిల్ రాజు సంగీతం :  గోవింద్ వసంత సినిమాటోగ్రఫర్ : మహేందిరన్ జయరాజు ఎడిటర్ : కేఎల్ ప్రవీణ్ తమిళ్‌లో మంచి హిట్ టాక్ సంపాదించుకున్న 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దిల్‌రాజుకు చాలా పొరపాట్లు ఎదురయ్యాయి. అయితే జాను పేరుతో నేడు తెలుగులో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ: రామ్ (శర్వానంద్) తన హైస్కూల్ ప్రియురాలు జాను (సమంత). అయితే జానును చిన్న తనంలోనే ప్రేమించినా ఎప్పుడూ కూడా రామ్ జానుకి ప్రపోజ్ చేయడు. అయితే దాదాపు 15 సంవత్సరాల తరువాత వీరి చిన్ననాటి స్నేహితులంతా కలిసి గెట్ టూ గెదర్ ఏర్పాటు చేస్తారు. ఆ గెట్ టూ గెదర్‌లో రామ్ మరియు జాను ఇద్దరు మళ్ళీ కలుస్తారు. 15 సంవత్సరాల తరువాత కలిసిన వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది ? వీరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఎటువంటిది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాను తెరపైన చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్: ‘జాను’ వంటి క్లాసిక్ సినిమాను తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రేమ్ కుమార్‌కే దక్కుతుంది. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య అద్భుతమైన ఎమోషన్ తో అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సాగింది ఈ సినిమా. ఇక తాను మంచి నటుడని అని శర్వానంద్ మరోసారి నిరూపించుకున్నాడు. అతను తన కెరీర్‌లో రామ్ పాత్ర ద్వార ఉత్తమ నటనను కనబరిచాడు. అమాయకత్వం లేదా భావోద్వేగాల పరిపక్వతలను శర్వానంద్ తన నటనతో శర్వానంద్ దానిని మరో స్థాయికి తీసుకువెళ్లడు. అతను ఈ సినిమాకి మెయిన్ పిల్లర్‌గా నిలిచాడు. సమంతకి ఇది చాలా కష్టతరమైన పాత్ర అయినప్పటికి ఆమె మరోసారి తానేంటో నిరూపించుకుంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కన్నీరు పెట్టిస్తుంది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే సినిమా మరింత అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో సమంత, శర్వానంద్‌ల జోడీ ఆకట్టుకుంటుంది. వీరిద్దరు కాకుండా వేరేవారిని ఊహించుకోలేమన్నట్టుగా వీరు ఆకట్టుకున్నారు, ఈ చిత్రానికి బీజీఎం కూడా అద్భుతంగా ఉంది. మైనస్ పాయింట్స్: ఈ సినిమా రీమేక్ కావడంతో ప్రేక్షకులు మిక్సెడ్ రియాక్షన్‌ ని కోరుకుంటారనుకున్నా అసలు సినిమాతో ఈ సినిమాను పోల్చి చూసుకుంటే మాత్రం కాస్త నిరాశపరచవచ్చు. ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ అని మాత్రం చెప్పలేము. ఈ సినిమా నెమ్మదిగా సాగుతుంది, సినిమాను చూడడానికి ప్రేక్షకుడికి తప్పనిసరిగా సహనం అవసరమవుతుంది. ఈ సినిమా కథనం సాదాసీదాగా ఉండడంతో ప్రేమకథలో నాటకీయత కానీ, ఎలాంటి మలుపులు కానీ కనిపించలేదు. సాంకేతిక విభాగం : దర్శకుడు ప్రేమ్ కుమార్ ప్యూర్ లవ్ స్టోరీకి సంబంధించి మంచి పాయింట్ తీసుకున్నారు. అయితే సినిమాలో కొన్ని సీక్వెన్స్ స్లోగా నడిపారు. మహేందిరన్ జయరాజు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో స్కూల్ దృశ్యాలతో పాటు కథకు అనుగుణంగా ఆయన విజువల్స్ ను చాలా అందంగా చూపించారు. ఇక సంగీత దర్శకుడు గోవింద్ వసంతన్ అందించిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సమంత , శర్వాల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం చాలా బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాలోని నిర్మాత దిల్ రాజు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. తీర్పు: మొత్తంగా చెప్పాలంటే జాను మూవీ ఒరిజినల్ 96 మూవీలోని అన్ని ఎమోషన్స్ కలగలిపి తెరకెక్కిన పర్ఫెక్ట్ రీమేక్ అని చెప్పాలి. ఒరిజినల్ చూడని ప్రేక్షకులు జాను చిత్రాన్ని చాలా బాగా ఆస్వాదిస్తారు. ఐతే 96 మూవీ చూసిన వారికి కొంచెం స్లో గా సాగింది అనే భావన కలిగే అవకాశం కలదు. సమంత, శర్వా ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెరఫార్మెన్క్ ఇచ్చారు అనడంలో సందేహం లేదు. జాను మరియు రామ్ పాత్రలో వారు లీనమై నటించారు. జాను ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది. మల్టీప్లెక్ ప్రేక్షకులను ఈచిత్రం మరింత ఆకట్టుకుంటుంది. కొన్ని కఠినమైన భావోద్వేగపూరిత సన్నివేశాల అనంతరం సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం TeluguNow.com చూస్తూ ఉండండి. Date & Time : 07:20 AM February 07, 2020 ఇపుడు సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది,నా కలే కలై పాట మొదలయ్యింది. Date & Time : 07:10 AM February 07, 2020 ఇప్పుడు ప్రధాన పాత్రధారుల మధ్య కొన్ని లోతైన ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. Date & Time : 06:55 AM February 07, 2020 రామ్ మరియు జానుల మధ్య కొన్ని అందమైన సన్నివేశాలను ప్రతిబింబిస్తూ ప్రాణం పాట మొదలయ్యింది. Date & Time : 06:45 AM February 07, 2020 ఇప్పుడు చిత్రం ప్రస్తుత రోజుల్లోకి వచ్చేసింది.రామ్ మరియు జానుల మధ్య…

జాను రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.25
సాంకేతిక వర్గం పనితీరు - 3
దర్శకత్వ ప్రతిభ - 3

3

జాను రివ్యూ

జాను రివ్యూ

User Rating: Be the first one !
3