Templates by BIGtheme NET
Home >> REVIEWS >> ‘జెర్సీ’ రివ్యూ

‘జెర్సీ’ రివ్యూ


నటీనటులు: నాని – శ్రద్ధ శ్రీనాథ్ – సత్యరాజ్ – మాస్టర్ రోనిత్ – సంపత్ రాజ్ – విశ్వంత్ – ప్రవీణ్ – జయప్రకాష్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: సాను వర్గీస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన – దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి

నేచురల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా ‘జెర్సీ’పై ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ చిత్రం మొదట్నుంచి ఆసక్తిర ప్రోమోలతో ఆకట్టుకుంటూ వస్తోంది. మరి సినిమాగా ‘జెర్సీ’ ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి.

కథ:

అర్జున్ (నాని) అసాధారణ నైపుణ్యం ఉన్న క్రికెటర్. భారత జట్టుకు ఆడాలన్నది అతడి కల. ఐతే కొన్ని కారణాల వల్ల అతడి కల భగ్నమవుతుంది. దీంతో అతను క్రికెట్ విడిచిపెట్టేస్తాడు. కానీ ఆటకు దూరమయ్యాక తాను తానుగా బతకలేక సతమతమవుతుంటాడు. చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకుని ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతూ అందరి దృష్టిలో ఒక లూజర్గా మిగిలిపోతాడు. అలాంటి వాడు ఆటకు టాటా చెప్పిన 10 ఏళ్ల తర్వాత.. 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్లోకి పునరాగమనం చేయాలనుకుంటాడు. అందుకు పురిగొల్పిన పరిస్థితులేంటి.. మళ్లీ బ్యాట్ పట్టిన అతడికి ఎలాంటి అనుభవం ఎదురైంది.. భారత జట్టుకు ఆడాలన్న అతడి కల ఫలించిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

సినిమాలకు మహరాజ పోషకులు యువతే. ఆ యువతకు సినిమాల్లాగే అత్యంత నచ్చే మరో అంశం క్రీడలు. కాబట్టి క్రీడల నేపథ్యంలో సరైన సినిమా తీయగలిగితే వాటి రీచ్ మామూలుగా ఉండదు. బాలీవుడ్లో వచ్చిన ‘లగాన్’ ‘చక్ దే ఇండియా’ లాంటి సినిమాలు చూస్తున్నపుడు ఎలా రోమాలు నిక్కబొడుచుకున్నాయో వాటి అభిమానులకు గుర్తుండే ఉంటుంది. కానీ తెలుగులో ఇలా ఉద్వేగం రేకెత్తించిన స్పోర్ట్స్ డ్రామాలు అరుదు. అసలు క్రీడా నేపథ్యంలో మన దగ్గర సినిమాలే తక్కుంటంటే.. రియలిస్టిగ్గా.. అథెంటిగ్గా తెరకెక్కిన సినిమాలు మరీ తక్కువ. ‘గోల్కొండ హైస్కూల్’ లాంటి ఒకటీ అరా సినిమాలు మాత్రమే కనిపిస్తాయి. ఐతే స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు ప్రధాన పాత్రలో నటించి.. సగటు క్రీడాభిమాని బాగా కనెక్టయ్యేలా రియలిస్టిగ్గా కథాకథనాలు పాత్రలు ఉండి.. వారిలో భావోద్వేగాల్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన తొలి తెలుగు సినిమాగా ‘జెర్సీ’ని చెప్పొచ్చు. తెలుగులో ఇప్పటికే కాదు.. ప్పటికీ కూడా నిలిచిపోయే ఒకానొక బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ అనడంలో సందేహం లేదు.

స్పోర్ట్స్ డ్రామాలకు చాలా కీలకమైన విషయం అథెంటిసిటీ అనే విషయం చాలామంది ఫిలిం మేకర్స్ మరిచిపోతుంటారు. స్వయంగా ఎంబీబీఎస్ చదివిన సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోను డాక్టర్ గా ఎంత అథెంటిగ్గా చూపించాడో చూశాం. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి క్రికెటరా.. అలా అయితే ఆ ఆటలో ఎంత వరకు వెళ్లాడు అన్నది తెలియదు కానీ.. తెలుగులో మాత్రమే కాదు.. మొత్తంగా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే క్రికెట్ నేపథ్యంలో ఇంత అథెంటిగ్గా సినిమా తీసిన దర్శకులు అరుదే. అతను మన దేశంలో క్రికెట్ సెటప్.. కోచింగ్.. మ్యాచ్ లు జరిగే తీరు.. ఇలా అన్నింటి మీద సమగ్రమైన అధ్యయనం జరిపాకే ఈ సినిమా తీసిన సంగతి తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మనదగ్గర హీరోను క్రీడాకారుడిగా చూపించిన చాలా సినిమాల్లో ఆట అనేది పాత్ర పరిచయానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తర్వాత లోతుల్లోకి వెళ్లరు. హీరో ఆట ఆడటం కాకుండా ఏదేదో చేస్తుంటాడు. ఐతే జెర్సీ పూర్తిగా ‘ఆట’ చుట్టూనే తిరుగుతుంది. ఇందులో ప్రేమకథ కావచ్చు.. తండ్రీ కొడుకుల బంధం కావచ్చు.. మరో విషయం కావచ్చు.. ఏదైనా కూడా ‘ఆట’తో ముడిపడ్డదే.

ఒక క్రికెటర్ ప్రయాణాన్ని అతడి వ్యక్తిగత జీవితంతో ముడిపెడుతూ గొప్ప భావోద్వేగంతో చూపించిన సినిమా ‘జెర్సీ’. ఈ చిత్రానికి ప్రధాన బలం హీరో పాత్రే. తనకు ప్రాణానికి ప్రాణమైన ఆటకు దూరమై తనను తాను కోల్పోతూ మానసిక సంఘర్షణకు లోనయ్యే క్రీడాకారుడిగా హీరో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు గౌతమ్. ఆ పాత్రకు నాని లాంటి గొప్ప నటుడిని ఎంచుకోవడంతో ఇక తిరుగే లేకపోయింది. సాధారణ పాత్రల్ని కూడా తన నటనతో ప్రత్యేకంగా మార్చగలిగే నాని.. అర్జున్ లాంటి అద్భుతమైన పాత్ర దొరకడంతో చెలరేగిపోయాడు. హీరో పాత్రే ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా సినిమాను లాక్కెళ్లి పోతుంది. ఇక ఈ కథలో తండ్రీ కొడుకుల బంధాన్ని ఎలివేట్ చేసి తీరు.. అందులోని భావోద్వేగాలు మరో పెద్ద ప్లస్ అయింది. హీరో.. అతడి కొడుకు మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా స్వీట్ గా అనిపిస్తుంది. హృదయాన్ని తాకుతుంది. చాలా తక్కువ సన్నివేశాలతోనే వీరి బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ‘జెర్సీ’ అనే టైటిల్ పెట్టడానికి గల కారణం చూపిస్తూ నడిపిన ఎమోషనల్ థ్రెడ్ సినిమాలో మేజర్ హైలైట్. దీని తాలూకు చమక్ ఏంటన్నది తెర మీదే చూడాలి.

‘జెర్సీ’ ప్రథమార్ధంలో ఆటకు సంబంధించి సన్నివేశాలు తక్కువే. హీరో వ్యక్తిగత జీవితం మీదే చాలా వరకు కథ నడుస్తుంది. ఆటకు దూరమయ్యాక హీరో జీవితంలో ఎదురయ్యే పరిణామాలు.. అతను ఎదుర్కొనే సమస్యల నేపథ్యంలోనే ప్రథమార్ధం సాగిపోతుంది. చాలా వరకు సీరియస్ గానే కథ నడిచినప్పటికీ.. బోర్ కొట్టని విధంగా సన్నివేశాల్ని రాసుకున్నాడు గౌతమ్. ఎక్కువ హడావుడి లేకుండా కథలోకి సింపుల్ గా తీసుకెళ్లిపోతాడు గౌతమ్. పాత్రల పరిచయం.. వాటి ఎస్టాబ్లిష్మెంట్ సాఫీగా సాగిపోతుంది. సన్నివేశాలు మరీ కొత్తగా ఏమీ లేకపోయినా.. వాటిని అందంగా ప్రెజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ముంగిట వచ్చే మ్యాచ్ దృశ్యాలు యువ ప్రేక్షకుల్లో ఉత్తేజం తీసుకొస్తాయి. ఇక ద్వితీయార్ధం అంతా కూడా ప్రధానంగా సన్నివేశాలన్నీ గ్రౌండ్ చుట్టూనే తిరుగుతాయి. అవి క్రికెట్ లవర్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా వినోదం పంచుతాయి.

ఐతే హీరో క్రికెట్లో వీర విహారం చేస్తూ దూసుకెళ్లిపోతుంటే.. అతను చివరగా తన కల నెరవేర్చుకుని విక్టరీ సింబల్ చూపించే ముగింపును ఊహిస్తాం. అలా ముగిస్తే ‘జెర్సీ’ సగటు సినిమానే అయ్యేది. కానీ ప్రేక్షకుల అంచనాకు భిన్నమైన ముగింపుతో గౌతమ్ తన స్థాయిని చాటాడు. ‘జెర్సీ’ మంచి సినిమా స్థాయి నుంచి ‘గొప్ప’ సినిమా స్థాయికి చేరింది ఇక్కడే. స్పోర్ట్స్ డ్రామాస్ అనే కాదు.. మామూలుగా చూసినా కూడా తెలుగులో ఈ మధ్య కాలంలో ఇంత మంచి ముగింపును చూసి ఉండం. నిజానికి ప్రి క్లైమాక్స్ దగ్గర ‘జెర్సీ’ గ్రాఫ్ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. పదేళ్లు ఆటకు దూరంగా ఉండి.. 36 ఏళ్ల వయసులో పునరాగమనం చేసిన హీరోకు ఆటలో పెద్ద అడ్డంకులేమీ ఉండవు. మరీ అతడికి ఎదురే లేదన్నట్లు చూపించడం నాటకీయంగా అనిపిస్తుంది. చాలా వరకు రియలిస్టిగ్గా సినిమాను నడిపించే ప్రయత్నం చేసిన గౌతమ్.. ఈ విషయంలో మాత్రం నిరాశ పరిచాడు. పైగా రంజీ మ్యాచ్ లు డే/నైట్లో జరుగుతున్నట్లు చూపించడం కూడా అథెంటిసిటీని దెబ్బ తీసింది. మామూలుగా చూస్తే ఇదేమంత పెద్ద విషయం కాదు కానీ.. ముందు నుంచి చాలా రియలిస్టిగ్గా.. అథెంటిగ్గా కనిపించడం వల్ల ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఐతే దీంతో పాటుగా సినిమాలో దొర్లిన లోపాలన్నింటినీ కవర్ చేసే క్లైమాక్స్ ‘జెర్సీ’ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. పైన చెప్పుకున్న విషయాలు.. స్లో నరేషన్.. మాత్రమే ‘జెర్సీ’లో చెప్పుకోదగ్గ మైనస్ లు. టార్గెటెడ్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకునే అవకాశాలున్న ఈ చిత్రం ఒక క్లాసిక్ లాగా నిలిచిపోవడానికి అవకాశాలున్నాయి.

నటీనటులు:

నాని గురించి చెప్పేదేముంది? ఇదే బెస్ట్ అని మనం ఒక సినిమా దగ్గర ఆగిపోతాం. కానీ ఆ తర్వాతి సినిమాలో ఇంకా అద్భుతంగా నటించి ఇదే బెస్ట్ అనిపిస్తాడు. ఈసారి కూడా అదే జరిగింది. ఇప్పటికైతే ‘జెర్సీ’నే అతడి కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్. లోపల ఒక అగ్నిపర్వతం బద్దలైపోతున్నా.. భావోద్వేగాలు బయటపడనివ్వకుండా సాగిపోయే పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. ఫలానా సన్నివేశం అని కాకుండా ప్రతి చోటా నాని అదరగొట్టాడు. మళ్లీ రంజీ జట్టులో చోటు దక్కాక ఉద్వేగానికి గురయ్యే సన్నివేశాల్లో అయితే అతడి నటన స్టాండ్ ఔట్ గా నిలుస్తుంది. హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ ఫ్లా లెస్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. సారా పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. లుక్స్ పరంగా శ్రద్ధ మామూలుగా అనిపిస్తుంది కానీ.. నటన విషయంలో మాత్రం ఆమెకు తిరుగులేదు. సత్యరాజ్ మరోసారి తన అనుభవాన్ని చూపించారు. సటిల్ పెర్ఫామెన్స్ తో కోచ్ పాత్రకు ఓ ప్రత్యేకత తీసుకొచ్చారు. నాని కొడుకుగా నటించిన పిల్లాడు రోనిత్ చాలా కాలం గుర్తుంటాడు. మిగతా ఆర్టిస్టులందరరూ కూడా బాగానే చేశారు.

సాంకేతికవర్గం:

కథలోని భావోద్వేగాల్ని అర్థం చేసుకుని సంగీతం సమకూర్చే  మ్యూజిక్ డైరెక్టర్.. సినిమాటోగ్రాఫర్ దొరికితే ఔట్ పుట్ ఎలా ఉంటుందో ‘జెర్సీ’లో చూడొచ్చు. అనిరుధ్ రవిచందర్ సంగీతం.. సాను వర్గీస్ ఛాయాగ్రహణం గురించి ఎంత చెప్పినా తక్కువే. అవి రెండూ కూడా వేరుగా అనిపించకుండా సినిమాలో మిక్స్ అయిపోవడం ‘జెర్సీ’ ప్రత్యేకత. అనిరుధ్ పాటలు అన్నీ బాగున్నాయి. పాటలు పాటల్లా కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ లాగా సినిమాలో కలిసిపోయాయి. ఇక నేపథ్య సంగీతం అయితే సినిమాకు పెద్ద డ్రైవింగ్ ఫోర్స్ లాగా పని చేసింది. సాను ఛాయాగ్రహణం ఒక వింటేజ్ క్లాసిక్ మూవీ చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ద్వితీయార్ధంలో కొన్ని మ్యాచ్ దృశ్యాల దగ్గర మాత్రం కొంత రాజీ పడ్డారు. మిగతా ఎక్కడా వేలెత్తి చూపడానికి లేదు. రచయిత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తాను చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటానని ‘జెర్సీ’తో చాటి చెప్పాడు. రైటింగ్.. డైరెక్షన్ రెండింట్లోనూ అతను గొప్ప స్థాయిని చూపించాడు. ‘జెర్సీ’ని ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాలా అతను తీర్చిదిద్దాడు.

చివరగా: జెర్సీ.. తొడుక్కుని తీరాల్సిందే

‘జెర్సీ’ : లైవ్ అప్డేట్స్:

  • సినిమా సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం చూస్తూ ఉండండి.

  • ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ అంతా పూర్తయ్యి 2019కు చేరుకుంది.కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • భార్య భర్తల నడుమ ఓ ఎమోషనల్ సీన్ నడుస్తుంది.ఇప్పుడు ముంబైతో ఫైనల్స్ మ్యాచ్ మొదలయ్యింది.

  • నాని మరియు శ్రద్దాల మధ్య భార్య భర్తల జీవితానికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.

  • మ్యాచులు కొనసాగుతున్నాయి.వీటిని ప్రతిబింబిస్తూ అనిరుద్ అందించిన స్పిరిట్ ఆఫ్ జెర్సీ పాట వస్తుంది.

  • రంజీ టీమ్ కు నాని ఎంపిక అయ్యారు.హైదరాబాద్ మరియు తమిళనాడు మధ్య మొదటి మ్యాచ్ మొదలయ్యింది.

  • ఇంటర్వెల్ అనంతరం కొత్త కోచ్ గా మరియు జట్టు ఎంపిక విభాగపు సభ్యునిగా సంపత్ ఎంట్రీ ఇచ్చారు.ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : సినిమా సగం పూర్తయ్యే సరికి అంతా బాగానే సాగింది.కానీ నిడివి కాస్త ఎక్కువ కావడం వలన అక్కడక్కడా కాస్త నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది.నాని మాత్రం అద్భుత నటనను కనబర్చారు.సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

  • నాని అద్భుత ఎమోషనల్ నటనతో సినిమా సగానికి చేరుకుంది.ఇప్పుడు విరామం.

  • మ్యాచ్ పూర్తయ్యింది.ఇప్పుడు కొన్ని భావోద్వేగపూరిత కుటుంబ సన్నివేశాలు వస్తున్నాయి.

  • మళ్లీ పదేళ్ల తర్వాత నాని ఒక చారిటీ మ్యాచ్ కోసం తన ప్రాక్టీస్ మొదలు పెట్టారు.ఇప్పుడు ప్రపంచమే అలా పాట వస్తుంది.

  • ఇప్పుడు నాని మరియు అతని స్నేహితుల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.

  • కొన్ని చక్కని సన్నివేశాల నడుమ నాని మరియు శ్రద్ధాలకు పెళ్లి అనంతరం ఇద్దరి మధ్య అదేంటో గాని ఉన్నపాటుగా పాట వస్తుంది.

  • ఇప్పుడు సినిమా మళ్ళీ 1986కి మారింది.ఇప్పుడు హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ పదే పదే వస్తుంది.

  • నాని మరియు అతని స్నేహితుల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • అర్జున్(నాని) మరియు తన కొడుకు మధ్య కొన్ని చూడచక్కని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.క్రికెట్ కోచ్ గా సత్యరాజ్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.

  • 1986 వ సంవత్సరంలో ఫ్లాష్ బ్యాక్ కు సినిమా చేరుకుంది.ఒక క్రికెట్ స్టేడియం లో నాని మరియు శ్రద్ధా పాత్రలు పరిచయం అయ్యాయి.ఇప్పుడు కథ 1996 కి మారింది.

  • ఇప్పుడు సినిమా న్యూయార్క్ నగరానికి చేరుకుంది.నాని జీవితంపై జెర్సీ అనే పుస్తకం రాయడానికి సంబందించిన సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.

  • రోడ్డు ప్రయాణంలో జాగ్రత్త తీసుకోమని చెప్పే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.

  • హాయ్..160 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.

నటీనటులు: నాని - శ్రద్ధ శ్రీనాథ్ - సత్యరాజ్ - మాస్టర్ రోనిత్ - సంపత్ రాజ్ - విశ్వంత్ - ప్రవీణ్ - జయప్రకాష్ తదితరులు సంగీతం: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సాను వర్గీస్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ రచన - దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి నేచురల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా ‘జెర్సీ’పై ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ చిత్రం మొదట్నుంచి ఆసక్తిర ప్రోమోలతో ఆకట్టుకుంటూ వస్తోంది. మరి సినిమాగా ‘జెర్సీ’ ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండి. కథ: అర్జున్ (నాని) అసాధారణ నైపుణ్యం ఉన్న క్రికెటర్. భారత జట్టుకు ఆడాలన్నది అతడి కల. ఐతే కొన్ని కారణాల వల్ల అతడి కల భగ్నమవుతుంది. దీంతో అతను క్రికెట్ విడిచిపెట్టేస్తాడు. కానీ ఆటకు దూరమయ్యాక తాను తానుగా బతకలేక సతమతమవుతుంటాడు. చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకుని ఏ పనీ చేయకుండా ఖాళీగా తిరుగుతూ అందరి దృష్టిలో ఒక లూజర్గా మిగిలిపోతాడు. అలాంటి వాడు ఆటకు టాటా చెప్పిన 10 ఏళ్ల తర్వాత.. 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్లోకి పునరాగమనం చేయాలనుకుంటాడు. అందుకు పురిగొల్పిన పరిస్థితులేంటి.. మళ్లీ బ్యాట్ పట్టిన అతడికి ఎలాంటి అనుభవం ఎదురైంది.. భారత జట్టుకు ఆడాలన్న అతడి కల ఫలించిందా లేదా అన్నది మిగతా కథ. కథనం - విశ్లేషణ: సినిమాలకు మహరాజ పోషకులు యువతే. ఆ యువతకు సినిమాల్లాగే అత్యంత నచ్చే మరో అంశం క్రీడలు. కాబట్టి క్రీడల నేపథ్యంలో సరైన సినిమా తీయగలిగితే వాటి రీచ్ మామూలుగా ఉండదు. బాలీవుడ్లో వచ్చిన ‘లగాన్’ ‘చక్ దే ఇండియా’ లాంటి సినిమాలు చూస్తున్నపుడు ఎలా రోమాలు నిక్కబొడుచుకున్నాయో వాటి అభిమానులకు గుర్తుండే ఉంటుంది. కానీ తెలుగులో ఇలా ఉద్వేగం రేకెత్తించిన స్పోర్ట్స్ డ్రామాలు అరుదు. అసలు క్రీడా నేపథ్యంలో మన దగ్గర సినిమాలే తక్కుంటంటే.. రియలిస్టిగ్గా.. అథెంటిగ్గా తెరకెక్కిన సినిమాలు మరీ తక్కువ. ‘గోల్కొండ హైస్కూల్’ లాంటి ఒకటీ అరా సినిమాలు మాత్రమే కనిపిస్తాయి. ఐతే స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు ప్రధాన పాత్రలో నటించి.. సగటు క్రీడాభిమాని బాగా కనెక్టయ్యేలా రియలిస్టిగ్గా కథాకథనాలు పాత్రలు ఉండి.. వారిలో భావోద్వేగాల్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన తొలి తెలుగు సినిమాగా ‘జెర్సీ’ని చెప్పొచ్చు. తెలుగులో ఇప్పటికే కాదు.. ప్పటికీ కూడా నిలిచిపోయే ఒకానొక బెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ అనడంలో సందేహం లేదు. స్పోర్ట్స్ డ్రామాలకు చాలా కీలకమైన విషయం అథెంటిసిటీ అనే విషయం చాలామంది ఫిలిం మేకర్స్ మరిచిపోతుంటారు. స్వయంగా ఎంబీబీఎస్ చదివిన సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోను డాక్టర్ గా ఎంత అథెంటిగ్గా చూపించాడో చూశాం. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి క్రికెటరా.. అలా అయితే ఆ ఆటలో ఎంత వరకు వెళ్లాడు అన్నది తెలియదు కానీ.. తెలుగులో మాత్రమే కాదు.. మొత్తంగా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే క్రికెట్ నేపథ్యంలో ఇంత అథెంటిగ్గా సినిమా తీసిన దర్శకులు అరుదే. అతను మన దేశంలో క్రికెట్ సెటప్.. కోచింగ్.. మ్యాచ్ లు జరిగే తీరు.. ఇలా అన్నింటి మీద సమగ్రమైన అధ్యయనం జరిపాకే ఈ సినిమా తీసిన సంగతి తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మనదగ్గర హీరోను క్రీడాకారుడిగా చూపించిన చాలా సినిమాల్లో ఆట అనేది పాత్ర పరిచయానికి మాత్రమే ఉపయోగపడుతుంది. తర్వాత లోతుల్లోకి వెళ్లరు. హీరో ఆట ఆడటం కాకుండా ఏదేదో చేస్తుంటాడు. ఐతే జెర్సీ పూర్తిగా ‘ఆట’ చుట్టూనే తిరుగుతుంది. ఇందులో ప్రేమకథ కావచ్చు.. తండ్రీ కొడుకుల బంధం కావచ్చు.. మరో విషయం కావచ్చు.. ఏదైనా కూడా ‘ఆట’తో ముడిపడ్డదే. ఒక క్రికెటర్ ప్రయాణాన్ని అతడి వ్యక్తిగత జీవితంతో ముడిపెడుతూ గొప్ప భావోద్వేగంతో చూపించిన సినిమా ‘జెర్సీ’. ఈ చిత్రానికి ప్రధాన బలం హీరో పాత్రే. తనకు ప్రాణానికి ప్రాణమైన ఆటకు దూరమై తనను తాను కోల్పోతూ మానసిక సంఘర్షణకు లోనయ్యే క్రీడాకారుడిగా హీరో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు గౌతమ్. ఆ పాత్రకు నాని లాంటి గొప్ప నటుడిని ఎంచుకోవడంతో ఇక తిరుగే లేకపోయింది. సాధారణ పాత్రల్ని కూడా తన నటనతో ప్రత్యేకంగా మార్చగలిగే నాని.. అర్జున్ లాంటి అద్భుతమైన పాత్ర దొరకడంతో చెలరేగిపోయాడు. హీరో పాత్రే ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా సినిమాను లాక్కెళ్లి పోతుంది. ఇక ఈ కథలో తండ్రీ కొడుకుల బంధాన్ని ఎలివేట్ చేసి తీరు.. అందులోని భావోద్వేగాలు మరో పెద్ద ప్లస్ అయింది. హీరో.. అతడి కొడుకు మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా స్వీట్ గా అనిపిస్తుంది. హృదయాన్ని తాకుతుంది. చాలా తక్కువ సన్నివేశాలతోనే వీరి బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ‘జెర్సీ’ అనే టైటిల్ పెట్టడానికి గల కారణం చూపిస్తూ నడిపిన ఎమోషనల్ థ్రెడ్ సినిమాలో మేజర్ హైలైట్. దీని తాలూకు చమక్ ఏంటన్నది…

‘జెర్సీ’ రివ్యూ

కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.25
సాంకేతిక వర్గం పనితీరు - 2.75
దర్శకత్వ ప్రతిభ - 2.75

2.9

‘జెర్సీ’ రివ్యూ

‘జెర్సీ’ రివ్యూ

User Rating: 4.45 ( 1 votes)
3