లెజెండ్ రివ్యూ

0

Legend Latest poster 2 @andhra365

లెజెండ్  కథ:

కృష్ణ(బాల కృష్ణ) ఒక చలాకి యువకుడు దుబాయ్ లో నివసిస్తూ ఉంటాడు , సోనాల్ చౌహన్ ని ప్రేమించిన కృష్ణ, మాణిక్యం(బ్రహ్మానందం) సహాయంతో వైజాగ్ లో పెళ్లికి వస్తాడు. “నేను కొన్ని చూడకూడదు వినకూడదు అనుకుంటాను అలాంటివి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది” అనే వ్యక్తిత్వం కృష్ణ ది అలాంటి ఒక సంఘటన వలన కృష్ణకు జితేంద్ర (జగపతి బాబు) తో శత్రుత్వం ఏర్పడుతుంది. దాంతో జీతెంద్ర ఎలా అయిన కృష్ణ మీద ప్రతీకారం తీర్చుకోవాలని సోనాల్ చౌహన్ ను కిడ్నాప్ చేస్తాడు. అంతే కాకుండా కృష్ణ కుటుంబం మొత్తాన్ని చంపేయమని ఆదేశాలు ఇస్తాడు. కాని ఆ సంఘటన నుండి కృష్ణ కుటుంబాన్ని సింహాచలం కాపాడుతాడు. ఇంతకీ ఈ సింహాచలం ఎవరు? అతనికి కృష్ణ కి ఉన్న సంభంధం ఏంటి? అనేది తెర మీద చూడాల్సిందే…

లెజెండ్ – నటీనటుల ప్రతిభ

బాలకృష్ణ ఎప్పటిలానే తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు ముఖ్యంగా పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో ఆయనకి ఆయనే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. రెండు పాత్రలు చేసిన బాలకృష్ణ రెండు పాత్రలకు మధ్య తేడాను స్పష్టంగా చూపగలిగారు.

ఇక విలన్ గా జగపతి బాబు కూడా అద్భుతం అయిన నటనా ప్రదర్శన కనబరిచారనే చెప్పుకోవాలి. అయన పాత్ర ఎలివేషన్ అంతగా లేకపోయినా అయన నటించిన తీరు మరియు డైలాగ్ డెలివరీ మాత్రం ఆశ్చర్యకరం..

రాధిక ఆప్టే మంచి పాత్రనే పోషించినా కూడా ఆమె నటనా తీరు మాత్రం పరవాలేదనిపించింది.

సోనాల్ చౌహన్ తన అందంతో ఆకట్టుకోవడంలో సఫలం అయ్యింది.

సుహాసిని, కళ్యాణి , సూర్య కిరణ్, బ్రహ్మాజీ, చలపతి రావు మరియు ఆహుతి ప్రసాద్ వంటి నటులు చాలా మంది తమ పాత్రకు తగ్గ ప్రదర్శన కనబరిచారు.

లెజెండ్ – సాంకేతికవర్గం పనితీరు

కొత్తదనం లేని కథనంతో ఆకట్టుకోవాలన్న బోయపాటి ప్రయత్నం విఫలం అయ్యిందనే చెప్పాలి. ఇక చిత్ర నిడివి కూడా ఎక్కువగా ఉంది. కాని కొన్ని సన్నివేశాల వరకు అద్భుతం చూసిన ఫీలింగ్ వస్తుంది అదే సమయంలో కామెడీ విషయంలో అదః పాతాళంలో తొక్కుతున్న ఫీలింగ్ వస్తుంది.

సినిమాటోగ్రఫీ అందించిన రామ్ ప్రసాద్ పనితనం చాలా బాగుంది. ఈ చిత్రానికి డైలాగ్స్ హైలెట్ ముఖ్యంగా రాజకీయాలను గురించిన సంభాషణలు ప్రస్తుత పరిస్థితులకు బాగా దగ్గరగా ఉండడంతో ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు.

ఎడిటర్ కోటగిరి గారు ఇంకాస్త శ్రద్ద వహించి ఉండవలసింది. చిత్రంలో కొన్ని సన్నివేశాలను తొలగించి ఉంటె చిత్ర వేగం బాగుండేది. దేవిశ్రీ అందించిన సంగీతం పరవలేధనిపించినా అయన అందించిన నేపధ్య సంగీతం చాలా బాగుంది. నిర్మాణ విలువలకు చాలా బాగున్నాయి చిత్రం ఆసాంతం రిచ్ గా ఉంటుంది…

లెజెండ్ – చిత్ర విశ్లేషణ

సింహ తరువాత అదే “కాంబినేషన్” లో వచ్చిన చిత్రం కావడంతో “లెజెండ్” చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగట్టుగానే ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో చిత్రం మీద అంచనాలు మరింత పెరిగాయి. కాని దర్శకుడు బోయపాటి ఆ అంచనాలను చేరుకోవడంలో కొంత విఫలం అయ్యారు. కొన్ని సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించిన బోయపాటి వాటిని దగ్గరకు చేర్చే విషయంలో విఫలం అయ్యారు. బాలకృష్ణ నటనకు దేవిశ్రీ సంగీతం ఈ రెండింటికి బోయపాటి డైలాగ్స్ అద్భుతంగా, ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉన్న డైలాగ్స్, ఇంకా బాలకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ జగపతి బాబు డైలాగ్స్ ఇవన్ని కలిసి  ద్వితీయార్థం చిత్రాన్ని మంచి స్తానంలో నిలబెట్టాయి.

బాలకృష్ణ అభిమానులకు మాత్రం ఈ చిత్రం కన్నుల పండుగ కాని సగటు ప్రేక్షకుడిని అధిక హింస మరియు నాసిరకం కామెడీ ఇబ్బంది పెట్టినా కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటుంది. మీరు మాస్ చిత్రాలను ఇష్టపడితే , బాలకృష్ణ అద్భుతమయిన నటన చూడాలని అనుకుంటే దగర్లోని థియేటర్ కి వెళ్ళిపొండి..

 

* సుమారు రూ.40 కోట్ల బ‌డ్జెట్‌తో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. విడుద‌ల‌కు ముందే చిత్ర‌బృందం టేబుల్ ప్రాఫిట్‌తో బ‌య‌ట ప‌డింది. ఒక సినిమా.. టేబుల్ ప్రాఫిట్ సాధించ‌డం ఈరోజుల్లో గొప్ప విష‌య‌మే. ఒక విధంగా అది తొలి విజ‌య‌మే.

 

* మూడు త‌రాల క‌థ ఇది. ప‌గ‌, ప్ర‌తికారాలు మూడు త‌రాలుగా ఎలా కొన‌సాగాయి..? వాటికి ఎలా చ‌ర‌మ‌గీతం పాడారు? అన్న‌దే ఈ క‌థ‌లో కీల‌కాంశం. రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న కూడా ఉంటుంది.

 

* బాల‌య్య మూడు గెట‌ప్పుల‌లో క‌నిపించ‌నున్నాడు. ప్ర‌తినాయ‌కుడు జ‌గ‌ప‌తిబాబు కూడా అంతే. ప్ర‌తినాయ‌కుడిగా జ‌గ‌ప‌తికి ఇదే తొలిచిత్రం. ఈ సినిమా పై ఆయ‌న చాలా ఆశ‌లు పెంచుకొన్నాడు. ఆయ‌న కెరీర్ ఈ సినిమాతోనే ఆధార‌ప‌డి ఉంది.

 

* ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే దుమ్ము రేపాయి. అందులో బాల‌య్య ప‌లికిన సంభాష‌ణ‌లు అంద‌రికీ న‌చ్చాయి. ఇలాంటివి ప్ర‌తీ స‌న్నివేశంలో వినిపిస్తాయి, క‌నిపిస్తాయ‌ట‌.

 

* దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. బాల‌య్య‌తో ప‌నిచేయ‌డం ఆయ‌న‌కు ఇదే తొలిసారి. బాల‌య్య సినిమాకు త‌గిన‌ట్టుగానే పాట‌ల్ని కంపోజ్ చేశాడు. ముఖ్యంగా మూడు పాట‌లు మాస్‌ ని విప‌రీతంగా ఆక‌ట్టుకొంటున్నాయి. ఫ్యామిలీ సాంగ్ కూడా ఉంది. టైటిల్ సాంగ్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది.

 

* ల‌క్కీగాళ్‌గా పేరొందిన హంసానందిని ఈ చిత్రంలోనూ ఓ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది.

 

* రామ్ ల‌క్ష్మ‌ణ్ డిజైన్ చేసిన పోరాట దృశ్యాలు త‌ప్ప‌కుండా అదుర్స్ అనేలా ఉంటాయ‌ని బోయ‌పాటి చెబుతున్నారు. యాక్ష‌న్ సీక్వెన్స్ ఈ సినిమా మూడ్ ని పెంచేలా డిజైన్ చేశార‌ట‌.

 

* ప్ర‌తీ సినిమాలోనూ క‌థానాయ‌కుడిగా చేతికి ఆయుధం ఇవ్వ‌డం బోయ‌పాటి శ్రీ‌ను అల‌వాటు. ఈ సినిమాలోనూ బాల‌య్య‌కు గొడ్డ‌లిలాంటి ఓ ఆయుధం అందించారు.

 

* ఈ సినిమాలో క‌థానాయిక పాత్ర‌ల కోసం సుదీర్ఘ అన్వేష‌ణ సాగింది. బాలీవుడ్ క‌థానాయిక‌లు న‌టిస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. చివ‌రికి రాధికాఆప్టే, సోనాల్ చౌహాన్‌ ల‌తో స‌రిపెట్టుకోవ‌ల‌సొచ్చింది.

 

* బోయ‌పాటి శ్రీ‌ను కుమార్తె ఈ సినిమాలో ఓ పాత్ర పోషించ‌డం విశేషం.

 

* సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా వీక్షించింది.

 

 

 

Legend Movie Review in English  | Balakrishna Legend Live Updatesలెజెండ్ లైవ్ అప్‌డేట్స్ తెలుగు లో

ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా మరో కోణంలో చూస్తే ఈ చిత్రంపై అనేకానేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎందుకంటే 14రీల్స్ సంస్థ మహేష్ “1 నేనొక్కడినే”కి చేసిన తప్పే “లెజెండ్” చిత్రం విషయంలో సైతం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

గత సంక్రాంతికి విడుదలైన మహేష్ “1 నేనొక్కడినే” చిత్రం విషయంలో సైతం పవర్‌ఫుల్ ట్రయిలర్ ను విడుదల చేసి సినిమా పై అంచనాలను భారీగా పెంచారు, కాకపోతే చివరాఖరుకు సినిమా బాక్సాఫిస్ వద్ద అంచనాలు పెంచేసిన “1 నేనొక్కడినే” అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే “లెజెండ్” విషయంలో సైతం ఇదే జరుగుతుందేమోననే అనుమానాలు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఏం జరుగుతుందో ఏమో కానీ నందమూరి అభిమానులు మాత్రం ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం అనుమానాలను పక్కకు నెట్టి ఎంతటి ప్రభంజనం సృస్తిస్తుందో చూడాలి.  లెజెండ్ లో పాటలు దేశ విదేశాల్లో మంచి టాక్ వచ్చాయి. సూపర్ హిట్ గా నిలిచాయి.

 

సినిమా ట్రాక్ దాదాపు సింహా లా ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఆ సినిమా మాధిరిగానే ఫ్లాష్ బ్యాక్ సీన్లు చాలా వైలెన్స్ గా ఉంటాయి. మరో ముఖ్య విషయం ఈ సినిమాలో బాలకృష్ణ కుమారుడు మోక్ష గెస్ట్ రోల్ పాత్రలో చేయాలని చూస్తున్నారు.

మరో ముఖ్య విషయం ఈ సినిమాలో బాలకృష్ణ కుమారుడు మోక్ష గెస్ట్ రోల్ పాత్రలో చేయాలని చూస్తున్నారు. లెజెండ్ లో వాడిన బైక్ ను ఒక మంచి ఉద్దేశం కోసం అమ్మడానికి చిత్ర యూనిట్ చూస్తున్నారు .

లెజెండ్ మూవీలో బైక్ విన్యాసాలు ఎంట్రటైన్ మెంట్ న్యూస్ కింద సినిమాకు మంచి టాక్ గుర్తింపు తీసుకువస్తుంది. లెజెండ్ చిత్రంలో సాంగ్స్ ఇప్పటికే హిట్ టాక్ వచ్చింది. బాలకృష్ణ –దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ హిట్ ఈ సినిమా రాధికా ఆప్టే విషయానికి వస్తే గతంలో రక్త చరిత్ర చిత్రంలో నటించినపుడు వచ్చిన గుర్తింపు లెజెండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్ లో అలాంటి గుర్తింపే వస్తుందన్ని ఆశాభావం వ్యక్తం చేసింది.

సింహాలా.. లెజెండ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో తెలియాలంటే ఇంకొన్ని గంట‌లు ఎదురుచూడాలంతే. లెజెండ్ అప్ డేట్స్‌, రివ్యూ కోసం తెలుగునౌ.కాం బ్రౌజ్ చేస్తూనే ఉండండి.

రెయిన్ బో చిత్రం తర్వాత సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో నటించడం తన అదృష్టంగా భావిస్తుంది.ఈ చిత్రం హిట్ అయితే టాలీవుడ్ లో తనకు మంచి పేరు వస్తుందన్న ఆశ సెన్సార్ బోర్డు వాళ్లు ఎలక్షన్ కమీషన్ దగ్గర నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకురమ్మని చిత్రయూనిట్ కు తెలిపారు.

ఈ చిత్రం లో రాజకీయాలకు సంబంధించిన కొన్ని బారీ డైలాగ్స్ ఉండటం చేత సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెబుతున్నారు. లెజెండ్ చిత్రం కోసం అమెరికాలో ఒక అభిమాని 1116 డాలర్ల (సుమారు డెబ్బయి వేలు) పెట్టి టిక్కెట్ తీసుకున్నాడు. ఇది టాలీవుడ్ లో అత్యంత ఖరీదు అయిన టెక్కెట్ గా చెప్పవొచ్చు లెజెండ్ చిత్రం పూర్తిగా యాక్షన్ బేస్డ్ గా తీశారు.

గతంలో సింహా చిత్రం లాగే ఫ్యాక్షన్ యాక్షన్, సెంటిమెంట్ మాధిరిగా అలాగే కాంబినేషన్ కూడా సేమ్ లెజెండ్ చిత్రం నటీనటులు నందమూరి బాలకృష్ణ,రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం, సంగీతం దేవీశ్రీ ప్రసాద్.  లెజెండ్ రివ్యూని లైవ్ అప్ డేట్స్(ట్వీట్స్) ద్వారా ఎప్పటికప్పడు అందిస్తుంటాము.

లెజెండ్ రివ్యూ, లెజెండ్ : రివ్యూ, లెజెండ్ : సమీక్ష, Balakrishna Legend Reveiw, Balayya Legend Movie Review, Legend IMDB Review Ratings, Legend Movie Review, Legend Movie Live Updates, Legend Telugu Movie Review, Balakrishna Legend Movie Ratings, Legend Movie Tweet Updates, Legend Movie Public Talk, Legend Movie Ratings, Legend Movie website Ratings, Legend Movie Online tickets booking, Legend Movie idlebrain review, Legend Movie APHerald Review, Legend Movie 123telugu review, Legend Movie mirchi9 reveiw, Legend Movie Telugunow reveiw, Legend Movie vnews review, రివ్యూ లెజెండ్, రివ్యూ : లెజెండ్, రివ్యూ లెజెండ్, సమీక్ష లెజెండ్, సమీక్ష : లెజెండ్, లెజెండ్ సమీక్ష,

గతంలో సింహా చిత్రం లాగే ఫ్యాక్షన్ యాక్షన్, సెంటిమెంట్ మాధిరిగా అలాగే కాంబినేషన్ కూడా సేమ్ లెజెండ్ చిత్రం నటీనటులు నందమూరి బాలకృష్ణ,రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం, సంగీతం దేవీశ్రీ ప్రసాద్.
Directed by: బోయపాటి శ్రీనివాస్
Starring:
నందమూరి బాలకృష్ణ
రాధికా ఆప్టే
సోనాల్ చౌహన్