Templates by BIGtheme NET
Home >> REVIEWS >> NTR Baadshah Movie Review in Telugu

NTR Baadshah Movie Review in Telugu


 

Baadshah-Movie-Review-Telugu

Baadshah Telugu Movie Review, Baadshah Rating, Baadshah Movie Review, Baadshah Review, NTR Baadshah Review, Jr NTR Baadshah Review, Kajal Agarwal, Badshah Review, Badshah Movie Review, Badshah Telugu Movie Review, Badshah Rating, Badshah Movie Rating, Jr NTR Badshah Review, Jr NTR Badshah Movie Review, Cast and Crew, Kajal agarwal in Badshah

Baadshah Review, Rating | Baadshah Telugu Movie Review | Jr NTR
SwathiBaadshah Telugu Movie Review | Baadshah Rating | Baadshah Movie Review | Baadshah Review | NTR Baadshah Review | Jr NTR Baadshah Review | Kajal Agarwal | Badshah Review | Badshah Movie Review | Badshah Telugu Movie Review | Badshah Rating | Badshah Movie Rating | Jr NTR Badshah Review | Jr NTR Badshah Movie Review | Cast and Crew | Kajal agarwal in Badshah
Baadshah Telugu Movie Review, Baadshah Rating, Baadshah Movie Review, Baadshah Review, NTR Baadshah Review, Jr NTR Baadshah Review, Kajal Agarwal, Badshah Review, Badshah Movie Review, Badshah Telugu Movie Review, Badshah Rating, Badshah Movie Rating, Jr NTR Badshah Review, Jr NTR Badshah Movie Review, Cast and Crew, Kajal agarwal in Badshah

ప్రివ్యూ :ఆక‌లి మీదున్న సింహం… ఎన్టీఆర్‌. ఊస‌ర‌వెల్లి, ద‌మ్ము సినిమాలు ఆయ‌న్నీ ఆయ‌న అభిమానుల్నీ నిరాశ ప‌ర‌చాయి. ఆ లెక్క స‌రిచేసుకోవ‌డానికి బాద్‌షాగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్‌. గ‌త నాలుగేళ్లుగా ఎన్టీఆర్ న‌టించిన ఏ సినిమాకీ లేని హైప్‌, క్రేజ్ ఈ సినిమాకి వ‌చ్చేశాయి. అభిమానుల అంచ‌నాలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. దానికి కార‌ణం… సినిమా విడుద‌ల‌కు రెండు నెల‌ల ముందే విడుద‌ల చేసిన టీజ‌ర్‌. బాద్‌సా డిసైడైతే వార్ వ‌న్‌సైడ్ అయిపోద్ది… అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌, ఆయ‌న డ్రస్సింగ్ స్టైల్‌, కేశాలంక‌ర‌ణ‌… అన్నీ స‌రికొత్త గా క‌నిపించాయి. దానికి తోడు… దూకుడు సినిమాతో జోరుమీదున్న శ్రీ‌నువైట్ల ఈ సినిమాకి ద‌ర్శకుడు కావ‌డం. త‌మ‌న్ ఇచ్చిన మ్యూజిక్ కూడా ప్లాటిన‌మ్ డిస్క్ జ‌రుపుకొంది. ఈ సినిమాకి మార్కెట్ కూడా క‌నీ వినీ ఎరుగ‌ని రేంజులో సాగుతోంది. దాంతో ఏప్రెల్ 5 ఎప్పు డెప్పుడు వ‌స్తుందా అని నంద‌మూరి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో అన్నీ ప్ర త్యేక‌త‌లే. అడుగుడుగునా ఆకర్ష ణ‌లే. ఎన్టీఆర్ ఈ సినిమాకి ఉన్న ప్ర ధాన ఎట్రాక్ష న్‌. ఆయ‌న గెట‌ప్‌, బాడీ లాంగ్వేజ్ అభిమానుల‌ను ఊరిస్తోంది. బాద్‌షా అన‌గానే మాఫియా నేప‌థ్యంలో సాగే క‌థ అనే సంగ‌తి అర్థ మ‌వుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డాన్‌గా క‌నిపిస్తారు. డాన్‌గా ఎందుకు మారాడు? మాఫియా లో అడుగు పెట్టి ఏం సాధించాడు? అనేదే బాద్‌షా.

ఈ సినిమాకి మహేష్‌బాబు వాయిస్ ఓవ‌ర్ చెప్పాడు. ఆయ‌న ఇంత‌కు ముందు.. జ‌ల్సా కోసం గొంతు అరువిచ్చారు. ఆసినిమా పెద్ద హిట్‌. ఇప్పు డు శ్రీ‌నువైట్ల తో ఉన్న స్నేహంతో మ‌రోసారి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. మ‌రి బాద్‌షా కూడా హిట్ అయితే మ‌హేష్‌బాబు సెంటిమెంట్ మ‌రోసారి బ‌ల‌ప‌డుతుంది.

సిద్దార్థ్ ఓ కీల‌క‌మైన పాత్ర పోషించాడు. క‌నిపించేది కాసేపే. అయితే ఈ క‌థ‌ను మలుపు తిప్పే పాత్ర ఆయ‌న‌ది. గోపీ మోహ‌న్‌, కోన వెంక‌ట్ .. వీరిద్దరూ శ్రీ‌నువైట్ల సినిమాకి ప్ర ధాన బ‌లం. మరోసారి ఈ జోడీ విజృంభించింద‌ట‌. బాద్ షా నిండా పంచ్ డైలాగులు కావ‌ల్సిన‌న్ని ఉన్నాయ‌ని శ్రీ‌ను వైట్ల చెబుతున్నారు. ఇప్ప టికే ప్ర చార చిత్రాలు కెవ్వు కేక
పుట్టిస్తున్నాయి.

త‌మ‌న్ సంగీతం మ‌రో ప్ల స్ పాయింట్‌. బంతిపూల జాన‌కీ… పాట థియేట‌ర్లో అదిరిపోతుంద‌ట‌. శేఖ‌ర్ అనే కొత్త డాన్స్ మాస్ట ర్ ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. అత‌ను కంపోజ్ చేసిన పాట‌లు న‌భూతో అన్న ట్టు ఉన్నాయ‌ట‌. ఎన్టీఆర్ డాన్సులు ఈ సినిమాతో కొత్త సంచ‌ల‌నం సృష్టిస్తాయ‌ని నిర్మాత గ‌ణేష్‌బాబు కూడా చెబుతున్నారు.

బ‌డ్జెట్ ప‌రంగా కూడా బాద్‌షా రికార్డులు సృష్టించింది. ఎన్టీఆర్ కెరియ‌ర్‌లో బిగ్గెస్ట్ బ‌డ్జెట్ సినిమా ఇదే. మార్కెట్ కూడా ఆ రేంజులోనే జ‌రిగింది. శాటిలైట్ హ‌క్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడ‌య్యాయ‌ట‌.

శ్రీ‌నువైట్ల సినిమాలో వినోదానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇందులోనూ కామెడీ… సూప‌ర్‌గా కుదిరిందట‌. ముఖ్యంగా బ్రహ్మానందం, ఎమ్మెస్‌ల కాంబినేష‌న్‌.. పొట్ట చెక్క లు చేయ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఈ సినిమాలో ఎమ్మెస్ ఓ డైరెక్ట ర్‌గా క‌నిపిస్తారు. వీరిద్దరితో పాటు ఎన్టీఆర్ కూడా వీర కామెడీ చేశాడ‌ట‌.

బృందావ‌నం త‌ర‌వాత ఎన్టీఆర్‌, కాజ‌ల్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా ఇది. ఈ హిట్ పెయిర్‌.. మ‌రోసారి ఆక‌ట్టుకొంటుంద‌ని టీమ్ న‌మ్మ కంగా చెబుతోంది. ఎన్టీఆర్ పాత్ర నాలుగు షేడ్స్‌లో ఉంటుంది. అవేంటో తెర‌పైనే చూడాలి. అంతే కాదు.. ఓ సంద‌ర్భంలో పెద్ద ఎన్టీఆర్‌ని గుర్తు చేసేలా న‌టించాడ‌ట జూనియ‌ర్‌. ఆ సీన్ నందమూరి అభిమానుల‌కు పండ‌గే.

ఇన్ని ప్ర త్యేక‌త‌లు, అంచ‌నాల మ‌ధ్య ఈ శుక్ర వారం బాక్సాఫీసు దండ‌యాత్రకు వ‌స్తున్నాడు బాద్‌షా. ఎన్టీఆర్ విజృంభ‌ణ‌కు ఎన్ని రికార్డులు దాసోహం అంటాయో చూడాలి.

మాస్ క‌థ‌ను త‌క్కువగా అంచ‌నా వేయ‌కూడ‌దు. ఒకే క‌థ‌ని ఎన్ని సార్లు వాడుకొన్నా స‌రే, ఒకే పాత్రని ఎంత‌మంది ఎన్నిసార్లు పోషించినా స‌రే…ద‌ర్శకుడికి టాలెంట్ ఉంటే… స‌న్నివేశాలు కొత్తగా రాసుకొంటే.. మ‌రోసారి చూసేలా తీర్చిద్దగ‌ల‌డు. అలాంటి ద‌ర్శకుడు… శ్రీ‌నువైట్ల‌. మాస్ ఇమేజ్ ఉన్న హీరోనీ త‌క్కువగా చూడొద్దు. స‌రైన పాత్ర దొరికితే… రెచ్చిపోతాడు. ఒక్క సినిమా చాలు.. ప‌ది ఫ్లాపుల‌ను మ‌ర్చిపోయేలా చేయ‌గ‌ల‌డు. అలాంటి హీరో ఎన్టీఆర్‌. వేట మానేసినంత మాత్రాన పులి ఎండుగ‌డ్డి తిన‌దు.. పులి పులే! బాక్సాఫీసు ద‌గ్గర త‌ఢాకా చూపించవల‌సిన స‌మ‌యంలో స్టార్ హీరోలు రెచ్చిపోవ‌డం ప‌రిపాటే! ఎన్టీఆర్‌ కి ఆ స‌మ‌యం వ‌చ్చింది. అందుకు త‌గిన ద‌ర్శకుడిని ఎంచుకొన్నాడు. ఆ సినిమానే ‘బాద్‌ షా’. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య‌, మ‌రెన్నో ఆశ‌ల మ‌ధ్య‌…. ‘బాద్‌ షా’ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి ఈ పులి వేట ఎలా సాగింది? శ్రీ‌ను తన మ్యాజిక్‌ ని చూపించాడా? వీరిద్దరూ క‌లిసి చేసిన హంగామా ఎలా ఉంది? తెలుసుకొందాం రండి!

హాంకాంగ్‌, సింగపూర్‌, మ‌లేసియా… ఇలా ప్రతి చోటా… త‌న సామ్రాజ్యాన్ని విస్తరించుకొంటాడు మాఫియా డాన్… సాధూభాయ్ (కెల్లీ డార్జ్‌). హాంకాగ్‌ లో కార్యక‌లాపాల‌న్నీ ధ‌న్‌ రాజ్ (ముఖేష్‌ రుషి) చూస్తుంటాడు. అత‌ని త‌న‌యుడే ‘బాద్‌ షా’ (ఎన్టీఆర్). త‌న దూకుడుతో ప్ర త్యర్థులలో వ‌ణ‌కు పుట్టిస్తాడు బాద్‌షా. ఆ వేగం న‌చ్చే సాధూ భాయ్‌… బాద్‌ షాకి ఓ ప‌ని అప్పగిస్తాడు. దాన్ని దిగ్విజ‌యంగా పూర్తి చేస్తాడు బాద్‌ షా. దాంతో బాద్‌ షా కి మాఫియాలో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చేస్తుంది. అయితే ఓ విష‌యంలో సాధూకీ, బాద్‌ షాకీ మ‌ధ్య విభేదాలు మొద‌ల‌వుతాయి. నీ సామ్రాజ్యాన్ని మ‌ట్టుపెడ‌తా అని సాధూభాయ్‌ తో ఛాలెంజ్ చేస్తాడు బాద్‌ షా. ఈలోగా హాంకాంగ్ పోలీసులు, ఇంట‌ర్‌ పోల్ అధికారులు బాద్‌ షా కోసం వేట ప్రారంభిస్తారు. వారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి రామారావు పేరుతో ఇట‌లీ వెళ్లిపోతాడు బాద్ షా. అక్కడ జాన‌కి (కాజ‌ల్‌) పరిచ‌యం అవుతుంది. అది ప్రేమ‌గా మారుతుంది. అయితే అప్పకే.. ఆది (న‌వ‌దీప్‌)తో పెళ్లి కుదురుతుంది. ఈ పెళ్లి పెటాకులు చేసి…. జాన‌కి మెడ‌లో మూడు ముళ్లు వేయ‌డానికి ఇండియా వ‌స్తాడు రామారావు. ఆది ఎవ‌రో కాదు.. బాద్‌ షాని ప‌ట్టుకోవాల‌ని ఎదురుచూసే ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. అస‌లు బాద్‌ షాకీ, ఆదికి మ‌ధ్య త‌గువు ఏమిటి? బాద్‌ షా జాన‌కి కోసం ఇట‌లీ ఎందుకు వెళ్లాడు? అస‌లు మాఫియాలో ఎందుకు చేరాడు? అనేది ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు. ఇవ‌న్నీ వెండి తెర‌పై చూడాల్సిందే. యాక్షన్‌, వినోదం… కావ‌ల్సినంత హీరోయిజం… ఇవ‌న్నీ క‌థ‌లో ఎలా మేళ‌వించాలో శ్రీ‌నువైట్లకు బాగా తెలుసు.

శ్రీ‌ను వైట్ల విజ‌య‌వంత‌మైన సినిమాల‌న్నీ ఈ ఫార్ములా అనుస‌రించి తీసిన‌వే. ఈసారీ అదే పంథాలో వెళ్లిపోయాడు. ఇట‌లీలో కాజ‌ల్‌, ఎన్టీఆర్‌, వెన్నెల కిషోర్ మ‌ధ్య స‌ర‌దా స‌న్నివేశాల‌తో సినిమా జాలీగా మొద‌ల‌వుతుంది. రివైంజ్ నాగేశ్వరరావు (ఎమ్మెస్ నారాయ‌ణ‌) ఎంట్రీతో న‌వ్వుల పంట ప్రారంభం అవుతుంది. ఎమ్మెస్ పాత్రలో రాంగోపాల్ వ‌ర్మ నుంచి బోయ‌పాటి శ్రీ‌ను వ‌ర‌కూ అంద‌రి ద‌ర్శకుల మేన‌రిజాన్నీ చూపించి… థియేట‌ర్లో న‌వ్వుల జ‌ల్లులు కురిపించాడు శ్రీ‌ను వైట్ల‌. కామెడీ పండించ‌డంలో ఈసారి ఎన్టీఆర్ కూడా కేకపుట్టిచ్చాడు. సినిమా రంగంపై వేసిన సెటైర్లు న‌వ్విస్తాయి. ఆఖ‌రికి సిద్దార్థ్, దిల్‌ రాజుల‌నూ వ‌ద‌ల్లేదు. అక్కడ‌క్కడా యాక్షన్ బ్లాకులు పెట్టుకొని మాస్ సంతృప్తి ప‌డేలా చేశాడు. తొలి భాగం ఈ స‌ర‌దా స‌న్నివేశాలే నిలబెట్టాయంటే అతిశ‌యెక్తి కాదు. సెకండాఫ్‌ లో ఆ బాధ్యత బ్రహ్మానందం తీసుకొన్నాడు. పిల్లి ప‌ద్మనాభ సింహాగా అద‌ర‌గొట్టాడు.

బ్రహ్మానందం పాత్రకు ఓ బ‌ల‌హీన‌త ఆపాదించి.. దాని ద్వారా వినోదం పండించ‌డం శ్రీ‌ను వైట్ల అల‌వాటు. దూకుడులో రియాలిటీ షో పేరుతో ఆడుకొన్నట్టే.. ఇందులో డ్రీమ్ వ‌ర‌ల్డ్ కాన్సెప్ట్ సృష్టించారు. క‌ల‌లో బ‌తికే బ్రహ్మీని చూస్తే పొట్టచెక్కలు కావ‌డం ఖాయం. తొలిస‌గం ఎమ్మెస్ చేసిన హంగామా మ‌ర్చిపోయే స్థాయిలో ఆ పాత్రని తీర్చిదిద్దాడు శ్రీ‌నువైట్ల‌. దూకుడులో ప‌ద్మశ్రీ పోలిక‌లు క‌నిపించినా.. థియేట‌ర్లో మాత్రం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.

ఎన్టీఆర్ పాత్రలో నాలుగు షేడ్స్ ఉన్నాయి. ప్రతీ పాత్రకూ ఓ డిఫ‌రెంట్ స్టైల్‌, మేన‌రిజం… ఆపాదించారు. సంభాష‌ణ‌లు ప‌లికే విధానంలోనూ మార్పు చూపించారు. ఈ విష‌యంలో ఎన్టీఆర్ తీసుకొన్న శ్రద్ధ అభినంద‌నీయం. కామెడీ, ఎమోష‌న్‌, యాక్ష న్‌…. ఇలా ప్రతి విభాగాన్నీ ట‌చ్ చేయించారు. దాంతో ఎన్టీఆర్‌ లోని పరిపూర్ణ న‌టుడికి ప‌ని దొరికిన‌ట్టైంది. సిద్దూ, దిల్‌ రాజుల‌పై సెటైర్ వేస్తున్నప్పుడు తారక్ పండించిన హావ‌భావాలూ అభిమానుల‌కు న‌చ్చుతాయి. అంతే కాదు జ‌స్టిస్ చౌద‌రి గెట‌ప్ వేసి అన్నగారిని మ‌రోసారి గుర్తుచేశారు. చివ‌ర్లో ఎన్టీఆర్ పాత పాట‌ల‌కు స్టెప్పులు వేసి.. అల‌రించారు. డాన్సులు మ‌రీ కొత్తగా క‌నిపించ‌క‌పోయినా… చేసింది ఎన్టీఆర్ కాబ‌ట్టి త‌ప్పకుండా అల‌రిస్తాయి. అమాయ‌క‌త్వం, మంచిత‌నం క‌ల‌బోసిన పాత్రలో కాజ‌ల్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. బంతి ఫిలాస‌ఫీతో చెప్పిన సంభాష‌ణ‌లు న‌వ్వులు పండిస్తాయి. కాక‌పోతే.. ఆ డోసు కాస్త ఎక్కువైన‌ట్టు అనిపిస్తుంది. ఇక మిగిలిన పాత్రల‌న్నీ అనుభ‌వం ఉన్న న‌టీన‌టుల‌కే ప‌డ్డాయి కాబ‌ట్టి… యాజ్‌ టీజ్ చేసేశారు.

శ్రీ‌నువైట్ల త‌న బ‌లాల‌ను మ‌రోసారి న‌మ్ముకొన్నాడు. డైలాగ్ కామెడీతో సినిమాని లాగించే ప్రయ‌త్నం చేశాడు. అయితే క‌థ‌, క‌థ‌నాలు… పాత్రల్ని ప‌రిచ‌యం చేసే విధానం, ట్విస్టులు ఇవ‌న్నీ ఆయ‌న గ‌త సినిమాల మాదిరిగాన‌నే ఉన్నాయి. దూకుడుని మ‌రోలా తీస్తే… ఇలా వ‌చ్చిందేమో అనికూడా అనిపిస్తుంది. కానీ త‌ప్పదు… ఇంత భారీ సినిమానిని సేఫ్‌ గా లాగించేయాల‌నుకొన్న అత‌ని ఆలోచ‌న నిర్మాత‌కు లాభం చేకూర్చేదే. స్ర్కీన్‌ ప్లే విష‌యంలో చాలా త‌ప్పులు చేశాడు. అనేక పాత్రలు ఉండ‌డం వ‌ల్ల‌… ప్రేక్షకుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది.  బ్రహ్మానందం, ఎమ్మెస్‌, ఎన్టీఆర్ పాత్రల‌కు మిన‌హా…మ‌రెవ్వరి పాత్రల‌పై దృష్టి పెట్టలేదు. కొన్ని స‌న్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. అస‌లు రామారావు.. హాంకాంగ్ ఎలా వెళ్లాడు? అంత పెద్ద మాఫియా ముఠాలో ఎలా చేరాడు? అనే విష‌యాలు చెప్పలేదు. త‌ల్లిదండ్రుల మ‌ధ్య ఉన్న వైరం కూడా స‌రిగ్గా చూపింక‌లేక‌పోయాడు. సంభాష‌ణ‌ల్లో పంచ్‌ లు బాగా పేలాయి. ఎన్టీఆర్ చేత ప‌లికించిన ప్రతీ సీరియ‌స్ డైలాగ్‌… అల‌రించేదే. మా తాత నాకు ఈ పేరు పెట్టింది చ‌నిపోయిన త‌ర‌వాత స‌మాధిపై రాసుకోవ‌డానికి కాదు, చ‌రిత్ర రాయ‌డానికి.. అని చెప్పించారు. ఈ డైలాగ్‌ కి విజిల్స్ ప‌డ‌డం ఖాయం. సంభాష‌ణ ర‌చ‌యిత నైపుణ్యం అడుగ‌డుగునా క‌నిపిస్తుంది.

త‌మ‌న్ సంగీతం వ‌ల్ల ఈ సినిమాకి పెద్దగా ఒరిగిందేం లేదు. పాట‌లు క్యాచీగా లేవు, ఎన్టీఆర్ స్టెప్పుల‌కు మాత్రం కాస్త అనువుగా ఉన్నాయంతే. నేప‌థ్య సంగీతం బిల్డప్పుల‌కే ప‌నికొచ్చింది. శ్రీను వైట్ల ప్రతి విష‌యంలోనూ దృష్టి పెడ‌తాడు. అన్నీ ట్రెండీగా ఉండేట‌ట్టు చూసుకొంటాడు. కానీ క‌థ మాత్రం పాత‌దే ఉంటుంది. ఆ విష‌యంలోనూ శ్రద్ధ తీసుకొంటే బాద్‌షా నిజంగానే బాక్పాఫీసుని షేక్ చేసేవాడేమో. ఇప్పటికీ ఫ‌ర్లేదు. వేస‌వి కాలం.. కాసేపు స‌ర‌దాగా ఎంజాయ్ చేద్దాం.. అనుకొనేవారికీ ముఖ్యంగా… ఎన్టీఆర్ అభిమానుల‌కు ఈ సినిమా త‌ప్పకుండా న‌చ్చుతుంది.

బాద్‌షా అప్‌డేట్స్‌ కోసం తెలుగునౌ.కాం  బ్రౌజ్ చేస్తూనే ఉండండి.

 

NTR Baadshah Movie Review – first on Net

Baadshah Live Updates, Tweet Reveiw

Baadshah Benefit Show Tickets

Baadshah Telugu Movie Review, Baadshah Rating, Baadshah Movie Review, Baadshah Review, NTR Baadshah Review, Jr NTR Baadshah Review, Kajal Agarwal, Badshah Review, Badshah Movie Review, Badshah Telugu Movie Review, Badshah Rating, Badshah Movie Rating, Jr NTR Badshah Review, Jr NTR Badshah Movie Review, Cast and Crew, Kajal agarwal in Badshah

Baadshah Review, Rating | Baadshah Telugu Movie Review | Jr NTR
SwathiBaadshah Telugu Movie Review | Baadshah Rating | Baadshah Movie Review | Baadshah Review | NTR Baadshah Review | Jr NTR Baadshah Review | Kajal Agarwal | Badshah Review | Badshah Movie Review | Badshah Telugu Movie Review | Badshah Rating | Badshah Movie Rating | Jr NTR Badshah Review | Jr NTR Badshah Movie Review | Cast and Crew | Kajal agarwal in Badshah
Baadshah Telugu Movie Review, Baadshah Rating, Baadshah Movie Review, Baadshah Review, NTR Baadshah Review, Jr NTR Baadshah Review, Kajal Agarwal, Badshah Review, Badshah Movie Review, Badshah Telugu Movie Review, Badshah Rating, Badshah Movie Rating, Jr NTR Badshah Review, Jr NTR Badshah Movie Review, Cast and Crew, Kajal agarwal in Badshah