Home / REVIEWS / సత్య 2 : రివ్యూ

సత్య 2 : రివ్యూ

ప్రివ్యూ : ‘సత్య 2′

సత్య .. దర్శకుడు రాంగోపాల్ వర్మ టాలెంట్ ను బాలీవుడ్ తో పాటు యావత్ దేశాని చాటిచెప్పిన చిత్రం. బాలీవుడ్ లో వర్మ కి ఓ రేంజ్ క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం. డైలాగ్ డిక్షన్ లో , కెమరా వర్క్స్ లో , స్క్రీన్ ప్లే లో అప్పటి వరకున్న మూస పద్దతిని మానేసి ఓ కొత్త వరవడికి శ్రీకారం చుట్టాడు వర్మ. అప్పటికి.. ఇప్పటికీ ‘సత్య’ ఓ ట్రెండ్ సెట్ మూవీ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా సత్య2 తెరకిక్కించాడు వర్మ. సత్య 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలోని హైలెట్స్ ప‌రిశీలిస్తే…

* ముంబైలో మాయమైపోయిన మాఫియాను పునరుద్ధరించేందుకు ఓ వ్యక్తి ఏం చేశాడనేది సత్య 2 లో పాయింట్. క్రైమ్ చావదనీ, దాని రూపం మాత్రం మార్చుకుంటుందనీ అడ్వాన్స్‌డ్ స్టోరీ లైన్ తో ‘సత్య 2′ ను తెరకెక్కించారట.

* వర్మకు ఈ చిత్ర చాల కీలకం కానుంది. తాజాగా ‘ముంబాయ్ పై దాడులు’ చిత్రాన్ని రియాలిటి కి దగ్గరగా తెరకెక్కించి తనలోని దర్శక ప్రతిభ ఏమాత్రం తగ్గలేదని విమర్శకుల ప్రశంశలు అందుకున్నాడు. మరీ సత్య 2 ను ఏ రేంజ్ లో తీశాడో చూడాలి.
.
*’సత్య’ పాత్రలో శర్వానంద్‌ నటించాడు. శర్వానంద్‌ నటన గురించి చెప్పనవసరం లేదు. మంచి కధ, కధనం పడితే ఏ పాత్రలోనైనా సర్వానంద్ ఓదిగిపోతాడు. గమ్యం, ప్రస్థానం చిత్రాలు ఇందుకు నిదర్శనం.

* శర్వానంద్‌ సరసన అనైక అనే కొత్త అమ్మాయి నటించింది. ట్రైలర్ లో అకట్టుకుంది. తెర పై ఎలా వుంటుందో చూడాలి.

* ఈ చిత్రం విషయంలో మరో గమనించ దగ్గ విషయం దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ . మంచి సెలెక్షన్ వున్న నిర్మాతగా ‘దిల్’ రాజు కు పేరుంది. దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమాని విడుదల చేయడంతో ‘సత్య2′ లో విషయం వుందని టాక్ వినిపిస్తోంది.

*సత్య అనే టైటిల్ కు ఓ బ్రాండ్ వుంది. అది వర్మ తెచ్చిపెట్టిందే. మరి ఆ బ్రాండ్ కు వర్మ ఎలాంటి న్యాయం చేశాడో శుక్రువారం తెలిపోనుంది.

 

సత్య 2 – చిత్ర కథ

ఈ సినిమా ట్రైలర్ లో చెప్పినట్టు సినిమా ఓపెన్ చెయ్యగానే మన హీరో సత్య కొత్త రకమైన మాఫియా ప్రారంభించడానికి ముంబై వస్తాడు. వచ్చి తన ప్రాణ స్నేహితుడైన నారా దగ్గర ఉంటాడు. సత్య కొంతమంది బిజినెస్ మాన్ లతో కలిసి కొత్త రకమైన మాఫియాని సృష్టించడం మొదలు పెడతాడు. “కంపెనీ” అనే పేరుతో మొదలైన ఈ మాఫియ దేశం మొత్తం వ్యాపిస్తుంది. అదే సమయంలో కంపెనీ వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకోడానికి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ని నియమిస్తుంది. అప్పటినుండి సత్య జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అప్పుడే సత్యకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని తెలుస్తుంది .. సత్య జీవితంలో చోటు చేసుకున్న ఆ సంఘటనలు ఏంటి ? సత్య పోలీస్ ల నుండి తప్పించుకున్నాడా? లేదా? అన్న అంశాలు కావాలంటే ఈ సినిమా చూడండి. హీరో ఫ్లాష్ బ్యాక్ కావాలంటే డైరెక్ట్ గా నెక్స్ట్ పార్ట్ చూడండి….

సత్య 2 – నటీనటుల ప్రతిభ

సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అంటారు, సో ముందు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నుంచి మొదలు పెడదాం.. డిపార్ట్ మెంట్ సినిమాతో సినీ ప్రేక్షకులకి భయాన్ని చూపెట్టిన వర్మ ఈ సినిమాతో పరవాలేదనిపించుకున్నాడు. సినిమాలో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు వర్మ ఈజ్ బ్యాక్ అనే స్థాయిలో ఉన్నాయి కానీ కొన్ని సీన్స్ మాత్రం ఈ మధ్యకాలంలో తను తీస్తున్న సినిమాల్లోలానే తల తోక, తాడు బొంగరం లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా ఇక నుంచి అండర్ వరల్డ్ సినిమాలే చేయనని చెప్పిన వర్మ ఈ సినిమా క్లైమాక్స్ లో అసలు ముగింపే ఇవ్వకుండా తదుపరి పార్ట్ లో చుసుకోమనడం ప్రేక్షకులకి షాక్ ఇచ్చింది.

రోగ్ మెథడాలజీ వాడకుండా ఈ సినిమా తీయడం వల్ల ఈ సినిమా సినిమాటోగ్రఫీ చాలా బాగుందనిపిస్తుంది. పాటలు పరవాలేధనిపించాయి. నేపధ్య సంగీతం విషయానికి వస్తే అవసరమైన కొన్ని సన్నివేశాలకు చాలా బాగా ఇచ్చాడు అలానే కొన్ని అనవసర సన్నివేశాలకు కూడా అదే తరహాలో మ్యూజిక్ ఇవ్వడం కాస్త చిరాకు పెడుతుంది. వర్మ తను తీసిన సినిమాని ఎడిటర్ కట్ చెయ్యకూడదు అనే ఉద్దేశంతో సినిమాని చిన్నదిగా తీయడం వల్ల ఎడిటర్ పెద్దగా కష్టపడలేదు.ఉన్నదాన్ని సీన్ టు సీన్ ఎడిట్ చేసి ఇచ్చేసాడు. హిందీ వెర్షన్ లో డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు పరవాలేధనిపించే స్థాయిలో ఉన్నాయి.

సత్య 2 – సాంకేతికవర్గం పనితీరు

సత్య పాత్రను పోషించిన పుణీత్ సింగ్ రతన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది కాని కొన్ని సన్నివేశాలలో ఎమోషన్స్ సరిగ్గా పండించలేకపోయాడు. అనైక సోటి పాత్రకు ప్రాధాన్యం లేదు కాబట్టి అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చింది. మహేష్ ఠాకూర్ తనకిచ్చిన పాత్రలో పరవలేధనిపించారు. ఆరాధన గుప్తా ఈ సినిమాకి బోనస్ అందాలను పంచి పెట్టింది. మిగిలిన అందరు నటులు టిపికల్ వర్మ స్టైల్ లో నటించారు నటనలో అందరు బాగా నటించారనే చెప్పుకోవచ్చు.

సత్య 2 – చిత్ర విశ్లేషణ

గత కొన్ని చిత్రాలుగా ప్రేక్షకులలో ఒక రకమయిన భయాన్ని నెలకొల్పిన రామ్ గోపాల్ వర్మ మరో చిత్రంతో మన ముందుకి వచ్చారు. “సత్య” – రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పుకోవాలంటే ముందుగా చెప్పుకొనే చిత్రం ఇది, దానికి సీక్వెల్ అనగానే అందరిలో కాకపోయినా కొందరిలో అంచనాలు నెలకొన్నాయి, కాని తీరా తెర మీద చూసాక ఇది సత్య కి కొనసాగింపు కాదు బిజినెస్ మాన్ కి రీమేక్ అని తెలియగానే నిరాశ పడటం ఖాయం. పోనీ బిజినెస్ మాన్ మాత్రమే అనుకుంటే కొన్ని సన్నివేశాలు సర్కార్ నుండి మరి కొన్ని రంగీల నుండి ఇలా అయన సినిమాలను ఆయనే పులిహోర చేసారు. ఇదంతా ఒక ఎత్తయితే గతంలో అడవి కి చేసిన విధంగానే ఈ చిత్రాన్ని అర్ధంతరంగా ముగించేయడం ప్రేక్షకుడికి విసుగు తెప్పించే విషయం. రాధిక ఆనంద్ అందించిన డైలాగ్స్ చాలా బాగున్నాయి.

ఇంటర్వెల్ లో తెచ్చుకున్న పాప్ కార్న్ అయిపోయే లోపు సినిమా అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఎడిటర్ కత్తిరించడానికి కూడా అవకాశం లేనంత చిన్నది గా ఉంటుంది. బిజినెస్ మాన్ లో మహేష్ బాబు నాజర్ తో ఏవైతే డైలాగ్స్ చెప్తాడో అవే డైలాగ్స్ ఇందులో చివర్లో హీరో పోలీస్ తో చెప్తాడు. ఈ చిత్రానికి సత్య 2 అనడం కన్నా “కంపెనీ 2” లేదా “బిజినెస్ మాన్ 2” అని పేరు పెట్టి ఉంటె సరిగ్గా సరిపోయుండేది. చిత్రం ఆసాంతం ఇంటెన్సిటీ బాగున్నా సరయిన సమయంలో ఎలివేషన్ చెయ్యడంలో ఫెయిల్ అవ్వడం తో అప్పటి వరకు పాత్రతో కనెక్ట్ అవ్వడానికి సిద్దంగా ఉన్న ప్రేక్షకుడు నిరాశ చెందుతాడు.

చిత్రంలో ఇలాంటి పరిస్థితి మూడు నాలుగు సార్లు వస్తుంది. ఇంటర్వెల్ ప్రేక్షకులను ఎంగేజ్ చెయ్యగలిగినా దర్శకుడు అదే స్థాయిని రెండవ అర్ధ భాగంలో మెయిన్ టెయిన్ చెయ్యలేకపోయాడు. ఒకే రకమయిన కథను పూరి జగన్నాథ్ “బిజినెస్ మాన్” అని తీస్తే వర్మ “సత్య 2” అని తీసారు కాని టేకింగ్ పరంగా తేడా ఉండటంతో పోలికలు బయటపడవు. తెలుగులో ఈ చిత్రం శనివారం విడుదల అవుతుంది. పాత్ర తీరు తెన్నుల ప్రకారం చూస్తుంటే సత్య పాత్రలో శర్వానంద్ చాలా బాగా ఉంటాడు అనిపిస్తుంది. నిజానికి ఈ చిత్రానికి కరెక్ట్ రివ్యూ రాయాలంటే సత్య 3 కూడా చూడాలి కాని అలా కుదరదు కాబట్టి ఇప్పుడే రాసేయడం జరిగింది….

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top