నటీనటులు : సుమంత్, ఈషా రెబ్బా, సాయి కుమార్, సురేష్, అమిత్ శర్మ, భద్రమ్ తదితరులు
దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి
నిర్మాత : భీరం సుధాకర్ రెడ్డి
సంగీతం : శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫర్ : ఆర్ కె ప్రతాప్
ఎడిటర్ : కార్తికేయ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే : సంతోష్ జాగర్లపూడి
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లగా వచ్చిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
నాస్తికుడైన సుమంత్ దేవాలయాల పరిశోధకునిగా పని చేస్తుంటుంటాడు. అదే సందర్భంలో హీరోయిన్ ఈషా రెబ్బాను ఇష్టపడతాడు. ప్రేమ కోసం ఆమె వెంట పడుతూ సరదాగా ఆట పట్టిస్తుంటాడు. ఈ క్రమంలో మరో పక్క సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తరువాత అసలు సుబ్రహ్మణ్యపురంలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ? ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక ఉన్న రహస్యం ఏమిటో ? మొత్తం పది రోజుల్లో ఛేదిస్తానని సుమంత్ ఛాలెంజ్ చేస్తాడు.
మరి.. సుమంత్ ఆ ఛాలెంజ్ ని ఛేదించడంలో విజయం సాధించాడా..? లేదా ? అయినా సుబ్రహ్మణ్యపురంలో అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు ? చివరకి సుమంత్ ఈ ఆత్మహత్యలకు పరిష్కారం చూపించాడా ? లేడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో నాస్తికుడిగా మరియు దేవాలయాల పరిశోధకుడిగా కనిపించిన సుమంత్ చక్కని నటనను కనబరిచాడు. హీరోయిన్ తో సాగే ప్రేమ సన్నివేశాల్లో కూడా సుమంత్ తన నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న ఆత్మహత్యల రహస్యాన్ని చేధించే సన్నివేశాల్లో కూడా సుమంత్ తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.
ఇక కథానాయకిగా నటించిన ఈషా రెబ్బా ఎప్పటిలాగే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా నటించింది.
అలాగే ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన సాయి కుమార్ తన గాంభీరమైన నటనతో మెప్పించారు. మరో కీలక పాత్ర అయిన హీరోయిన్ ఫాదర్ గా నటించిన సురేష్ కూడా చాలా బాగా నటించాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లోనూ సురేష్ నటన చాలా బాగుంది.
ఇక కమెడియన్ భద్రమ్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించే ప్రయత్నం చేయగా.. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అలాగే సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న ఆత్మహత్యల తాలూకు సన్నివేశాలు కూడా ఆయన ఆకట్టుకునే విధంగా మలిచారు.
మైనస్ పాయింట్స్ :
మంచి కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు ఆ కాన్సెప్ట్ తగట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి. కథనం ఇంకా ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచారు.
అలాగే సుబ్రహ్మణ్యపురంలో అసలు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో అని హీరో చేధించే సన్నివేశాలు ఇంట్రస్టింగ్ గా మొదలైనప్పటికీ.. ఆ ఇంట్రస్ట్ చివరి వరకు మెయింటైన్ అవ్వదు.
పైగా సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. కథలోని మెయిన్ ఎమోషన్ ఇంకా బలంగా ఎలివేట్ అవకాశం ఉన్నట్లు అనిపించడం, సుబ్రహ్మణ్యపురంలో ఆత్మహత్యలు జరగడానికి బలమైన కారణాలను అంతే బలంగా చూపించపోవడం వంటి అంశాలు సినిమా డ్రా బ్యాగ్స్ గా నిలుస్తాయి.
సాంకేతిక విభాగం :
దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోకపోయినా, సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న ఆత్మహత్యల తాలూకు సన్నివేశాలతో ఆయన సినిమాని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు. ఆర్ కె ప్రతాప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.
సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన పాటలు పర్వాలేదనిపస్తాయి. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం మాత్రం కొంతమేరకు ఆకట్టుకుంటుంది. కార్తికేయ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకి తగ్గట్లే ఉంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదనిపిస్తాయి.
తీర్పు :
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లగా వచ్చిన ఈ చిత్రం అక్కడక్కడా కొంత నెమ్మదించినప్పటికీ మొత్తం మీద ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. అయితే సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు సినిమాటిక్ గా అనిపిస్తాయి, అలాగే సుబ్రహ్మణ్యపురంలో ఆత్మహత్యలు జరగడానికి బలమైన కారణాలను అంతే బలంగా చూపించపోవడం వంటి అంశాలు కూడా సినిమాలో డ్రా బ్యాగ్స్ గా నిలుస్తాయి. ఇక దేవాలయాల పరిశోధకుడిగా నటించిన సుమంత్ తన నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఈషా రెబ్బా నటన కూడా చాలా బాగుంది. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా ఈ ‘సుబ్రహ్మణ్యపురం’ అలరిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
‘సుబ్రహ్మణ్యపురం’ : లైవ్ అప్డేట్స్
-
ఒక కీలక ట్విస్ట్ తో చిత్రం క్లైమాక్స్ దిశగా చేరుకుంది.ఈ మొత్తం చర్య వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించి సుమంత్ చక్కటి పరిష్కారం చూపించడంతో కథ సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం ను చూస్తూ ఉండండి.
Date & Time : 08:11 AM December 07, 2018 -
అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవడానికి సుమంత్ ఆ ఆలయంలోకి అడుగుపెట్టాడు.
Date & Time : 07:53 AM December 07, 2018 -
సుబ్రహ్మణ్యపురంలో జరుగుతున్న సంఘటనలు చూసి అక్కడి గ్రామస్థులు భయపడి ఆ గ్రామం వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు.ఆ సంబంధిత సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 07:41 AM December 07, 2018 -
సుమంత్ క్రమక్రమంగా ఈ కేసు వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడం మొదలు పెట్టాడు.ఇప్పుడు యాక్షన్ సన్నివేశం వస్తుంది.
Date & Time : 07:30 AM December 07, 2018 -
మొదటి నుంచే నాస్తికుడైన సుమంత్ ఈ కేసు వెనుక ఉన్న అసలు రహస్యాన్ని 10 రోజుల్లో ఛేదిస్తానని ఛాలెంజ్ చేస్తాడు.
Date & Time : 07:22 AM December 07, 2018 -
సెకండాఫ్ మొదలవ్వడంతోనే మరో ఊహించని ఆత్మహత్యతో మొదలయ్యింది.దీనితో సుమంత్ ఈ కేసును తన చేతుల్లోకి తీసుకుంటాడు.సుమంత్ కి ఇప్పుడు ఉహించని రీతిలో షాకింగ్ ట్విస్ట్ ఎదురయ్యింది.
Date & Time : 07:13 AM December 07, 2018 -
సెకండాఫ్ మీద మరింత ఆసక్తిని పెంచుతూ, ఆత్మహత్యల వెనుక ఉన్న మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇప్పుడు విరామం.
Date & Time : 07:00 AM December 07, 2018 -
సుబ్రహ్మణ్యపురం లోని ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి,అక్కడ అసలు ఏం జరుగుతుంది అన్నది ఒక్కరికి కూడా అంతు చిక్కకుండా ఒక్క ఆధారం కూడా దొరకట్లేదు.
Date & Time : 06:53 AM December 07, 2018 -
సుమంత్,ఈషా మరియు అతని స్నేహితులు ఆ గుడి మీద పరిశోధన చెయ్యడానికి వెళ్తారు.
Date & Time : 06:48 AM December 07, 2018 -
సుమంత్ మరియు ఈషాల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాల నడుమ,రెండవ పాట “ఈ రోజిలా” మొదలయ్యింది.
Date & Time : 06:42 AM December 07, 2018 -
ఒక బాబాగా కమెడియన్ ఆలీ పరిచయం చేయబడ్డారు,కొన్ని హాస్య సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 06:39 AM December 07, 2018 -
ఆ గ్రామంలో ఉత్కంఠభరిత పరిస్థితిలో ఇంకా ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ గా అమిత్ శర్మ పరిచయం అయ్యాడు.
Date & Time : 06:31 AM December 07, 2018 -
సుమంత్ సరదాగా ఈషా వెంటపడుతున్న సీన్లు వస్తున్నాయి.
Date & Time : 06:24 AM December 07, 2018 -
ఇప్పుడే చిత్రంలోని మొదటి పాట సుమంత్ మరియు అతని స్నేహితుల మధ్య “ఫ్రెండ్ షిప్” సాంగ్ మొదలయ్యింది.
Date & Time : 06:14 AM December 07, 2018 -
ఆ గ్రామంలో ఊహించని విధంగా కొన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి,సినిమా ఆసక్తికరంగా కొనసాగుతుంది.
Date & Time : 06:06 AM December 07, 2018 -
సురేష్ కుమార్తెగా హీరోయిన్ ఈషా రెబ్బా పరిచయం అయ్యింది.గుడి రహస్యాలు ఛేదించే పరిశోధకునిగా హీరో సుమంత్ ఎంట్రీ ఇచ్చారు,ఇప్పుడు చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది.
Date & Time : 06:02 AM December 07, 2018 -
హీరో రానా వాయిస్ ఓవర్ తో సుబ్రహ్మణ్యపురం చరిత్రను తెలుపుతూ టైటిల్స్ మొదలయ్యాయి.
Date & Time : 06:00 AM December 07, 2018 -
హాయ్.. 132 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 05:55 AM December 07, 2018
సుబ్రహ్మణ్యపురం రివ్యూ
కథ స్క్రీన్ ప్లే - 2.75
నటీ-నటుల ప్రతిభ - 3.25
సాంకేతిక వర్గం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3
3.1
సుబ్రహ్మణ్యపురం రివ్యూ
సుబ్రహ్మణ్యపురం రివ్యూ
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets

