Templates by BIGtheme NET
Home >> REVIEWS >> వెల్ కమ్ ఒబామ రివ్యూ

వెల్ కమ్ ఒబామ రివ్యూ


welcome-obama-Review

Movie : Welcome Obama
Starring : Rachel, Sanjeev, Urmila
Language : Telugu Genre : Drama
Director : Sangeetham Srinivas Rao
Music Director : Sangeetham Srinivas Rao

ఈ రివ్యూ రాయడానికి ముందు.. ముందుగా సింగీతం శ్రీనివాసరావు గారికి నా వందనాలు. ఆయన లేజండ్రీ డైరెక్టర్, ఆయన పనితనం ఎంతోమందికి స్పూర్తిదాయకం. ఆయన 82 ఏళ్ళ వయసులో కూడా ‘వెల్ కమ్ ఒబామా’ అనే సినిమాని డైరెక్ట్ చేసాడు. ఆయన గతంలో తీసిన ఎన్నో అద్భుతమైన సినిమాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ఈ సినిమా చూడటానికి బాగా ట్రై చేసాను.. చివరిగా సినిమా చూసిన తర్వాత ఎలా ఉన్నా మా అనలాసిస్ మేము పొరపాట్లు లేకుండా రాయాలి కాబట్టి ఇది రాస్తున్నాం. ఇక మీరు ఈ సినిమా గురించి చదవండి..

కథ :

ఈ సినిమాని మరాఠీ సినిమా ” మల అయి వహహిచయ్’ కి రీమేక్ గా నిర్మించడం జరిగింది. కానీ ఈ చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని ముందు నుండి హైలైట్ చేయలేదు. మరాఠీ లో ఈ సినిమాని సమృద్ధి పోరీ దర్శకత్వం వహించడం జరిగింది. తెలుగు వెర్షన్ లో స్క్రీన్ ప్లే కి సాయం కూడా చేసాడు. చాల రోజుల తరువాత ఈ సినిమాని సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించడం జరిగింది.
ఈ సినిమా కథ మొత్తం ఒక గర్బస్థ శిశువు చుట్టూ, ఎమోషనల్ గా సాగుతూ వుంటుంది. లూసీ(రేచల్) ఒక అమెరికన్. ఆమె తన బిడ్డకు ఎవరన్నా తల్లిగా మారి కనిస్తారేమో అని ఓ లేడీ కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక ఏజెంట్ మధ్యవర్తిత్వం వహించి యశోద(ఊర్మిళ కనిత్కర్)ని చూపించడం జరుగుతుంది. యశోదకి తన కూతురి వైద్య ఖర్చుల కోసం డబ్బు అవసరం వుండడంతో ఆ పనికి అంగీకరిస్తుంది.
తరువాత యశోద కూతురు వైద్యపరంగా కాస్త మెరుగవుతుంది, అలాగే లూసీ తనని జాగ్రత్తగా చూసుకుంటూ వుంటుంది. కానీ విది వక్రించడంతో యశోద అనారోగ్యనికి గురవుతుంది. దానితో ఆమె కు పుట్టబోయే బిడ్డ ఏదైనా లోపంతో పుడుతుందనే అనుమానంతో తను కు ఆ బిడ్డ వద్దని, అబార్షన్ చేయించుకోమని చెబుతుంది. దానితో యశోద అబార్షన్ చేయించుకోనని చెప్పి వెళ్ళిపోతుంది.

తరువాత ఆమె ఒక ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుంది. యశోద ఆ బిడ్డని ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఇదిలా కొనసాగుతుండగా తల్లి కొడుకులకు అనుకోని షాక్ తగులుతుంది. లూసీ తిరిగి వచ్చి తన కొడుకుని తనకు ఇవ్వమని అడుగుతుంది. ఈ సమయంలో కన్నతల్లిదండ్రులకు పెంచిన తల్లిదండ్రులకు మద్య జరిగే ఎమోషనల్ పరిణామాలు, ఆ బిడ్డ ఎవరికి చెందుతాడు? ఇవన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాని ఒక నవల ఆదరంగా నిర్మించడం జరిగింది. అందరి నటులలో ఊర్మిళ కనిత్కర్ మాత్రం కాస్త బాగా నటించడం జరిగింది. మరాఠీలో ఆమె యశోద పేరుతో నటించడం జరిగింది. అదేవిదంగా తెలుగులో కూడా అదే పేరుతో నటించింది

మైనస్ పాయింట్స్ :

‘వెల్ కమ్ ఒబామ’ సినిమా దయా దాక్షన్యం లేకుండా, ప్రేక్షకులకి టార్చర్ చేయడానికి సందించిన ఓ బాణం. ఈ సినిమాలో ప్రతిది పెద్దగా వినిపిస్తుంది. అలాగే రేచల్ ‘పోటుగాడు’ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు చాలా హింస పెట్టింది. వెల్ కమ్ ఒబామ’ సినిమాలో ఆమె మరో అడుగు ముందు కేసి ఆమె నటనతో ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది.

ఈ సినిమా టైటిల్ తో సినిమాకి సంబంధం లేదు. పబ్లిసిటికి వాడిన చీప్ ట్రిక్ మాత్రమే. ఈ సినిమా చూస్తుంటే చాలా పెద్దగా వున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ ని చూస్తుంటే ఇప్పటివరకు ఎప్పుడు చూడనట్టు అనిపిస్తుంది.
ఇక ప్రత్యేకంగా ‘కామెడీ’ ట్రాక్ గురించి చెప్పాలంటే పాటల రచయితలు భువన చంద్ర, అనంత శ్రీరామ్ తెలుగు సినిమా చెత్త కామెడీ ట్రాక్ లో అవార్డ్ కోసం పోటిపడి నటించారని అనిపిస్తుంది. భువన చంద్ర భార్యగా నటించిన ఆమె చేసిన నటనని చూసి ఆడియన్స్ తట్టుకోలేరు. .
స్క్రీన్ ప్లే గురించి చెప్పనవసరం లేదు. దాని గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ సినిమా కథలో విషయం ఉన్నప్పటికి ఈ సినిమాని సరిగా తీయడంలో విపలం కావడం, నటీనటుల నటన సరిగా లేకపోవడంతో ప్రేక్షకులను చిరాకు కలుగుతుంది.

ఈ సినిమాలో అన్ని పాటలు చాలా చెత్తగా వున్నాయి. వాటిని తొలగించివుంటే కనీసం సినిమా కాస్త వేగాన్ని పుంజుకునేది. ఈ సినిమాలో చాలా లోపాలు వున్నాయి.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ చాలా చెత్తగా ఉంది. ఈ సినిమాలో చిత్రీకరించిన చాలా బాగం దిశ నిర్దేశం లేనట్టు అనిపిస్తుంది. కలర్ గ్రేడింగ్ కూడా బాగాలేదు. ఎక్కడ కూడా ఈ సినిమాకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గాని హెల్ప్ అవ్వలేదు. ఈ సినిమాలో రోహిణి డైలాగ్స్ ఒకే. స్క్రీన్ ప్లే కూడా చెత్తగా వుండటం, పూర్ పెర్ఫార్మెన్స్ సినిమాకి పెద్ద మైనస్.

ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సంగీతం శ్రీనివాస్ రావు గారి దర్శకత్వం ఏమి బాగోలేదు.

తీర్పు :

రెండవ ఇన్నింగ్స్ లో విజయాలు చాలా అరుదుగా వస్తాయి. వారు చవకబారు తనంతో వారి ఇమేజ్ ని పోగొట్టుకోవడానికి చూడరు. మైఖేల్ స్చుమచేర్ దానికి ఒక మంచి ఉదాహరణ. చాలామంది సింగీతం శ్రీనివాస్ ఇలాంటి సినిమాలు తీస్తారని అనుకోరు. ‘వెల్ కమ్ ఒబామ’ చాలా చెత్త సినిమా. ఇది ప్రేక్షకులకు నచ్చదు.

Source: 123telugu

 

 

Welcome Obama Movie Live Updates in Telugu…

Updated at 11:35 AM

సినిమా క్లైమాక్స్ కు చేరుకుంటుంది .. న్యాయ పోరాటం జరుగుతుంది

Updated at 11:25 AM

ఇప్పుడు పిల్లల సాంగ్ ” ఐ ఆమ్ ఏ హీరో “.. మాటల్లేవ్.. మాట్లడుకోవటాలులేవ్..

Updated at 11:14 AM

కామెడీ లేని కామెడీ సన్నివేశాలు స్టార్ట్ అయ్యాయి

Updated at 11:05 AM

పాటల రచయిత అనంత శ్రీరాం తెరపైకి వచ్చాడు

Updated at 11:00 AM

భారమైన ఉద్వేగపూరిత సన్నివేశాలు జరుగుతున్నాయి

Updated at 10:45 AM

ఇప్పుడు ఇంటర్వెల్ .. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు

Updated at 10:36 AM

ఇప్పుడు ఇంకో సాంగ్ “బుజ్జి బుజ్జి అడుగులతో ” వస్తుంది .. తల్లీ బిడ్డల పై చిత్రీకరించారు

Updated at 10:32 AM

సరోగేట్ మదర్ తనకోసం తప్పించుకుంది .. ఇప్పుడా బేబీ బాద్యత ఆమెదే

Updated at 10:20 AM

ఇప్పుడు సెకండ్ సాంగ్ “ఓ గాడ్ ఓ గాడ్ ” వస్తుంది .. సినిమా లో* *ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలు లేవు ..

Updated at 10:10 AM

రేచెల్ సంతానానికి యశోద అనే పల్లెటూరు స్త్రీ సరోగేట్ మదర్ అయ్యింది .. సినిమా ఈ విషయం చుట్టూ తిరుగుతుంది.. పల్లెటూరు జీవన విధానాన్ని చూపిస్తున్నారు

Updated at 09:59 AM

ఇప్పుడు మొదటి సాంగ్ “పుట్టింది పాల కడలిలో” వస్తుంది

Updated at 09:51 AM

ఈ సినిమా* *కృత్రిమ గర్భం మరియు విట్రోఫెర్టి లైజేషన్ గురించి

Updated at 09:40 AM

హీరో, హీరోయిన్ తెరకు పరిచయమయ్యారు . . హీరోయిన్ రేచెల్, బ్రిటీష్ అమ్మాయి

Updated at 09:39 AM

అందమైన గోదావరి అందాల నడుమ సినిమా మొదలయ్యింది

వెల్ కమ్ ఒబామ రివ్యూ: చిత్రకథ 
Coming Soon….

వెల్ కమ్ ఒబామ రివ్యూ: నటీనటుల ప్రతిభ
Coming Soon….

వెల్ కమ్ ఒబామ రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

Coming Soon….

వెల్ కమ్ ఒబామ రివ్యూ: హైలెట్స్

  • Coming Soon….

వెల్ కమ్ ఒబామ రివ్యూ: డ్రా బాక్స్

  • Coming Soon….

వెల్ కమ్ ఒబామ రివ్యూ: విశ్లేషణ

Coming Soon….

వెల్ కమ్ ఒబామ రివ్యూ: చివరగా
Coming Soon….

 

Welcome Obama Movie Review in English

Welcome Obama Review,Welcome Obama Rating,Welcome Obama Movie Review,Welcome Obama Movie Rating,Welcome Obama Telugu Movie Review,Welcome Obama Telugu Movie Rating,