‘నేను ప్రామిస్ చేసినట్లు నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తాను’

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. కోవిడ్ – 19 నిబంధనలను అనుసరిస్తూ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో చిత్రీకరణను ప్రారంభించేశారు రాజమౌళి. ఈ నేపథ్యంలో ఓ వీడియోను విడుదల చేస్తూ.. సినిమా కోసం ఉపయోగిస్తున్న వెపన్స్ మరియు వెహికల్స్ ని చూపించారు. […]