Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Sreekaram Subhakaram 14th Sept 2014

Sreekaram Subhakaram 14th Sept 2014


Srikaram Subhakaram 14th Sept 2014

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (14th Sept 2014   –    21st Sept 2014)

మేషం

చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులే శత్రువులుగా మారే సమయం. ఆలోచన లు కార్యరూపం దాల్చడంలో ప్రతిబంధకాలు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రతిభాపాటవాలు ఉన్నా గుర్తింపు పొందలేరు.

వివాదాలకు ఎంతదూరంగా ఉంటే అంతమంచిది. చర్మ, గొంతుసంబంధిత రుగ్మతలు.

ఇంటాబయటా మిమ్మల్ని వ్యతిరేకించేవారు పెరుగుతారు. వ్యాపారాలు ఆశించిన లాభాలు అందుకోవడంలో శ్రమపడాలి. ముఖ్యంగా ఆయిల్, ఇనుము వ్యాపారులు మరింత కష్టపడాలి. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు చేజారి నిరాశ కలిగిస్తాయి. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు రద్దుచేసుకుంటారు.

కళాకారులు అవకాశాలు సైతం తప్పిపోయి నిరుత్సాహపడతారు. రాజకీయవర్గాలు పదవులపై పెట్టుకున్న ఆశలు నీరుగారిపోతాయి. విద్యార్థులకు నూతనవిద్యావకాశాలుకాస్త నిరుత్సాహపరుస్తాయి. మహిళలు ప్రతివ్యవహారంలోనూ నిదానం అవసరం. మాటపడతారు. షేర్లవిక్రయాల్లో లాభాలు కష్టమే.

తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. అశ్వని వారికి సోమవారం అద్భుతమైన రోజు.కార్యజయం.శుభవర్తమానాలు. గురువారం ఈతిబాధలు. అనారోగ్యసూచనలు. భర ణి వారికి ఆదివారం విశేషకాలం. ధన,వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. శుక్రవారం మానసిక ఆందోళన. డబ్బు కోసం ఇబ్బంది. ఆరోగ్యసమస్యలు. కృత్తిక 1వ పాదంవారికి సోమవారం కలిసివచ్చేకాలం. ధనలాభం. పనుల్లోపురోగతి. శనివారం కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆర్థిక ఇబ్బందులు.

 

వృషభం

ఆర్థికంగా బలం చేకూరుతుంది. చేపట్టిన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. అనుకున్నది సాధిస్తారు.

వ్యాపారాల విస్తరణయత్నాలు ముమ్మరం చేస్తారు. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఊహించని రీతిలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. విధి నిర్వహణలో ప్రోత్సాహం. పారిశ్రామికవేత్తలు విదేశాల్లో సంస్థల ఏర్పాటులో శుభవార్తలు. కళాకారులు సన్మానాలు పొందుతారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు సాంకేతిక, పరిశోధన విషయాలలో ఆసక్తి చూపుతారు. మహిళలు ద్విగుణీ కృత ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు.

షేర్లవిక్రయాలు అధికంగా లాభిస్తాయి. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కృత్తిక 2,3,4పాదాల వారికి సోమవారం కలిసివచ్చేకాలం. ధనలాభం. పనుల్లోపురోగతి. శనివారం కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆర్థిక ఇబ్బందులు. రోహిణి వారికి మంగళవారం అనుకూలం. కొత్త ఆశలు. పనుల్లో విజయం. శుక్రవారం మానసిక అశాంతి. అనారోగ్యం. దూరప్రయాణాలు. మృగశిర 1,2పాదాల వారికి బుధవారం ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. శనివారం గందరగోళం. ఇంటాబయటా ఒత్తిడులు.

మిథునం

దీర్ఘకాలిక రుణబాధలు తప్పవు. కుటుంబసభ్యులతో అకారణంగా వైరం. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా మెలగండి.

సంగీత,సాహిత్యరంగాలపై ఆసక్తిచూపుతారు. ఆభరణాలు, వాహనాలు జాగ్రత్తగా చూసుకోండి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ప్రతిభాపాటవాలు ఉన్నా గుర్తింపు కష్టమే. వ్యాపారాలు సామాన్యంగాఉంటాయి. అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు విధి నిర్వహ ణలో పొరపాట్లు దొర్లుతాయి. కళాకారులకు నిరాశ తప్పదు. రాజకీయవర్గాలకు వ్యవహారాలు అనుకూలించవు.

విద్యార్థుల అంచనాలుతప్పుతాయి. మహిళలకు కుటుంబసభ్యులు, జీవిత భాగస్వామితో వివాదాలు.

షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సత్యనారాయణస్వామిని పూజించండి. మృగశిర 3,4పాదాల వారికి బుధవారం ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. శనివారం గందరగోళం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరుద్రవారికి ఆదివారం అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. ఆరోగ్యభంగం. గురువారం ఆస్తి, ధనలాభాలు. కార్యసిద్ధి. పునర్వసు1, 2,3పాదాల వారికి గురువారం అనుకూలం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం.శుభవార్తలు. శనివారం మానసిక అశాంతి. పనుల్లో ఆటంకాలు.

మిథునం

దీర్ఘకాలిక రుణబాధలు తప్పవు. కుటుంబసభ్యులతో అకారణంగా వైరం. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా మెలగండి.

సంగీత,సాహిత్యరంగాలపై ఆసక్తిచూపుతారు. ఆభరణాలు, వాహనాలు జాగ్రత్తగా చూసుకోండి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ప్రతిభాపాటవాలు ఉన్నా గుర్తింపు కష్టమే. వ్యాపారాలు సామాన్యంగాఉంటాయి. అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు విధి నిర్వహ ణలో పొరపాట్లు దొర్లుతాయి. కళాకారులకు నిరాశ తప్పదు. రాజకీయవర్గాలకు వ్యవహారాలు అనుకూలించవు.

విద్యార్థుల అంచనాలుతప్పుతాయి. మహిళలకు కుటుంబసభ్యులు, జీవిత భాగస్వామితో వివాదాలు.

షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సత్యనారాయణస్వామిని పూజించండి. మృగశిర 3,4పాదాల వారికి బుధవారం ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. శనివారం గందరగోళం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరుద్రవారికి ఆదివారం అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. ఆరోగ్యభంగం. గురువారం ఆస్తి, ధనలాభాలు. కార్యసిద్ధి. పునర్వసు1, 2,3పాదాల వారికి గురువారం అనుకూలం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం.శుభవార్తలు. శనివారం మానసిక అశాంతి. పనుల్లో ఆటంకాలు.

కర్కాటకం

అదనపు ఆదాయం సమకూరుతుంది. శ్రేయోభిలాషులు అన్నింటా సహకరిస్తారు. పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు.

నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. ఆద్యాత్మిక కార్యక్రమాలల్లో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు దక్కుతాయి. రాజకీయవేత్తలు అనుకోని సన్మానాలు. పదవియోగం. కళాకారులు అవార్డులు దక్కించుకుంటారు. విద్యార్థులకు కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి.

పారిశ్రామికవేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటులో ఆటంకాలు తొలగుతాయి. మహిళలు ప్రత్యేక గౌరవం పొందుతారు. ప్రతిభతో గుర్తింపు పొందుతారు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్ చాలీసా పఠించండి. పునర్వసు 4వ పాదం వారికి గురువారం అనుకూలం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం.శుభవార్తలు. శనివారం మానసిక అశాంతి. పనుల్లో ఆటంకాలు. పుష్యమివారికి మంగళవారం కార్యక్రమాలలో అవరోధాలు. ఇంటాబయటా సమస్యలు. శనివారం యత్నకార్యసిద్ధి. నూతనపరిచయాలు.

ఆశ్లేష వారికి ఆదివారం ధనలాభం. వివాదాల పరిష్కారం. బుధవారం కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం.

సింహం

వ్యూహాత్మకంగా వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్టలకు లోటు ఉండదు.

కుటుంబసభ్యులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.

చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీమార్గం అనుసరిస్తారు.

వ్యాపారాలు….కొత్త వ్యాపారాలు చేపట్టి విజయవంతంగా దూసుకువెళతారు. ఉద్యోగులకు ఊహించని రీతిలో ఇంక్రిమెంట్లు లబిస్తాయి. రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయి. కొందరికి సన్మానాలు. కళాకారులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు కోరుకున్న రీతిలో అవకాశాలు దక్కుతాయి. మహిళలకు జీవితాశయం నెరవేరే సమయం. బంధువులతో చర్చలు జరుపుతారు.

షేర్లు క్రయవిక్రయాలు లాభసాటిగానే ఉంటాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీహయగ్రీవస్తోత్రాలు పఠించండి. మఖ వారికి బుధవారం అనుకూలం. కొత్త ప్రయత్నాలు సఫలం. శుభవార్తలు.  శుక్రవారం అనుకోని ప్రయాణాలు. పనులు వాయిదా. శ్రమ తప్పదు. పుబ్బ వారికి ఆదివారం అనుకూలసమయం. రాబడి పెరుగుతుంది. కార్యజయం. సోమవారం ఈతిబాధలు. ప్రయాణాలలో అవరోధాలు. ఉత్తర 1వ పాదంవారికి బుధవారం పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. శనివారం కుటుంబసమస్యలు. మానసిక ఆందోళన.

కన్య

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.

ఒక సమస్య సానుకూలంగా పరిష్కారం. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.

ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుకుంటారు. ఆయిల్, సిమెంట్, కాగితం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగుల అంచనాలు నిజమవుతాయి. విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయవర్గాలకు అప్రయత్నంగా పదవీయోగం. సన్మానాలు. కళాకారులు విదేశీ పర్యటనలు చేస్తారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.

విద్యార్థులు పురస్కారాలు పొందుతారు. పారిశ్రామికవేత్తలకు కంపెనీల ఏర్పాటులో ఆటంకాలు తొలగుతాయి.

మహిళలు తమకంటూ ప్రత్యేకత చాటుకుంటారు. నూతన ఉద్యోగవకాశాలు. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. ఉత్తర 2,3,4పాదాల వారికి బుధవారం పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. శనివారం కుటుంబసమస్యలు. మానసిక ఆందోళన.

హస్త వారికి మంగళవారం ఆస్తిలాభం.యత్నకార్యసిద్ధి. శుక్రవారం కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. చిత్త 1,2పాదాల వారికి బుధవారం ఆకస్మికధనలబ్ధి. ఆహ్వానాలు. ఉద్యోగయోగం. శనివారం ప్రయాణాలలో ఆటంకాలు. వృథాఖర్చులు.

తుల

ఆదాయం నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు నత్తనడకనే సాగుతాయి. నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. వ్యవహారాల్లో నిరాశ తప్పదు. స్థిరాస్తుల విషయంలో కుటుంబసభ్యులతో తగాదాలు.

ఆకస్మిక ప్రయాణాలు.  కుటుంబంలో చికాకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. పెట్టుబడులలో తొందరవద్దు. పారిశ్రామికవేత్తలు విదేశాల్లో సంస్థల ఏర్పాటులో అంతరాయాలు. ఉద్యోగులకు ప్రయత్నాలు అనుకూలించవు. వ్యయప్రయాసలు. కళాకారులకు అవకాశాలు దక్కినా నిరుత్సాహం తప్పదు. విద్యార్థులు ముఖ్య నిర్ణయాలలో ఆలోచించి ముందుకు సాగండి. మహిళలు కాస్త నిదానంగా వ్యవహరించాలి. వివాదాలు నెలకొంటాయి. షేర్ల విక్రయాలలో లాభాలు అనుమానం.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి. చిత్త 3,4పాదాల వారికి బుధవారం ఆకస్మికధనలబ్ధి. ఆహ్వానాలు. ఉద్యోగయోగం. శనివారం ప్రయాణాలలో ఆటంకాలు. వృథాఖర్చులు. స్వాతి వారికి ఆదివారం మానసిక అశాంతి. ఆరోగ్యం మందగిస్తుంది. గురువారం ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరియాలు. వివాదాల పరిష్కారం.  విశాఖ 1,2,3పాదాల వారికి సోమవారం కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శుక్రవారం ముఖ్యసమాచారం. ఇంటర్వ్యూలు అందుకుంటారు.

వృశ్చికం

పనుల్లో జాప్యం. తల్లితరఫు వారితో విభేదాలు. రాబడి అంతగా ఉండదు. సమస్యల మరింత వేధిస్తాయి.

ఆరోగ్య సమస్యలు తప్పవు. కాంట్రాక్టర్లు ఆశానిరాశల మధ్య కొట్టుమిట్టాడుతారు. ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపార విస్తరణయత్నాలు వాయిదా పడతాయి. అందిన లాభాలతో సంతృప్తి చెందాలి. ఉద్యోగులు ఊహించని విధంగా బదిలీలు ఉండవచ్చు. కళాకారులు కొత్త అవకాశాల కోసం ఆశగా నిరీక్షించాలి. పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. ఒడిదుడుకుల నుంచి బయటపడేందుకు యత్నిస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం తప్పదు. మహిళలకు ఇంటాబయటా విమర్శలు తప్పవు. షేర్ల విక్రయాలు మిశ్రమంగా ఉంటాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి. విశాఖ 4వ పాదం వారికి సోమవారం కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శుక్రవారం ముఖ్యసమాచారం. ఇంటర్వ్యూలు అందుకుంటారు. అనూరాధ వారికి ఆదివారం కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. శనివారం శుభవార్తలు. ఆర్థిక ప్రగతి.

జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆదివారం ముఖ్యసమాచారం. వాహనయోగం. బుధవారం దూరప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు.

 

ధనుస్సు

పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు.

వాహనాలు, స్థలాలుకొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి.పెట్టుబడులు సైతం అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. కళాకారులకు సన్మానాలు, రివార్డులు దక్కుతాయి. విద్యార్థులకు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించే సమయం. మహిళలకు అన్నింటా విజయం మీదే. షేర్ల విక్రయాలు లాబిస్తాయి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మూల నక్షత్రం వారికి సోమవారం  ధనలాభం. యత్నకార్యసిద్ధి. గురువారం ఆరోగ్యసమస్యలు. ఇంటాబయటా చికాకులు. పూర్వాషాఢ వారికి ఆదివారం ఆకస్మిక ధన,వస్తులాభాలు. కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు.

ఉత్తరాషాఢ 1వ పాదం వారికి బుధవారం పనుల్లో విజయం. ఆస్తిలాభం. శనివారం పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం.

 

మకరం

అదనపు ఆదాయం సమకూరి ఉత్సాహంగా గ డుపుతారు. తీర్థయాత్రలు తరచూ చేస్తారు. ఇంటిలో శుభకార్యాల హడావిడి నెలకొంటుంది. స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు.

వాహన, కుటుంబసౌఖ్యం. చర్మసంబంధిత రుగ్మతలు కొంత బాధిస్తాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.

వ్యాపారులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. బంగారం, వస్త్రవ్యాపారాలు మరింత లాభిస్తాయి.

ఉద్యోగులు వివాదాల నుంచి గట్టెక్కి, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. సన్మానాలు. కళాకారులకు ఊహించని విధంగా అవకాశాలు తలుపుతడతాయి. విద్యార్థులు కొత్త కోర్సులు దక్కి ఊరట చెందుతారు. మహిళలకు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించే సమయం. మంచి గుర్తింపు లభిస్తుంది. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకుంటే మంచిది. ఉత్తరాషాఢ 2,3,4పాదాల వారికి  బుధవారం పనుల్లో విజయం. ఆస్తిలాభం. శనివారం పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రవణం వారికి మంగళవారం నూతన పరిచయాలు. అనుకోని సన్మానాలు. శుక్రవారం మానసిక అశాంతి. అనుకోని సంఘటనలు.

ధనిష్ఠ 1,2పాదాల వారికి శుక్రవారం శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. శనివారం అనారోగ్యం. కుటుంబంలో కలహాలు.

కుంభం

ఈ వారం అన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటిలో ఏమి మాట్లాడినా విరోధాలు ఏర్పడతాయి.

తొందరపాటు నిర్ణయాలు వద్దు, చిక్కులు ఎదురవుతాయి. నరాల బలహీనత వంటి రుగ్మతలు.

తీర్థయాత్రలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు.

కొన్ని పనులను హఠాత్తుగా వాయిదా వేస్తారు. వ్యాపారాలు ముఖ్యంగా సిమెంట్, కలప, కాగితం, ఫ్యాన్సీ వ్యాపారాలు మినహా మిగతా వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులు ఉన్నతస్థాయి ఆదే శాలు పాటించడం ఉత్తమం.  పనిభారం పెరుగుతుంది. విద్యార్థులకు అందివచ్చిన అవకాశాలు సైతం చివరి క్షణంలో తప్పిపోతాయి.

పారిశ్రామికవేత్తలకు విదేశీయానం వాయిదా. శ్రమ పెరుగుతుంది. కళాకారులకు కొత్త ఆశలు చిగురించినా లోలోపల నిరుత్సాహంతో ఉంటారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. షేర్ల విక్రయాల్లో లాభాలు కష్టమే. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. షిర్డీసాయిని పూజించండి. ధనిష్ఠ 3,4పాదాల వారికి శుక్రవారం శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. శనివారం అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. శతభిషం వారికి ఆదివారం వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. గురువారం ఉత్సాహవంతంగా ఉంటుంది. ధనలాభం. యత్నకార్యసిద్ధి.  పూర్వాభాద్ర 1,2,3పాదాల వారికి సోమవారం చికాకులు. ధననష్టం. కుటుంబంలో సమస్యలు. శుక్రవారం వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి.

 

మీనం

ఆర్థిక పరిస్థితి గతం కంటే నిరాశాజనకంగా ఉంటుంది. ఆప్తుల నుంచి అందాల్సిన సహాయం అందక తికమక పడతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మీ నిర్ణయాల పట్ల కుటుంబసభ్యులు వ్యతిరేకత చూపే అవకాశం.

సోదరులు, సోదరీలతో విభేదాలు నెలకొంటాయి. కోర్టు కేసులకు హాజరవుతారు. దేవాలయాలు సందర్శిస్తారు.

విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. వ్యాపారాలలో భాగస్వాములతో తగాదాలు ఏర్పడతాయి. ముఖ్యంగా సిమెంట్, ఆయిల్, వ్యవసాయపరికరాలు, ఆటోమొబైల్ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. ఉద్యోగులు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు అంచనాలు తప్పి నిరాశ కలిగిస్తాయి. ప్రభుత్వపరంగా అందవలసిన అనుమతుల్లో జాప్యం. కళాకారులకు అవకాశాలు చివరి నిమిషంలో చేజారతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల కోసం చేసే యత్నాలు ముందుకు సాగవు. మహిళలకు శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులే మీపై విమర్శలు చేయవచ్చు. షేర్ల విక్రయాలలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగండి.

ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి  సోమవారం చికాకులు. ధననష్టం. కుటుంబంలో సమస్యలు. శుక్రవారం వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. ఉత్తరాభాద్ర వారికి మంగళవారం చికాకులు. బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. శనివారం శుభవర్తమానాలు. ధన,వస్తులాభాలు. రేవతి వారికి ఆదివారం శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. బుధవారం ఆకస్మిక ప్రయాణాలు. మానసిక ఆందోళన.

Tags : Sreekaram Subhakaram 14th Sept 2014, srikaram subhakaram zee telugu program, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 14th Sept 2014, srikaram subhakaram zee telugu,