Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 22nd June 2014

Srikaram Subhakaram 22nd June 2014


Srikaram Subhakaram 22nd June 2014

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (22nd June 2014   –    28th June 2014)

మేషం…     

 —–

 మీరు ఊహించని విధంగా కార్యక్రమాలు పూర్తి కాగల అవకాశం.

 బంధువులు సైతం సమస్యల పరిష్కారంలో చేయూతనిస్తారు.

 ఆస్తివ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు.

 ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

 భవిష్యత్‌పై నిరుద్యోగులకు కొత్త ఆశలు.

 వాహనాలు, ఆభరణాలు కొంటారు.

 అందరి దృష్టిని ఆకర్షించే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

 భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి.

 వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు.

 ఉద్యోగులకు నూతనోత్సాహం. పదోన్నతులు.

 రాజకీయవర్గాలకు అవకాశాలు దగ్గరకు వస్తాయి.

 కళాకారులు ఊహించని రీతిలో అవార్డులు పొందుతారు.

 మహిళలకు మానసిక స్థైర్యం కలుగుతుంది.

 బుధ,గురువారాలలో చికాకులు. అనారోగ్యం. బంధువిరోధాలు.

 పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

 దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృషభం…

 ——-

 ఈవారం అనుకున్న పనులు మందకొడిగా సాగుతాయి.

 ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించని పరిస్థితి.

 ఆలోచనలు స్థిరంగా ఉండవు.

 ఆస్తి వ్యవహారంలో చికాకులు తప్పవు.

 ఒక సంఘటన కొంత కలవరపరుస్తుంది.

 బంధువులతో తగాదాలు.

 ఆరోగ్యపరంగా చికాకులు.

 భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు.

 విలువైన వస్తుసామగ్రి జాగ్రత్తగా చూసుకోండి.

 ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

 వ్యాపారాలు అంతగా లాభించవు.

 ఉద్యోగులకు మార్పులు తథ్యం.

 పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరుత్సాహమే.

 కళాకారులు ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి.

 మంగళ, బుధవారాలలో ఆకస్మిక ధనలాభం, ప్రముఖులతో పరిచయాలు.

 దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

 ఆంజనేయునికి అర్చన చేయించుకుంటే మంచిది.

మిథునం…

 ——-

 అంచనాలు నిజమవుతాయి.

 ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.

 ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

 మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి.

 ఇంతకాలం చికాకు పర్చిన సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

 విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు.

 చాకచక్యంగా ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు.

 వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు.

 గత స్మృతులను నెమరువేసుకుంటారు.

 జీవితభాగస్వామితో నెలకొన్న వివాదాలు పరిష్కారం.

 ఆరోగ్యపరంగా కొంత చికాకులు తప్పకపోవచ్చు.

 వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి.

 ఉద్యోగులకు కొత్త హోదాలు రాగల అవకాశం.

 పారిశ్రామిక, వైద్యరంగాల వారికి యోగవంతమైన కాలమనే చెప్పాలి.

 కళాకారులకు గౌరవ పురస్కారాలు, సన్మానాలు.

 బుధ, గురువారాలలో మానసిక ఆందోళన. ఆస్తి వివాదాలు. ధననష్టం.

 తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

 విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం…

 ——-

 ఈవారం అనూహ్యమైన రీతిలో కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

 ఆత్మీయులు అన్ని విధాల సహకరిస్తారు.

 చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

 కాంట్రాక్టులు పొందుతారు.

 జీవితాశం నెరవేరుతుంది.

 ఇంటిలో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.

 ఇంటి నిర్మాణాలు చేపడతారు.

 గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.

 రాబడి పెరుగుతుంది.

 వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

 ఉద్యోగులకు కొత్త హోదాలు సంతృప్తినిస్తాయి.

 రాజకీయవర్గాలకు పదవీయోగం.

 కళాకారులకు అందిన అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి.

 మహిళలు కుటుంబసమస్యలు పరిష్కారంలో చొరవ చూపుతారు.

 శుక్ర,శనివారాలలో దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు.

 పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

 అంగారస్తోత్రం పఠించండి.

సింహం…

 ——-

 పనులు చకచకా పూర్తి చేస్తారు.

 ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.

 ఇంటాబయటా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

 బంధువుల నుంచి శుభవర్తమానాలు.

 ఇంతకాలం వేధిస్తున్న సమస్యలు కొన్ని పరిష్కారం.

 భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు.

 మీ ఆశయాలు నెరవేరతాయి.

 ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుకుంటారు.

 వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు తొలగుతాయి.

 ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

 పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు.

 కళాకారులకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందుతాయి.

 మహిళలకు కుటుంబంలో గౌరవం మరింతగా పెరుగుతుంది.

 ఆది, సోమవారాలలో దూరప్రయాణాలు. అనారోగ్యం. భార్యాభర్తల మధ్య తగాదాలు.

 తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

 ఆదిత్య హృదయం పఠించండి.

కన్య…

 ——

 ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణాలు సైతం చేస్తారు.

 తొందరపాట మాటల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

 ఆలోచనలు అంతగా కలసిరావు.

 ఇంటాబయటా వ్యతిరేకత పెరుగుతుంది.

 విలువైన డాక్యుమెంట్లు, ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి.

 వివాదాలకు దూరంగా ఉండండి.

 బాధ్యతలు కత్తిమీద సాముగా మారతాయి.

 ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

 భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం.

 వ్యాపారాలు ముందుకు సాగవు.

 ఉద్యోగులకు అనుకోని మార్పులు.

 రాజకీయవర్గాలకు నిరుత్సాహం.

 కళాకారులకు ఒత్తిళ్లు పెరుగుతాయి.

 మహిళలకు నిర్ణయాలలో ఆచితూచి అడుగువేయాలి.

 శుక్ర, శనివారాలలో ధనలబ్ధి. కుటుంబంలో శుభకార్యాలు. ఆహ్వానాలు అందుతాయి.

 పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

 హనుమాన్ చాలీసా పఠించండి.

తుల…

 ——

 ఆదాయం అంతగా కనిపించదు.

 రుణదాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

 కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు.

 విలువైన వస్తువులు చేజారతాయి.

 ఆలోచనలు స్థిరంగా ఉండవు.

 బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

 ఆస్తి వివాదాలు నెలకొంటాయి.

 ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి.

 ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.

 వ్యాపారాలు సామాన్యమే.

 ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు.

 పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది.

 కళాకారులకు అవకాశాలు చే జారతాయి.

 భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది.

 ఆది, సోమవారాలలో శుభవార్తలు. ఆకస్మిక ధన లాభం. యత్నకార్యసిద్ధి.

 దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

 దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోండి.

వృశ్చికం…

 ——-

 శుభకార్యాలు నిర్వహణలో నిమగ్నమవుతారు.

 ఆత్మీయులు మరింతగా దగ్గరవుతారు.

 సేవాభావం పెరుగుతుంది.

 సన్నిహితులతో వివాదాలు సమసిపోతాయి.

 ప్రయాణాలలో కొత్త పరిచయాలు.

 సంఘంలో గౌరవానికి లోటు ఉండదు.

 ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.

 ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం.

 విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు.

 భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారం.

 వ్యాపారాలు విస్తరిస్తారు.

 ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం.

 పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు.

 కళాకారులకు పట్టిందిబంగారమే.

 మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

 శుక్ర, శనివారాలలో ధననష్టం. కుటుంబసమస్యలు. వివాదాలు.

 ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

 శివస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు..

 ——-

 కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

 బంధువులతో వివాదాలు తీరతాయి.

 కాంట్రాక్టులు పొందుతారు.

 అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తారు.

 నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.

 ఇంతకాలం వేధించిన సమస్య నుంచి బయటపడతారు.

 వాహనాలు, ఆభరణాలు కొంటారు.

 ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు.

 వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.

 ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి.

 పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నూతనోత్సాహం.

 కళాకారులకు సన్మానాలు.

 మహిళలు కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.

 ఆది,సోమవారాలలో దూరప్రయాణాలు. అనారోగ్యం, ఔషధసేవనం. చోరభయం.

 తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

 గణపతికి అర్చన చేయించుకుంటే మంచిది.

మకరం…

 ——

 ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. తద్వారా రుణయత్నాలు.

 పనుల్లో ఆటంకాలు.

 ప్రయాణాలు చివరిలో రద్దు చేసుకుంటారు.

 కష్టపడ్డా ఫలితం కనిపించదు.

 భార్యాభర్తల మధ్య తగాదాలు నెలకొంటాయి.

 విలువైన వస్తువులు, వాహనాలు జాగ్రత్త.

 ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

 మీ శ్రమవృథా కాగలదు.

 చర్మ, గొంతు సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

 మీ అంచనాలు, ఊహలు తప్పుతాయి.

 ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.

 వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు.

 ఉద్యోగులకు స్థానమార్పులు.

 రాజకీయవర్గాలకు నిరుత్సాహం.

 కళాకారులకు అవకాశాలు అంతగా కనిపించవు.

 మహిళలకు నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి.

 శుక్ర, శనివారాలలో విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కుటుంబసౌఖ్యం.

 పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

 విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

కుంభం…

 ——-

 ఈవారం అనుకున్న కార్యక్రమాలలో జాప్యం.

 దూరప్రయాణాలు చేస్తారు.

 ఆత్మీయులు సైతం మీపట్ల కొంత అయిష్టత చూపుతారు.

 వాహనాలు, ఆభరణాలు జాగ్రత్త.

 కష్టానికి తగ్గ ఫలితం ఉండదు.

 ఆస్తి విషయాలలో సోదరవర్గంతోకలహాలు.

 ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.

 ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు.

 బంధువులను కలుసుకుని ముఖ్యవిషయాలు చర్చిస్తారు.

 భార్యాభర్తల మధ్య కలహాలు.

 వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. లాభాలు కష్టమే.

 ఉద్యోగులకు స్థానచలనం.

 పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

 కళాకారుల ఆశలు ఫలించవు.

 మహిళలకు నిరుత్సాహం.

 ఆది, సోమవారాలలో పనుల్లో విజయం. శుభవర్తమానాలు. ధనలాభం.

 ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం.

 హనుమాన్ చాలీసా పఠించండి.

మీనం…

 —–

 ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది.

 పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి.

 శ్రమ తప్ప ఫలితం అంతగా ఉండదు.

 ఒక సమాచారం కొంత ఆందోళన పరుస్తుంది.

 జీవిత భాగస్వామితో విభేదాలు నెలకొంటాయి.

 వివాదాలకు మరింత దూరంగా ఉండండి.

 బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

 బందువుల నుంచి విమర్శలు ఎదురవుతాయి.

 వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. లాభాలు ఆశించినంతగా ఉండవు.

 ఉద్యోగులకు నిరాశ తప్పదు.

 రాజకీయవర్గాలకు పదవులు చేజారతాయి.

 కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి.

 మహిళలకు మానసిక అశాంతి, కుటుంబసమస్యలు.

 మంగళ, బుధవారాలలో విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వస్తులాభాలు.

 దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

 గాయత్రీ ధ్యానం మంచిది.

Tags: srikaram subhakaram zee telugu program, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 22nd June 2014, srikaram subhakaram zee telugu,