Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 29th June 2014

Srikaram Subhakaram 29th June 2014


Srikaram Subhakaram 29th June 2014

రాశి ఫలాలు

by Vakkantam Chandra Mouli, janmakundali.com

Weekly Horoscope (29th June 2014   –    5th July 2014)

మేషం..

 —-

 మీపై మరిన్ని బాధ్యతలు పెరిగే అవకాశం.

 అన్నింటా జోక్యం వద్దు, సమస్యలు ఎదురుకావచ్చు.

 బంధుగణంతో అకారణంగా తగాదాలు.

 విలువైన వస్తువులు మరింత భద్రంగా చూసుకోవడం మంచిది.

 ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.

 రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి.

 భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొనే సూచనలు.

 చిన్ననాటి స్నేహితులు తారసపడి ముఖ్య సమాచారం అందిస్తారు.

 ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

 వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.

 ఉద్యోగస్తులకు అనుకోని బదిలీలు లేదా బాధ్యతలు మీదపడవచ్చు.

 పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా.

 కళాకారులు నిర్ణయాలలో తొందరపడరాదు.

 శుక్ర, శనివారాల్లో ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు రాగలవు.

 తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

 వినాయకుని పూజించండి.

వృషభం…

 ——

 ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

 ఆలోచనలు స్థిరంగా ఉండవు.

 వివాదాలకు మరింతగా దూరంగా ఉండండి.

 ఆస్తుల విషయంలో సోదరులతో విభేదాలు.

 ఇంటాబయటా మీపై ఒత్తిడులు పెరుగుతాయి.

 చర్మం, గొంతు సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

 కష్టానికి తగ్గ ఫలితం దక్కక నిరాశ చెందుతారు.

 ఏదో ఒక సమస్య వేధిస్తునే ఉంటుంది.

 ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.

 వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.

 ఉద్యోగులకు మార్పులు జరిగే సూచనలు.

 రాజకీయ, సాంకేతిక రంగాల వారు అనుకున్న వ్యవహారాలలో వెనుకపడతారు.

 కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది.

 ఆది, సోమవారాలలో ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సన్మానయోగం. భార్యాభర్తల మధ్య సఖ్యత.

 ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

 విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం..

 —-

 రావలసిన సొమ్ము సకాలంలో అందదు. కొత్తగా రుణాలు చేస్తారు.

 బంధువులు మీపై అపవాదులు మోపవచ్చు, అప్రమత్తత పాటించండి.

 ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తప్పవు.

 ఆరోగ్యం, వాహనాల పట్ల నిర్లక్ష్యం వద్దు.

 ప్రముఖుల నుంచి సహాయం నిలిచిపోయే అవకాశం.

 కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు.

 ఆలోచనలు స్థిరంగా ఉండవు.

 దేవాలయాలు సందర్శిస్తారు.

 ఎంతగా కష్టపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు.

 ఆభరణాలు. డాక్యుమెంట్లు జాగ్రత్త.

 వ్యాపారులకు లాభాలు కనిపించవు. పెట్టుబడులు సైతం ఆలస్యమవుతాయి.

 ఉద్యోగస్తులకు అదనపు పనిభారం.

 రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు.

 కళాకారులకు అంచనాలు తప్పే అవకాశం.

 మహిళలకు మానసిక అశాంతి. కుటుంబసమస్యలు.

 బుధ, గురువారాలలో ధనలాభం. వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు.

 దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

 దుర్గాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం…

 ——–

 ఉత్సాహవంతంగా గడుపుతారు.

 పనుల్లో పురోగతి కనిపిస్తుంది.

 కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

 మీ అంచనాలు నిజమవుతాయి.

 సేవలకు గుర్తింపు లభించే సమయం.

 వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు.

 ఆత్మీయుల ఆదరణ పొందుతారు.

 ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

 భార్యాభర్తల మధ్య వివాదాలు తీరతాయి.

 వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి.

 ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

 పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి సన్మానయోగం.

 కళాకారులకు అవార్డులు దక్కే ఛాన్స్.

 బుధ, గురువారాలలో ధనవ్యయం. కుటుంబసమస్యలు, ఆరోగ్యం మందగిస్తుంది.

 పశ్చిమదిశ ప్రయాణాలు సానుకూలం.

 గణపతిని పూజించండి.

సింహం…

 ——

 వ్యయప్రయాసలు తప్పవు.

 ఏపని చేపట్టినా ముందుకు సాగదు.

 ఆలోచనలు నిలకడగా ఉండవు.

 బంధువులు, మిత్రులతో అకారణ వైరం.

 వాహనాలు, ఆభరణాలు జాగ్రత్త.

 చర్మ, గొంతు సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

 భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు, తద్వారా లేనిపోని చికాకులు.

 ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కొత్తగా రుణయత్నాలు సాగిస్తారు.

 ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

 విద్యార్థుల యత్నాలు నత్తనడకన సాగుతాయి.

 వ్యాపారులకు పెట్టుబడులకు తగిన లాభాలు కష్టమే.

 ఉద్యోగులకు బదిలీ అవకాశాలు.

 పారిశ్రామికరంగం వారికి విదేశీ సంస్థలతో వివాదాలు.

 కళాకారులు ఆచితూచి వ్యవహరించాలి.

 మహిళలకు కుటుంబంలో విమర్శలు.

 గురు, శుక్రవారాలలో విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. మిత్రులతో సఖ్యత.

 తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం.

 హనుమాన్ చాలీసా పఠించండి.

కన్య…

 —–

 ఆర్థికంగా ఇబ్బందులు అధిగమిస్తారు.

 ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.

 బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు.

 విచిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు.

 నిరుద్యోగులకు ఆశలు ఫలిస్తాయి. అనుకున్న ఉద్యోగాలు పొందే సూచనలు.

 ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

 చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

 ఈవారం ఉల్లావంతంగా ఉంటుంది.

 మీ ప్రావీణ్యం, ప్రతిభను అందరూ గుర్తిస్తారు.

 వ్యాపారాలలో అధికలాభాలు.

 ఉద్యోగులకు కొత్త హోదాలు రాగల అవకాశం.

 రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి.

 కళాకారులకు సన్మానయోగం.

 మహిళలకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు.

 ఆది, సోమవారాలలో వివాదాలు, అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిళ్లు.

 ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

 ఆదిత్య హృదయం పఠించండి.

తుల..

 —-

 ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.

 కొత్త వ్యక్తుల పరియం.

 అందరిలోనూ గుర్తింపు పొందుతారు.

 పనులు చకచకా సాగుతాయి.

 అనుకున్న వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు.

 ఇంటి నిర్మాణాలు చేపడతారు.

 ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది.

 ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

 గతంలోని సంఘటనలు నెమరువేసుకుంటారు.

 భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి.

 విలాసవంతంగా గడుపుతారు.

 వ్యాపారాలు విస్తరిస్తారు.

 ఉద్యోగులకు పదోన్నతులు సంభవం.

 రాజకీయవర్గాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

 కళాకారులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు.

 మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

 శుక్ర, శనివారాలలో ధననష్టం. కుటుంబంలో చికాకులు.

 పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

 అంగారకస్తోత్రం పఠించండి.

 

వృశ్చికం..

 —–

 రావలసిన సొమ్ము అందుతుంది.

 వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

 చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు.

 విచిత్రమైన సంఘటనలు.

 ఇంటాబయటా మీకు ఎదురుండదు.

 వివాదాల నుంచి క్రమేపీ గట్టెక్కుతారు.

 ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అంది ఉత్సాహంగా గడుపుతారు.

 పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు.

 ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య పరిష్కరించుకుంటారు.

 నిరుద్యోగుల కల ఫలిస్తుంది.

 సోదరులు, సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది.

 వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.

 ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కవచ్చు.

 పారిశ్రామికరంగం వారు శ్రమ ఫలించి ముందడుగు వేస్తారు.

 కళాకారులకు నూతనోత్సాహం.

 ఆది, సోమవారాలలో ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

 తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

 దుర్గామాతకు అర్చన చేయించుకుంటే మంచిది.

 

ధనుస్సు..

 —–

 ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు.

 ఆలోచనలు స్థిరంగా ఉండవు.

 ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి .

 రుణయత్నాలు ముమ్మరం చేయాల్సివస్తుంది.

 చర్మ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

 మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు అభ్యంతరం తెలపవచ్చు.

 వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి.

 ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

 ఇంటి నిర్మాణాలు నిలిచిపోయే అవకాశం.

 విద్యార్థులకు నిరాశాజనకం.

 వ్యాపారాలు ముందుకు సాగవు. లాభాలు కష్టమే.

 ఉద్యోగులకు స్థానచలన సూచనలు.

 పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది.

 కళాకారులకు అంచనాలు తప్పి గందరగోళంగా ఉంటుంది.

 శుక్ర, శనివారాలలో శుభవార్తలు. ధనలాభం. యత్నకార్యసిద్ధి. భార్యాభర్తల మధ్య వివాదాల సర్దుబాటు.

 దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

 విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 

మకరం…

 ——

 ఈవారం ప్రతి విషయంలోనూ అప్రమత్తత అవసరం.

 ఆస్తి వివాదాలు నెలకొంటాయి.

 కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు.

 ఆలోచనలు స్థిరంగా ఉండవు.

 బాధ్యతలతో సతమతమవుతారు.

 మీ ఆశయాలకు కుటుంబసభ్యుల నుంచి ప్రతిబంధకాలు.

 ఆరోగ్యం ముఖ్యంగా ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

 విలువైన డాక్యుమెంట్లు, ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి.

 ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

 వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. లాభాలు ఆశించిన విధంగా ఉండవు.

 ఉద్యోగులకు మార్పులు అనివార్యం.

 పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహమే.

 కళాకారులు కొంత ఒత్తిళ్లు ఎదుర్కొంటారు.

 ఆది, సోమవారాలలో శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు.

 ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.

 

కుంభం..

 ——

 వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.

 ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది.

 సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.

 మీసేవలకు మంచి గుర్తింపు రాగలదు.

 అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.

 ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

 సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

 ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి.

 విద్యార్థుల యత్నాలు సఫలం.

 వ్యాపారాలు పుంజుకుంటాయి. అనుకున్న లాభాలు తథ్యం.

 ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. విధుల్లో ఆటంకాలు తొలగుతాయి.

 రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, పదవీయోగం.

 కళాకారులకు కొత్త అవకాశాలు. అవార్డులు.

 శుక్ర, శనివారాలలో వ్యయప్రయాసలు. అనారోగ్యం, ఔషధసేవనం. చోరభయం.

 పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

 విష్ణుసహ స్రనామ పారాయణ చేయండి.

 

మీనం…

 ——

 ఇంటాబయటా మీకు అనుకూల పరిస్థితులు.

 ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది.

 ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.

 ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.

 విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

 పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.

 చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

 స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు.

 వివాహయత్నాలు కలసివస్తాయి.

 వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

 ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

 పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.

 కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. సన్మానయోగం.

 మహిళలకు మనోస్థైర్యం పెరుగుతుంది.

 ఆది, సోమవారాలలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు.

 దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

 హనుమాన్ పూజలు చేయండి.

Tags: srikaram subhakaram zee telugu program, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu, janmakundali.com, Zee Telugu Srikaram Subhakaram 29th June 2014, srikaram subhakaram zee telugu,