18వేల నాటి శంఖం … ‘ఓంకారం’ శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉందట !

0

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఓ అతిపెద్ద శంఖం ఇప్పటికీ ఓంకారాన్ని ధ్వనిస్తూనే ఉందంట. దశాబ్దాలుగా ఒక మ్యూజియంలో ఉన్న ఈ శంఖాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయినప్పటికీ ఆ శంఖం ఇంకా పనిచేస్తూనే ఉందని అంటున్నారు పురావస్తు శాఖ అధికారులు. 1931లో ఫ్రెంచ్ పైరినీస్లో చరిత్రకు సంబంధించిన పూర్వ చిత్రాల ద్వారా ఒక గుహను తవ్వినప్పుడు ఈ శంఖం బయటపడింది. ఆ తర్వాత ఈ శంఖాన్ని మ్యూజియంకు తరలించారు.

అప్పటినుంచి అక్కడే ఉండగా ఇటీవలే టౌలౌస్ యూనివర్శిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు బయటకు తీశారు. వేల ఏళ్ల క్రితం నాటి పవన పరికరంగా పిలుస్తున్నారు. ఇందులో నుంచి గాఢమైన డీ నోట్లను రిలీజ్ చేస్తుంటుంది. దీని శబ్దాన్ని మొదటిసారి విన్నప్పుడు చాలా ఒత్తిడిగా అనిపించిందని పురావస్తు శాస్త్రవేత్త కరోల్ ఫ్రిట్జ్ అన్నారు.

12-అంగుళాల శంఖాన్ని గాలితో ఊదడం వల్ల దెబ్బతింటుందని మొదట్లో సైంటిస్ట్ కరోల్ భావించారు. కానీ అది జరగలేదు. సి సి అనే తరంగాల డి నోట్లను ఉత్పత్తి చేసింది. సుమారు 18000 ఏళ్ల నాటిదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. పురాతన గ్రీస్ జపాన్ ఇండియా పెరూతో సహా సంగీత ఉత్సవాల్లో శంఖాలను విస్తృతంగా ఉపయోగిస్తుంటారు.

మార్సౌలాస్ గుహలో దొరికిన ఈ శంఖం వాయిద్యం మంత్రముగ్దుల్ని చేస్తుందని అంటుంటారు. ఇంతకుముందు సిరియాలో దొరికిన పెద్ద శంఖం సుమారు 6000 ఏళ్ల నాటిదని మరో టౌలౌస్ పురావస్తు శాస్త్రవేత్త గిల్లెస్ చెప్పారు. శంఖంలోని కొన్ని అసాధారణ రంధ్రాలను పరిశోధకులు గమనించారు. శంఖం కొన విచ్ఛిన్నమైందని గుర్తించారు. దీని ద్వారా పెద్ద రంధ్రం ఏర్పడుతుంది. మైక్రోస్కోపిక్ ద్వారా చిన్న మెడికల్ కెమెరాను చొప్పించి పరీక్షించారు. శంఖం లోపలి గదిలో మరొక రంధ్రం ఉందని కనుగొన్నారు. మార్సౌలాస్ గుహ గోడపై కనిపించే అలంకార నమూనాతో సరిపోయే శంఖం ముఖద్వారం మీద ఎరుపు వర్ణద్రవ్యం ఆనవాళ్లను కనుగొన్నారు