2000 కోట్లు..ఒక్క నియోజక వర్గానికే జగన్ ఎందుకు ఇచ్చాడంటే

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడప పై మమకారం ప్రదర్శించుకోవడంలో ఎలాంటి మొహమాటం పడటం లేదు. కడప జిల్లా వాసుల కలలు సాకారం చేసే ఏపీ హై గ్రేడ్ స్టీల్ లిమిటెడ్ (కడప స్టీల్ ప్లాంట్)కు శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్సార్ జిల్లా రాయచోటిలో రూ.2 వేల కోట్లకుపైగా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రకాశం జిల్లాల్లో గత ప్రభుత్వం కాలువలను పట్టించుకోకపోవడం సామర్థ్యాన్ని పెంచకపోవడం సహాయ పునరావాసం డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు నీళ్లు ఉన్నా డ్యాముల్లో నింపలేని దుస్థితి ఉందన్న జగన్ సాగునీటి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టడం తో పాటు ప్రధాన కాలువలను విస్తరించి కరువును పారదోలేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో కృషి చేస్తోందని తెలిపారు.

రిజర్వాయర్లు ఉన్నా నీటిని నింపుకోలేని దుస్థితిలో రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. “ఈ ఏడాది శ్రీశైలంలో వరదలు వచ్చాయి. ఎనిమిది సార్లు గేట్లు ఎత్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపు 800 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఇన్ని రోజులు కృష్ణా నది నిండుగా ప్రవహించినా రాయలసీమలోని ప్రాజెక్టులు మాత్రం నిండని పరిస్థితి కనిపిస్తోంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటంటే గండికోట పూర్తి సామర్థ్యం 26 టీఎంసీలు కాగా ఇంత భారీ వర్షాలు పైనుంచి నీళ్లు వచి్చనా కేవలం 12 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం.చిత్రావతి కెపాసిటీ 10 టీఎంసీలు అయితే నింపగలిగింది కేవలం ఆరు టీఎంసీలు మాత్రమే. 17.3 టీఎంసీల కెపాసిటీ కలిగిన బ్రహ్మంసాగర్లో కేవలం ఎనిమిది టీఎంసీలు మాత్రమే నింపగలిగే అధ్వానమైన పరిస్థితి.“ అని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి కాలువల సామర్థ్యం పెంచి ఉంటే రాయలసీమ ప్రకాశం నెల్లూరులో ప్రాజెక్టుల దశ దిశ మారిపోయి ఉండేవని..ఇప్పుడు తాము మొదటి నుంచి చేసుకురావాల్సి వస్తోందన్నారు.

40–50 రోజులకు మించని రీతిలో కృష్ణా నదికి వరదలు వచ్చే పరిస్థితి కనిపిస్తోందని జగన్ తెలిపారు.`వరద వచ్చినప్పుడే రాయలసీమలోని ప్రతి డ్యామ్ నిండాలి నెల్లూరు ప్రకాశం లోనూ ప్రాజెక్టులు నిండాలి. దీనికోసం ఏం చేయాలనే ఆలోచన జరిగింది ఈ ఆర్నెళ్లలో. ఈ దిశగా ముందడుగు వేస్తూ వరద జలాలను సద్వినియోగం చేసుకుంటాం. ప్రాజెక్టులు నిండాలి రైతుల కోసం ఎంత చేసినా కూడా తక్కువే యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు తయారు చేయాలి’ అని అధికారులకు ఇప్పటికే స్పష్టం చేసినట్లు జగన్ తెలిపారు. రాయచోటి గురించి జగన్ వివరిస్తూ “ రాయల సీమే వెనకకబడిన ప్రాంతమైతే అందులోనూ అత్యంత వెనకబాటు కు గురైన ప్రాంతం రాయచోటి. దివంగత వైఎస్సార్ ను అత్యధికంగా ప్రేమించే ప్రాంతం కూడా ఇదే. వైఎస్సార్ ఈ ప్రాంత దుస్థితిని చూసి వెలిగల్లు రిజర్వాయర్ నిరి్మంచారు. రాయచోటిలో ఔటర్ రింగ్ రోడ్డు కూడా తెచ్చారు. నాన్న చని పోయిన తరువాత రాయచోటి గురించి పట్టించుకోవాలనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఒక్కరంటే ఒక్కరు కూడా లేని పరిస్థితి ని పదేళ్లు గా చూస్తున్నాం. దాన్ని మన ప్రభుత్వంలో మార్చుకుందాం.ఆర్నెళ్లు తిరగక ముందే రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి రూ.2000 కోట్లకు పైచిలుకు ఖర్చు పెడుతున్నామని సగర్వంగా చెబుతున్నా. “ అని తెలిపారు.
Please Read Disclaimer